త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Isha Yoga Center | 150 ఎక‌రాల్లో ఈషా యోగా సెంట‌ర్‌.. ఒక‌రోజు రూమ్ రెంట్ ఎంతో తెలుసా..? ఇంకెన్నో ఆస‌క్తిక‌ర విశేషాలు మీ కోసం..

Isha Yoga Center | 150 ఎక‌రాల్లో ఈషా యోగా సెంట‌ర్‌.. ఒక‌రోజు రూమ్ రెంట్ ఎంతో తెలుసా..? ఇంకెన్నో ఆస‌క్తిక‌ర విశేషాలు మీ కోసం.. 1992లో జగ్గీ వాసుదేవ్ ఈ కేంద్రాన్ని స్థాపించారు. అప్ప‌ట్లో కేవ‌లం 14 ఏక‌రాల్లో తాత్కాలిక గుడిసెల‌తో ప్రారంభ‌మైన ఈ కేంద్రం.. నేడు 150 ఎక‌రాల‌కు పైగా విస్త‌రించింది. ఇది ఈ ఆధ్యాత్మిక కేంద్రం ప్ర‌శాంత‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తోంది.

D

National | Published On Apr 24, 2026, 3.55 pm IST

Isha Yoga Center | 150 ఎక‌రాల్లో ఈషా యోగా సెంట‌ర్‌.. ఒక‌రోజు రూమ్ రెంట్ ఎంతో తెలుసా..? ఇంకెన్నో ఆస‌క్తిక‌ర విశేషాలు మీ కోసం..
Advertisement

Isha Yoga Center | త‌మిళ‌నాడు కోయంబ‌త్తూర్ (Coimbatore) పేరు విన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తొచ్చేది ఆధ్యాత్మిక ప్ర‌దేశం ఈషా యోగా సెంట‌రే (Isha Yoga Center). సద్గురు జగ్గీ వాసుదేవ్ (Sadhguru) స్థాపించిన ఈ ఆధ్మాతిక కేంద్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌సిద్ధి చెందింది. ప్ర‌ముఖ రాజ‌కీయ‌, సినీ ఇండ‌స్ట్రీకి చెందిన వారే కాకుండా సామాన్య ప్ర‌జ‌లు, దేశం న‌లుమూల‌ల నుంచి అనేక మంది ఇక్క‌డికి వ‌స్తుంటారు. మ‌న‌సు ప్ర‌శాంత‌త కోసం ఆధ్యాత్మిక క్షేత్రంలో గ‌డుపుతుంటారు.

వెల్లియంగిరి ప‌ర్వ‌తాల పాదాల (Velliangiri mountains) వ‌ద్ద 1992లో జగ్గీ వాసుదేవ్ ఈ కేంద్రాన్ని స్థాపించారు. అప్ప‌ట్లో కేవ‌లం 14 ఏక‌రాల్లో తాత్కాలిక గుడిసెల‌తో ప్రారంభ‌మైన ఈ కేంద్రం.. నేడు 150 ఎక‌రాల‌కు పైగా విస్త‌రించింది. ఇది ఈ ఆధ్యాత్మిక కేంద్రం ప్ర‌శాంత‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తోంది. ఇందులో చూడ‌ద‌గ్గ విశేషాలు ఎన్నో ఉన్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ధ్యాన‌లింగం..

ఈ కేంద్రం ధ్యానానికి ప్ర‌సిద్ధి. ఇందులో నిర్మించిన ధ్యానలింగ గోపురం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలి. దీని నిర్మాణానికి ఎలాంటి సిమెంట్‌, కాంక్రీటు, ఉక్కు ఉప‌యోగించ‌లేదు. ఎలాంటి స్తంభాలు లేకుండా దీర్ఘ వృత్తాకారంలో నిర్మించారు. దీని నిర్మాణానికి కేవ‌లం మ‌ట్టి, ఇటుక‌లు, కొద్దిపాటి సున్న‌పు రాయిని ఉప‌యోగించారు. దీని ఎత్తు 33 అడుగులు ఉంటుంది. గాలి కోసం గోపురం వ‌ద్ద చిన్న‌పాటి రంధ్రం ఉంటుంది. శక్తివంతమైన ధ్యానలింగం ఈ గోపురంలోనే కొలువై ఉంటుంది. ఇక్క‌డ కొన్ని నిమిషాలు నిశ్శ‌బ్ధంగా కూర్చుంటే చాలు.. ధ్యానం గురించి తెలియ‌ని వారు కూడా గాఢ‌మైన ధ్యాన స్థితికి వెళ్లిపోతార‌ట‌.

