త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Insta love | ఇన్‌స్టా ప్రేమ‌కు అడ్డు.. సోద‌రిని చంపి ఆపై త‌ల్లిపైనా దాడి

Social media | సోష‌ల్ మీడియా ప‌రిచ‌యాలు ప్రేమ‌కు దారితీయ‌డం అటుంచితే అవే ప్రేమ‌ (Love) లు హ‌త్య‌ (Murdered) కు పురిగొల్పుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి వెలుగుచూసింది. త‌న ఇన్‌స్టా (Instagram) ప్రేమ‌కు అడ్డుప‌డుతున్నార‌ని త‌న సోద‌రిని క‌త్తితో పొడిచి చంపాడు ఓ దుర్మార్గుడు. హ‌ర్యానా (Haryana) రాష్ట్రం మొరాదాబాద్‌లో (Moradabad)లో ఈ ఘోరం చోటుచేసుకుంది.

S

National | Published On Mar 8, 2026, 3.02 pm IST

Insta love | ఇన్‌స్టా ప్రేమ‌కు అడ్డు.. సోద‌రిని చంపి ఆపై త‌ల్లిపైనా దాడి
Advertisement

- పోలీసుల‌కు ఫిర్యాదు, నిందితుడి అరెస్టు

త్రినేత్ర‌.న్యూస్‌: Social media | సోష‌ల్ మీడియా ప‌రిచ‌యాలు ప్రేమ‌కు దారితీయ‌డం అటుంచితే అవే ప్రేమ‌ (Love) లు హ‌త్య‌ (Murdered) కు పురిగొల్పుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి వెలుగుచూసింది. త‌న ఇన్‌స్టా (Instagram) ప్రేమ‌కు అడ్డుప‌డుతున్నార‌ని త‌న సోద‌రిని క‌త్తితో పొడిచి చంపాడు ఓ దుర్మార్గుడు. హ‌ర్యానా (Haryana) రాష్ట్రం మొరాదాబాద్‌ (Moradabad)లో ఈ ఘోరం చోటుచేసుకుంది. త‌న సోద‌రిని 40 సార్లు పొడిచి పంపాడు. ఆపై త‌న త‌ల్లిని కూడా వ‌ద‌ల‌కుండా ఆమెపై దాడి చేశాడు.

 

బుడౌన్‌కు చెందిన హార్దిక్ మ‌ల్హోత్రా (25), హిమ్షిఖా మ‌ల్హోత్రా సోద‌ర సోద‌రీమ‌ణులు ఉద్యోగ నిమిత్తం గురుగ్రామ్‌ (Gurugram)లో ఉంటున్నారు. హోళీ పండుగ జ‌రుపుకోవ‌డానికి మొరాదాబాద్‌(Moradabad) కు వ‌చ్చారు. హిమ్షిఖా ఓ ప్రైవేటు కంపెనీలో ప‌నిచేస్తూ ఎంబీఏ చ‌దువుతోంది. అయితే హార్దిక్‌కు ఏడు నెల‌ల క్రితం ఇన్‌స్టాలో ఓ యువ‌తి ప‌రిచ‌య‌మైంది. అది కాస్త ప్రేమ‌గా మారింది. అనంత‌రం వివిధ కార‌ణాల వ‌ల్ల వారు విడిపోయారు. దీంతో హార్దిక్ తీవ్ర మాన‌సిక ఒత్తిడికి గుర‌య్యాడు.

 

హోళీ పండ‌గు అనంత‌రం ఇదే విష‌యంలో వారి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. త‌న సోద‌రి స‌ర్దిచెప్పే ప్ర‌యత్నం చేయ‌గా హార్దిక్ కోపాన్ని త‌ట్టుకోలేక‌పోయాడు. వంట‌గ‌ది క‌త్తి (Knife) తీసుకుని ఆమెపై 40సార్లు దాడి (Attacked)  చేయ‌గా అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘోరాన్ని అడ్డుకునే క్ర‌మంలో త‌న త‌ల్లి నీలిమ‌పై కూడా దాడి చేశాడు. అరుపులు విన్న ఇరుగు పొరుగు వారు వ‌చ్చేస‌రికి హార్దిక్ పారిపోయాడు. నీలిమ త‌న కుమారుడిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు న‌మోదు చేసిన‌ట్లు మోరాదాబాద్ ఎస్పీ కుమార్ ర‌ణ‌విజ‌య్ సింగ్ (SP Ranavijay singh) తెలిపారు. కేసు ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

 

Advertisement
Advertisement