త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ISRO Apprentice | ఇస్రో విక్ర‌మ్ సారాభాయ్ స్పేస్‌ సెంట‌ర్‌లో అప్రెంటిస్‌లు.. రాత ప‌రీక్ష లేకుండానే..

ISRO Apprentice | త్రినేత్ర‌.న్యూస్‌: భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ (ISRO) తిరువ‌నంత‌పురంలోని విక్ర‌మ్ సారాభాయ్ స్పేస్‌ సెంట‌ర్ (VSSC)లో అప్రెంటిస్ ట్రైనీల (Apprentice Trainee) భర్తీకి ద‌ర‌ఖాస్తులు (ISRO Apprentice) ఆహ్వానిస్తున్న‌ది. మొత్తం 460 ఖాళీల‌తో నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

G

National | Published On Jul 19, 2026, 7.03 am IST

ISRO Apprentice | ఇస్రో విక్ర‌మ్ సారాభాయ్ స్పేస్‌ సెంట‌ర్‌లో అప్రెంటిస్‌లు.. రాత ప‌రీక్ష లేకుండానే..
Advertisement

ISRO Apprentice | త్రినేత్ర‌.న్యూస్‌: భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ (ISRO) తిరువ‌నంత‌పురంలోని విక్ర‌మ్ సారాభాయ్ స్పేస్‌ సెంట‌ర్ (VSSC)లో అప్రెంటిస్ ట్రైనీల (Apprentice Trainee) భర్తీకి ద‌ర‌ఖాస్తులు (ISRO Apprentice) ఆహ్వానిస్తున్న‌ది. మొత్తం 460 ఖాళీల‌తో నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ 273, టెక్నీషియ‌న్ అప్రెంటీస్ 187 ఉన్నాయి. ఇంజినీరింగ్‌, హోట‌ల్ మేనేజ్‌మెంట్‌, డిగ్రీ, డిప్లొమా చేసిన వారు అర్హులు. ఎలాంటి రాత ప‌రీక్ష లేకుండా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్థారు. ఆస‌క్తి క‌లిగిన వారు జూలై 25న (శ‌నివారం) జ‌రిగే ఇంట‌ర్వ్యూకి స్వ‌యంగా హాజ‌రుకావ‌చ్చు.

మొత్తం ఖాళీలు: 460
ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ 273 (ఏరోనాటిక‌ల్స్‌/ఏరోస్పేస్ ఇంజినీరింగ్ 15, కెమిక‌ల్ ఇంజినీరింగ్ 10, సివిల్ ఇంజినీరింగ్ 12, కంప్యూట‌ర్ సైన్స్ 20, ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్ 12, ఎల‌క్ట్రానిక్స్ 43, మెకానిక‌ల్ 45, మెట‌లర్జీ 6, ప్రొడ‌క్ష‌న్ ఇంజినీరింగ్ 4, ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజినీరింగ్ 2, హోట‌ల్ మేనేజ్‌మెంట్ / క్యాట‌రింగ్ టెక్నాల‌జీ 4, డిగ్రీ- 100), టెక్నీషియ‌న్ అప్రెంటీస్ 187 (ఆటోమొబైల్ ఇంజినీరింగ్ 8, కెమిక‌ల్ ఇంజినీరింగ్ 25, సివిల్ ఇంజినీరింగ్ 8, కంప్యూట‌ర్ సైన్స్ 15, ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్ 10, ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 40, ఇన్‌స్ట్రుమెంట్ టెక్నాల‌జీ 6, మెకానిక‌ల్ ఇంజినీరింగ్ 50, క‌మ‌ర్షియ‌ల్ ప్రాక్టీస్‌లో డిప్లొమా 25)

అర్హ‌త‌లు: డిగ్రీ, సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్, డిప్లొమా, హోట‌ల్ మేనేజ్‌మెంట్ చేయాలి. పిజీ చేసిన‌వారు అర్హులు కాదు.

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ద్వారా. ఈ నెల 25న జ‌రిగే ఇంట‌ర్య్వూకి అభ్య‌ర్థులు త‌మ ఒరిజిన‌ల్ స‌ర్టిఫికెట్ల‌తో హాజ‌రుకాల్సి ఉంటుంది. అక్క‌డే అప్లికేష‌న్ ఫామ్ నింపి ఇవ్వాలి. అక‌డ‌మిక్ మార్కుల ఆధారంగా ఇంట‌ర్వ్యూకి పిలుస్తారు. ఏడాదిపాటు కోర్సు ఉంటుంది. శిక్ష‌ణ స‌మ‌యంలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.12,300, టెక్నీషియ‌న్‌కు రూ.10,900 స్ట‌యిఫండ్‌ ప్ర‌తినెల చెల్లిస్తారు.

ఇంట‌ర్వ్యూ తేదీ: జూలై 25 (శ‌నివారం)
అడ్ర‌స్: Karthika Thirunal Govt V&GHSS for Girls,
Manacaud,
Thiruvananthapuram,
Kerala

మ‌రిన్ని వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..

 

Advertisement
Advertisement