BRS Leaders arrest | ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతల అడ్డగింత, అరెస్టులు
BRS Leaders arrest | ర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్(Shankar Goud) మృతదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడానికి వెళ్తున్న మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సబిత (Sabitha), మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్(Vinodkumar)ను రఘునాథ్ పల్లి టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకొన్నారు. అనంతరం వారిని పోలీసులు అరెస్ట్ (arrest) చేశారు.
BRS Leaders arrest | త్రినేత్ర.న్యూస్: నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్(Shankar Goud) మృతదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడానికి వెళ్తున్న మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సబిత (Sabitha), మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్(Vinodkumar)ను రఘునాథ్ పల్లి టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకొన్నారు. ఈ క్రమంలో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అనంతరం వారిని పోలీసులు అరెస్ట్ (arrest) చేశారు.
మాజీ ఎంపీ మాలోత్ కవితను అరెస్టు చేసి జనగామ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారిని వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. మరోవైపు ఆలేరు వద్ద మధుసూదనాచారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అడ్డుకోవడంపై పోలీసులతో వాగ్వాదం జరిగింది. అనంతరం మధుసూదనాచారిని భువనగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అంతిమ యాత్రలో పాల్గొనడానికి వెళ్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ను మార్గమధ్యలో అరెస్ట్ చేసి ఘన్‌పూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో అరెస్టును నిరసిస్తూ పోలీస్ స్టేషన్ వద్ద మాజీ మంత్రి రాజయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బైఠాయించారు. అక్రమ అరెస్ట్ ను ఖండింస్తూ ధర్నాకు దిగారు. శ్రీనివాస్ గౌడ్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని నర్సంపేట పీఎస్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసుల వాహనాలను బీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును హనుమకొండలోని ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేశారు. కాగా శంకర్‌గౌడ్ అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం జరగనున్నాయి.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