112 అడుగుల ఆదియోగి విగ్రహం

ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో మ‌రో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ 112 అడుగుల ఎత్తు ఉన్న భారీ శివుడి విగ్రహం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద 'ఫేస్ స్కల్ప్చర్'గా (Largest Bust Sculpture) గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. యోగా శాస్త్రంలో ముక్తిని పొందేందుకు శివుడు అందించిన 112 మార్గాలను, అలాగే మానవ శరీరంలోని 112 చక్రాలను ఈ 112 అడుగుల ఎత్తు సూచిస్తుంది. ప్రతిరోజూ సాయంత్రం 7 గంటలకు 'ఆదియోగి దివ్య దర్శనం' పేరుతో 3D లేజర్ లైట్ అండ్ సౌండ్ షో జరుగుతుంది. ఈ భారీ ఆదియోగి విగ్ర‌హాన్ని 2017లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ యోగా కేంద్రాన్ని సంద‌ర్శించే వాళ్లు క‌చ్చితంగా ఆదియోగ విగ్ర‌హం ముందు ఫొటోలు దిగ‌కుండా మాత్రం వెన‌క్కిరారు.

యోగేశ్వర లింగం

ఆదియోగి విగ్ర‌హం పక్కనే యోగేశ్వర లింగం ఉంటుంది. ఇది మూలాధారం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, సహస్రారం అనే మానవ శరీరంలోని ఐదు చక్రాలను ఉద్దేశించి స‌ద్గురు దీన్ని ప్ర‌తిష్టించారు. యోగేశ్వర లింగానికి అభిషేకం చేయడం వల్ల ఐక్యత, శారీరక ఆరోగ్యం, మానసిక సమతుల్యత, అంతర్గత ఆనందం లభిస్తాయని నమ్మ‌కం. ఏటా మహా శివరాత్రి రోజు ఈ లింగానికి సద్గురు సమక్షంలో 'మహాభిషేకం' నిర్వ‌హిస్తారు.

కాల‌భైర‌వ క్షేత్రం..

ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో కాల‌భైర‌వ క్షేత్రం కూడా ఉంది. దీన్ని శివుడికి అత్యంత శ‌క్తివంత‌మైన క్షేత్రంగా చెబుతుంటారు. కాల‌భైర‌వుడిని కాలానికి అధిప‌తిగా, క్షేత్ర‌పాల‌కుడిగా, భ‌క్తుల‌ను ర‌క్షించే దేవుడిగా పూజిస్తారు. మ‌న దేశంలో ఎన్నో ప్ర‌సిద్ధ కాల‌భైర‌వ క్షేత్రాలు ఉన్నాయి. అయితే, ఈషా సెంట‌ర్‌లో మాత్రం దీన్ని కొత్త‌గా ఏర్పాటు చేశారు. అధికారిక వెబ్‌సైట్ ప్ర‌కారం.. కాల‌భైర‌వ‌ ప్రతిష్ఠతో ఈషా యోగా కేంద్రం ఒక పూర్తిస్థాయి తీర్థక్షేత్రంగా మారింది.

