Strictest Action | మోదీ జీ.. మీరు తీసుకునే కఠిన చర్య ఇదేనా?.. ప్రధాని ప్రకటనకు సీజేపీ కౌంటర్
Strictest Action | పేపర్ లీక్‌లపై (NEET Paper Leak) కఠిన చర్యలు తీసుకునే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్ల ప్రధాని మోదీ (PM Modi) అర్ధరాత్రి చేసిన ప్రకటనపై కాక్రోచ్ జనతాపార్టీ (CJP) వ్యంగ్యంగా స్పందించింది.
Strictest Action | త్రినేత్ర.న్యూస్: పేపర్ లీక్‌లపై (NEET Paper Leak) కఠిన చర్యలు తీసుకునే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్ల ప్రధాని మోదీ (PM Modi) అర్ధరాత్రి చేసిన ప్రకటనపై కాక్రోచ్ జనతాపార్టీ (CJP) వ్యంగ్యంగా స్పందించింది. ప్రహరీ గోడలు లేని ఒక కాంపౌండ్ గేటుకు ఓ వ్యక్తి తాళం వేస్తున్న ఫొటోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే (Abhijeet Dipke).. ఇదేనా మీరు తీసుకునే కఠిన చర్య (Strictest Action) అంటూ ప్రధాని మోదీని ప్రశ్నించారు.
మోదీ జీ, రేపే ధర్మేంద్ర ప్రధాన్‌ను (Dharmendra Pradhan) తొలగించండి. మీరు తీసుకోగల అత్యంత కఠినమైన చర్య అదే అంటూ సీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా (Ashutosh Ranka) అన్నారు. ఒక్క మంత్రి పదవి లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కంటే గొప్పది కాదని, విద్యార్థుల న్యాయం కోసం తమ పోరాటం సాగుతుందని ప్రకటించారు. ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధమేనని, అయితే మంత్రి రాజీనామా డిమాండ్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని సీజేపీ ఇప్పటికే స్పష్టం చేసింది.
Strict actions. https://t.co/4KWlyn8hiR pic.twitter.com/Y5Z5vGSTCo
— Abhijeet Dipke (@abhijeet_dipke) July 23, 2026
విద్యార్థులను అవమానించొద్దు: రాహుల్ గాంధీ
మరోవైపు ప్రధాని సెల్ఫీ వీడియో ప్రకటనపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మండిపడ్డారు. మంత్రితో రాజీనామా చేయించకుండా విద్యార్థులను అవమానించొద్దని మోదీకి చురకలంటించారు. దేశానికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని, ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు కోరుకునేది ఇదేనని స్పష్టం చేశారు. లీకులకు పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులపై లాఠీ చార్జి చేసిన వాళ్లపైనా చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని మోదీ వీడియోను ట్యాగ్‌చేస్తూ రీట్వీట్ చేశారు.
Mr. Modi, our students are demanding Dharmendra Pradhan’s resignation.
Don’t insult their intelligence with this pathetic midnight video.
1. Sack Pradhan.
2. Punish those who beat students.
3. Apologise https://t.co/7SLB6pQqZx— Rahul Gandhi (@RahulGandhi) July 23, 2026
కాగా, పేపర్ లీక్‌లకు చెక్‌పెట్టేలా పార్లమెంటులో బిల్లు తీసుకొస్తామని, దీనిపై శుక్రవారం నాటి క్యాబినెట్‌లో చర్చిస్తామని ప్రధాని మోదీ అర్ధరాత్రి సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పేపర్ లీక్‌లకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకునేలా తమ నిర్ణయం ఉంటుందని ప్రకటించారు.
తాజావార్తలు
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన






