DSSSB | జిల్లా కోర్టులు, ఫ్యామిలీ కోర్టుల్లో 641 ఉద్యోగాలు.. ఈ నెల 6 నుంచి దరఖాస్తులు..
DSSSB | జిల్లా కోర్టులు, ఫ్యామిలీ కోర్టుల్లో (Family Courts) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (DSSSB) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. మొత్తం 641 పోస్టుల భర్తీకి కంబైన్డ్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
DSSSB | త్రినేత్ర న్యూస్: ఢిల్లీ జిల్లా కోర్టులు, ఫ్యామిలీ కోర్టుల్లో (Family Courts) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (DSSSB) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. మొత్తం 641 పోస్టుల భర్తీకి కంబైన్డ్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు. అక్టోబర్ 6 నుంచి ఆన్‌లైన్‌లో (dsssb.delhi.gov.in లేదా dsssbonline.nic.in) దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ జ్యూడీషియల్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్, ప్యూన్, ఆర్డర్లీ, డాక్ ప్యూన్ వంటి పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
మొత్తం ఖాళీలు: 641
సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ (డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులు)- 27 (జనరల్ 10, బీసీ 8, ఎస్సీ 3, ఎస్టీ 5, ఈడబ్ల్యూఎస్ 1)
పర్సనల్ అసిస్టెంట్(డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులు)- 189 (జనరల్ 37, బీసీ 52, ఎస్సీ 49, ఎస్టీ 37, ఈడబ్ల్యూఎస్ 14)
పర్సనల్ అసిస్టెంట్(ఫ్యామిలీ కోర్టులు)- 17 (జనరల్ 6, బీసీ 4, ఎస్సీ 2, ఎస్టీ 3, ఈడబ్ల్యూఎస్ 2)
జూనియర్ జ్యూడీషియల్ అసిస్టెంట్ (డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులు)- 151 (జనరల్ 63, బీసీ 40, ఎస్సీ 22, ఎస్టీ 11, ఈడబ్ల్యూఎస్ 15)
జూనియర్ జ్యూడీషియల్ అసిస్టెంట్ (ఫ్యామిలీ కోర్టులు)- 23 (జనరల్ 7, బీసీ 7, ఎస్సీ 4, ఎస్టీ 3, ఈడబ్ల్యూఎస్ 2)
ప్రాసెస్ సర్వర్ (డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులు)- 91 (జనరల్ 38, బీసీ 25, ఎస్సీ 13, ఎస్టీ 6, ఈడబ్ల్యూఎస్ 9)
ప్రాసెస్ సర్వర్ (ఫ్యామిలీ కోర్టులు)- 1 (ఎస్సీ 1)
ప్యూన్/ఆర్డర్లీ/డాక్ ప్యూన్ (డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులు)- 139 (జనరల్ 56, బీసీ 38, ఎస్సీ 21, ఎస్టీ 10, ఈడబ్ల్యూఎస్ 14)
ప్యూన్/ఆర్డర్లీ/డాక్ ప్యూన్ (ఫ్యామిలీ కోర్టులు)- 3 (బీసీ 2, ఎస్సీ 1)
అర్హతలు
- సీనియర్ పర్సనల్ అసిస్టెంట్‌లకు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 110, టైపింగ్‌లో నిమిషానికి 40 పదాల స్పీడ్ ఉండాలి.
- పర్సనల్ అసిస్టెంట్‌లకు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 100, టైపింగ్‌లో నిమిషానికి 40 పదాల స్పీడ్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.
- జూనియర్ జ్యూడీషియల్ అసిస్టెంట్‌లకు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూర్‌పై నిమిషానికి 40 పదాల స్పీడ్ ఉండాలి.
ప్రాసెస్ సర్వర్‌లకు మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణతతో పాటు LMV డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్‌లో 2 సంవత్సరాల అనుభవం అవసరం. - ప్యూన్/ఆర్డర్లీ/డాక్ ప్యూన్‌లకు మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
అన్ని పోస్టులకు అభ్యర్థులు 2026, జూన్ 1 నాటికి 18 నుంచి 27 ఏండ్లలోపు ఉండాలి. ఓబీసీలకు 3, ఎస్సీ, ఎస్టీలకు 5, జనరల్/ఈడబ్ల్యూఎస్ దివ్యాంగులకు 10, ఓబీసీ దివ్యాంగులకు 13, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు 15 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
ఎంపిక విధానం
- సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ జ్యూడీషియల్ అసిస్టెంట్‌లకు రాత పరీక్ష, డిస్క్రిప్టివ్ ఇంగ్లిష్ టెస్ట్, షార్ట్‌హ్యాండ్, టైపింగ్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- ప్రాసెస్ సర్వర్‌లకు రాత పరీక్ష, డ్రైవింగ్/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- ప్యూన్/ఆర్డర్లీ/డాక్ ప్యూన్‌లకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు ఫీజు: రూ. 100, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఫీజు లేదు.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 6 (మధ్యాహ్నం 12 గంటల నుంచి)
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 4 (రాత్రి 11 గంటల వరకు)
వెబ్‌సైట్: dsssb.delhi.gov.in లేదా dsssbonline.nic.in
మరిన్ని వివరాలకు..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Kumkum Mohod | రికర్వ్ ఆర్చరీలో భారత్‌కు మరో స్వర్ణం.. ఆసియా క్రీడల్లో కుమ్కుమ్ సరికొత్త చరిత్ర
- ●PCC Chief | పీసీసీ చీఫ్‌గా భారత హాకీ మాజీ కెప్టెన్.. అమరీందర్ రాజీనామాతో పర్గత్‌కు అవకాశం
- ●Horoscope | అక్టోబర్ 3 రాశిఫలాలు.. ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ అవసరం!
- ●TUWJ | హెల్త్ కార్డుల కోసం జర్నలిస్టుల పోస్టు కార్డు ఉద్యమం
- ●ల్యాప్‌టాప్ షట్‌డౌన్… మైండ్ ఇంకా ఆన్‌లైన్! ఐటీ ఉద్యోగులను వేధించే బర్నౌట్
- ●Tamil Nadu | తమిళనాడులో హైవే బోర్డులపై హిందీ.. ఇద్దరు అధికారుల సస్పెండ్

Kumkum Mohod | రికర్వ్ ఆర్చరీలో భారత్‌కు మరో స్వర్ణం.. ఆసియా క్రీడల్లో కుమ్కుమ్ సరికొత్త చరిత్ర

PCC Chief | పీసీసీ చీఫ్‌గా భారత హాకీ మాజీ కెప్టెన్.. అమరీందర్ రాజీనామాతో పర్గత్‌కు అవకాశం

Horoscope | అక్టోబర్ 3 రాశిఫలాలు.. ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ అవసరం!

TUWJ | హెల్త్ కార్డుల కోసం జర్నలిస్టుల పోస్టు కార్డు ఉద్యమం