ఈ క్షేత్రం ప్రాంగ‌ణంలో రెండు పవిత్రమైన జలశయాలు ఉన్నాయి. వాటిని తీర్థ‌కుండాలు అని పిలుస్తారు. అందులో పురుషుల కోసం సూర్య‌కుండ్‌, మ‌హిళ‌ల కోసం చంద్ర‌కుండ్‌. వీటిలో స్నానం ఆచ‌రించ‌డం వ‌ల్ల దీర్ఝ‌కాలిక వ్యాధులు తొల‌గిపోతాయ‌ని, అనారోగ్యాల‌ను త‌గ్గించుకోవ‌చ్చ‌ని న‌మ్ముతారు. యోగా కేంద్రంలోని ముఖ్యమైన ధ్యానలింగం (Dhyanalinga) సందర్శనకు ముందు ఈ తీర్థకుండాల్లో స్నానం చేయడం వల్ల శరీరం గ్రహణశక్తిని పెంచుకుంటుందని నమ్ముతారు.

లింగ‌భైర‌వి ఆల‌యం..

ఈషా కేంద్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లింగ‌భైర‌వి ఆల‌యం గురించి. 8 అడుగుల లింగ భైరవి విగ్ర‌హం శక్తివంతమైన దైవ స్త్రీలింగ శక్తి రూపం. ఇక్కడ దేవిని లింగ రూపంలో ఆరాధిస్తారు. ఆలయం త్రిభుజాకారంలో ఉంటుంది. ఇది స్త్రీ గర్భాన్ని, సృష్టికి మూలమైన శక్తిని సూచిస్తుంది. ఇక్కడి గర్భగుడిలో పూజా కార్యక్రమాలు కేవ‌లం మ‌హిళ‌లు మాత్ర‌మే చేస్తార‌ట‌. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, శ్రేయస్సు కోసం భక్తులు ఇక్కడ పూజలు, అభిషేకం చేస్తుంటారు. టాలీవుడ్ స్టార్ న‌టి స‌మంత రెండో వివాహం ఇక్క‌డే జ‌రిగింది. ఆ స‌మ‌యంలో ఈ ఆల‌యం గురించి తీవ్రంగా చ‌ర్చ జ‌రిగింది.

ఒక రోజుకు రూమ్ రెంట్ రూ.990

ఇక ఈ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సంద‌ర్శించాల‌నుకునేవారు అధికారిక వెబ్‌సైట్ ద్వారా రూమ్స్‌ను బుక్ చేసుకోవ‌చ్చు. ఇందులో ఒక రోజుకు నాన్ ఏసీ రూమ్ ధ‌ర రూ.990గా ఉంది. ఇందులో ఇద్ద‌రు బ‌స చేయొచ్చు. ఒక‌వేళ ఫ్యామిలీతో వెళ్లాల‌నుకుంటే అక్క‌డ కాటేజ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. రూ.3,000 నుంచి రూ.7,000 వ‌ర‌కూ వాటికి ఛార్జ్ చేస్తారు. ఇక ఈ యోగా కేంద్రం కోయంబ‌త్తూరు నుంచి 30 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది.

రైలు, రోడ్డు మార్గాల్లో వెళ్లొచ్చు. ట్రాన్స్‌పోర్ట్ కూడా ఈజీగానే ఉంటుంది. స‌మ్మ‌ర్ వ‌చ్చేసింది క‌ద‌.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో క‌లిసి ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని సంద‌ర్శించండి. అక్క‌డి ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ఎంజాయ్ చేయండి. మ‌రో ముఖ్య విష‌యం ఏంటంటే.. ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో ఫోన్లు, కెమెరాల‌పై ఆంక్ష‌లు ఉన్నాయి. ముఖ్యంగా ధ్యానలింగం, పరిసరాల ప్రాంగణంలోకి ఫోన్లు, కెమెరాలను అనుమతించరు.

Also Read..

ఓటు వేయకుండా పేర్లు తొలగించారని పిటిషన్‌.. విచారించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు..!

ఎక్క‌డిక‌క్క‌డ బీఆర్ఎస్ నేత‌ల‌ అడ్డ‌గింత‌, అరెస్టులు

నిన్న కియారా అద్వానీ.. నేడు సారా అర్జున్‌..! మధుబాల పాత్రలో కనిపించేది ఎవరు..?

Advertisement
Advertisement