IOCL Recruitment | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో 470 ఎగ్జిక్యూటివ్ పోస్టులు..
IOCL Recruitment | దేశంలో అతిపెద్ద చమురు శుద్ధి, పంపిణీ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. మొత్తం 470 పోస్టులతో నోటిఫికేషన్ (IOCL Recruitment) విడుదల చేసింది.
IOCL Recruitment | త్రినేత్ర.న్యూస్: దేశంలో అతిపెద్ద చమురు శుద్ధి, పంపిణీ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. మొత్తం 470 పోస్టులతో నోటిఫికేషన్ (IOCL Recruitment) విడుదల చేసింది. సెప్టెంబర్ 3 వరకు ఆన్లైన్లో www.iocl.com దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో గ్రాడ్యుయేట్ ఇంజినీర్, ఆఫీసర్ (మార్కెటింగ్), లా ఆఫీసర్, అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, డిప్లొమా ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రతినెల రూ.30 వేల నుంచి రూ.50 వరకు జీతం వస్తుంది.
మొత్తం పోస్టులు: 470
- సివిల్- 62 (జనరల్ 25, ఈడబ్ల్యూఎస్ 6, ఓబీసీ 17, ఎస్సీ 11, ఎస్టీ 3)
- కెమికల్-16 (జనరల్ 11, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 2, ఎస్సీ 1, ఎస్టీ 1)
- ఎలక్ట్రికల్- 75 (జనరల్ 32, ఈడబ్ల్యూఎస్ 7, ఓబీసీ 20, ఎస్సీ 11, ఎస్టీ 5)
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్- 32 (జనరల్ 13, ఈడబ్ల్యూఎస్ 4, ఓబీసీ 8, ఎస్సీ 6, ఎస్టీ 1)
- మెకానికల్- 118 (జనరల్ 49, ఈడబ్ల్యూఎస్ 12, ఓబీసీ 32, ఎస్సీ 19, ఎస్టీ 6)
- ఇన్స్ట్రుమెంటేషన్- 35 (జనరల్ 17, ఈడబ్ల్యూఎస్ 3, ఓబీసీ 8, ఎస్సీ 5, ఎస్టీ 2)
- కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ- 22 (జనరల్ 11, ఈడబ్ల్యూఎస్ 2, ఓబీసీ 4, ఎస్సీ 3, ఎస్టీ 2)
- లా- 10 (జనరల్ 4, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 2, ఎస్సీ 2, ఎస్టీ 1)
- మార్కెటింగ్- 41 (జనరల్ 17, ఈడబ్ల్యూఎస్ 4, ఓబీసీ 11, ఎస్సీ 7, ఎస్టీ 2)
- క్వాలిటీ కంట్రోల్ (కెమిస్ట్రీ)-9 (జనరల్ 6, ఎస్సీ 1, ఎస్టీ 2)
- ఎలక్ట్రికల్- 14 (జనరల్ 8, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 2, ఎస్సీ 1, ఎస్టీ 2)
- మెకానికల్-21 (జనరల్ 12, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 4, ఎస్సీ 2, ఎస్టీ 2)
- సేఫ్టీ-15 (జనరల్ 8, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 2, ఎస్సీ 2, ఎస్టీ 2)
అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. అభ్యర్థుల గరిష్ట వయస్సు గ్రాడ్యుయేట్ ఇంజినీర్ పోస్టులకు 26, డిప్లొమా ఇంజినీర్ 26, ఆఫీసర్ (మార్కెటింగ్) 28, లా ఆఫీసర్ 30, అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ పోస్టులకు 30 ఏండ్ల ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష (CBT), గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా
రాతపరీక్షలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 20, లాజికల్ రీజనింగ్ 15, వెర్బల్ ఎబిలిటీ (ఇంగ్లిష్) 15, పోస్ట్ స్పెసిఫిక్ టెక్నికల్ లేదా డొమైన్ ప్రశ్నలు 50 చొప్పున అడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలు, 100 మార్కులు. 150 నిమిషాల్లో పరీక్ష పూర్తి చేయాలి. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోత విధిస్తారు.
దరఖాస్తులు: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.1000+జీఎస్టీ
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 3
అడ్మిట్ కార్డులు: సెప్టెంబర్ 15
సీబీటీ రాతపరీక్ష: సెప్టెంబర్ 24
వెబ్సైట్: www.iocl.com
మరిన్ని వివరాలకు..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Anil Ravipudi | రామాయణం ఆధారంగా అనిల్ రావిపూడి సినిమా - జననాయగన్ మేకర్స్‌తో డీల్
- ●e-rickshaw battery blast | ఈ రిక్షా బ్యాటరీ పేలి భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి
- ●Gold And Silver Prices Today | మళ్లీ పరుగులు పెడుతున్న పసిడి.. పెట్టుబడిదారుల ఆసక్తి..
- ●Chinnareddy | తప్పుడుగాండ్లను పార్టీ నుంచి బయటకు పంపాలి.. లేదంటే నేను మరో జీవన్ రెడ్డి కావాల్సివస్తది: చిన్నారెడ్డి
- ●IPO | ఈ వారంలో ఐపీఓల జోరు.. రూ.6,400 కోట్లకు పైగా ఇష్యూలు..
- ●Bigg Boss | బిగ్‌బాస్‌తో సంపాదించింది ఏం లేదు - ప్రైజ్‌మనీ మొత్తం కట్ చేశారు - పల్లవి ప్రశాంత్ కామెంట్స్

Anil Ravipudi | రామాయణం ఆధారంగా అనిల్ రావిపూడి సినిమా - జననాయగన్ మేకర్స్‌తో డీల్

e-rickshaw battery blast | ఈ రిక్షా బ్యాటరీ పేలి భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి

Gold And Silver Prices Today | మళ్లీ పరుగులు పెడుతున్న పసిడి.. పెట్టుబడిదారుల ఆసక్తి..

Chinnareddy | తప్పుడుగాండ్లను పార్టీ నుంచి బయటకు పంపాలి.. లేదంటే నేను మరో జీవన్ రెడ్డి కావాల్సివస్తది: చిన్నారెడ్డి






