త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tigress vs Buffaloes | ఆడ పులిపై బ‌ర్రెల దాడి.. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ య‌జ‌మాని

Tigress vs Buffaloes | పులులు ఇత‌ర జంతువుల‌ను వేటాడి.. చంపేస్తుంటాయి. ర‌క్తాన్ని క‌ళ్లారా చూసి రాక్ష‌సానందం పొందుతాయి పులులు. కానీ ఈ ఘ‌ట‌న‌లో మాత్రం సీన్ రివ‌ర్స్ అయింది. ఓ రెండు బ‌ర్రెలు క‌లిసి ఓ ఆడ పులికి చుక్క‌లు చూపించాయి. బ‌ర్రెల దాడిని త‌ట్టుకోలేని ఆ పులి తోక ముడిచింది.

S

National | Published On Aug 13, 2026, 6.05 pm IST

Tigress vs Buffaloes | ఆడ పులిపై బ‌ర్రెల దాడి.. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ య‌జ‌మాని
Advertisement

Tigress vs Buffaloes | త్రినేత్ర.న్యూస్ : పులులు ఇత‌ర జంతువుల‌ను వేటాడి.. చంపేస్తుంటాయి. ర‌క్తాన్ని క‌ళ్లారా చూసి రాక్ష‌సానందం పొందుతాయి పులులు. కానీ ఈ ఘ‌ట‌న‌లో మాత్రం సీన్ రివ‌ర్స్ అయింది. ఓ రెండు బ‌ర్రెలు క‌లిసి ఓ ఆడ పులికి చుక్క‌లు చూపించాయి. బ‌ర్రెల దాడిని త‌ట్టుకోలేని ఆ పులి తోక ముడిచింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని బాంధ‌వ్‌గ‌ర్హ్ అట‌వీ ప్రాంతంలో ఓ రెండు బ‌ర్రెలు త‌ప్పిపోయాయి. దీంతో ఆ బ‌ర్రెల ఆచూకీ కోసం య‌జ‌మాని రామ్‌న‌రేశ్ సింగ్ గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టాడు. బాంధ‌వ్‌గ‌ర్హ్ టైగ‌ర్ రిజ‌ర్వ్‌లోని ప‌న్‌ప‌థా కోర్ ఏరియాలో రామ్‌న‌రేశ్ బ‌ర్రెల కోసం వెతుకుతుండ‌గా.. ఓ ఆడ‌పులి అత‌నిపై ఆక‌స్మాత్తుగా దాడి చేసింది. బ‌ర్రెల య‌జ‌మానిని చంపే ప్ర‌య‌త్నం చేసింది.

అయితే స‌మీపంలో ఉన్న బ‌ర్రెలు త‌మ య‌జ‌మాని ప్రాణ‌పాయ స్థితిలో ఉన్నాడ‌ని గ‌మ‌నించాయి. తీవ్ర గాయాల‌పాలై ర‌క్త‌స్రావంతో బాధ‌ప‌డుతున్న రామ్‌న‌రేశ్‌ను ఎలాగైనా ప్రాణాల‌తో ద‌క్కించుకోవాల‌ని బ‌ర్రెలు నిర్ణ‌యించుకున్నాయి. ఇంకేముంది.. త‌మ ప్రాణాల‌ను సైతం లెక్క చేయ‌కుండా ఆ మూగ‌జీవాలు.. ఆడ పులిపై ఎదురుదాడి చేశాయి. బ‌ర్రెల దాడికి త‌ట్టుకోలేని ఆ పులి తోక ముడిచి ప‌రారైంది.

రామ్ న‌రేశ్‌ను ప‌శువుల కాప‌రులు గ‌మ‌నించి.. ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం బాధితుడి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. కోలుకున్న వెంట‌నే డిశ్చార్జి చేస్తామ‌న్నారు.

ఈ సంద‌ర్భంగా రామ్ న‌రేశ్ మాట్లాడుతూ.. నా బ‌ర్రెలే న‌న్ను ప్రాణాల‌తో కాపాడాయి.. స‌మ‌యానికి బ‌ర్రెలు అక్క‌డ లేక‌పోతే నా ప్రాణాలు పోయేవి. పులి దాడిలో నేను చ‌నిపోయానని అనుకున్నాను. కానీ బ‌ర్రెలు నన్ను ర‌క్షించాయని రామ్ న‌రేశ్ సింగ్ క‌న్నీరు పెట్టుకున్నారు. ఇక త‌క్ష‌ణ ఆర్థిక సాయం కింద‌.. బాధితుడికి అట‌వీశాఖ అధికారులు రూ. 3 వేలు అంద‌జేశారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement