High Court | పవన్‌కు షాక్.. హౌస్ మోషన్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు
High Court | జనసేనా పార్టీకి హైకోర్టులో షాక్ తగిలింది. హౌస్ మోషన్ పిటిషన్ కింద విచారించాల్సిన తీవ్రత పిటిషన్‌లో లేదంటూ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
త్రినేత్ర.న్యూస్: జనసేనా పార్టీకి హైకోర్టులో షాక్ తగిలింది. హైదరాబాద్‌లో నవ నిర్మాణ సభ నిర్వహించేందుకు అనుమతి లభించకపోవడంతో జనసేనా హైకోర్టును ఆశ్రయించింది. సైబరాబాద్ పోలీసుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ అత్యవసర విచారణ కోరుతూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్‌ను స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించింది. హౌస్ మోషన్ పిటిషన్ కింద విచారించాల్సిన తీవ్రత పిటిషన్‌లో లేదంటూ పిటిషన్‌ను తిరస్కరించింది.
కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన పాశం యాదగిరి..
సభకు అనుమతివ్వలేమని పోలీసులు సోమవారమే జనసేనకు సమాచారమిచ్చారు. దీంతో నేడు అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి విచారణ జరపాలని జనసేన కోరింది. ఈ వ్యవహారంలో ప్రముఖ జర్నలిస్ట్ పాశం యాదగిరి కేవియెట్ పిటిషన్ దాఖలు చేసి తమ వాదనలు వినకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోర్టును కోరారు. ఇరు పక్షాల అంశాలను పరిశీలించిన కోర్టు.. జనసేన హౌస్ మోషన్ పిటిషన్‌ను కొట్టివేసింది.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో నవనిర్మాణ పేరిట సభ నిర్వహణకు జనసేన ప్రయత్నించింది. అయితే తెలంగాణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలు, ఇక్కడి రాజకీయ నేతల ఖండన, తాజా రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో జనసేన కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు సాయంత్రం పవన్ కల్యాణ్ నిర్వహించబోయే ప్రెస్‌మీట్ పై సర్వత్రా ఉత్కంఠ మొదలైంది.
తాజావార్తలు
- ●US Shooting | అమెరికాలో నలుగురి ప్రాణాలు తీసిన దుండగుడు..
- ●Navaratri Brahmotsavams | తిరుమలలో గజవాహనంపై మలయప్పస్వామి దివ్యదర్శనం
- ●FSSAI | నెస్లే, హిందుస్థాన్ యూనిలీవర్‌కు FSSAI నోటీసులు!
- ●Ajay Devgn | అజయ్ దేవ్‌గణ్ నివాసంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత - క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్...
- ●ACB Raids | కీసర ఇన్స్పెక్టర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. రూ.2.28 కోట్ల ఆస్తులు గుర్తింపు..
- ●Traffic Advisory | సద్దుల బతుకమ్మ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

US Shooting | అమెరికాలో నలుగురి ప్రాణాలు తీసిన దుండగుడు..

Navaratri Brahmotsavams | తిరుమలలో గజవాహనంపై మలయప్పస్వామి దివ్యదర్శనం

FSSAI | నెస్లే, హిందుస్థాన్ యూనిలీవర్‌కు FSSAI నోటీసులు!

Ajay Devgn | అజయ్ దేవ్‌గణ్ నివాసంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత - క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్...





