Supreme Court | ఓటు వేయకుండా పేర్లు తొలగించారని పిటిషన్.. విచారించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు..!
Supreme Court | పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధుల్లో ఉన్న కొందరి పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించారని వచ్చిన ఆరోపణలపై జోక్యం చేసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం నిరాకరించింది.
Supreme Court | పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధుల్లో ఉన్న కొందరి పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించారని వచ్చిన ఆరోపణలపై జోక్యం చేసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం నిరాకరించింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్న సిబ్బందికే ఓటు వేసే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. పిటిషనర్లను అప్పిలేట్ ట్రిబ్యులన్‌ను ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ సందర్భంగా తొలిదశలో 92 శాతం పోలింగ్ నమోదవడం ప్రధాన న్యాయమూర్తి సంతోషం వ్యక్తం చేశారు.
మరో న్యాయమూర్తి జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి మాట్లాడుతూ ‘వారు ఈసారి ఓటువేయగలరా ? లేదా ? అన్నది పక్కన పెడితే ఓటర్ల జాబితాలో వారి పేర్లు ఉండే హక్కు మరింత ముఖ్యమని, దాన్ని కోర్టు పరిశీలిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎన్నికల విధుల కోసం జారీ చేసిన ఆదేశాల్లో ఎపిక్ నంబర్ ఉండేదని, దాన్ని తర్వాత తొలగించారన్నారు. దాంతో విధుల్లో ఉన్న వారు ఓటువేయలేని పరిస్థితి ఏర్పడిందని, ఇది పూర్తిగా యాదృశ్చికమైన నిర్ణయమన్నారు.
వెస్ట్ బెంగాల్ ఎన్నికల సమయంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన వారికి తమ ఫిర్యాదులతో కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించే స్వేచ్ఛ సుప్రీంకోర్టు ఇచ్చింది. పెండింగ్‌లో ఉన్న అప్పీల్స్‌కు సంబంధించిన కేసులను అత్యవసరత ఉన్నవిగా గుర్తిస్తే, అప్పిలేట్ ట్రిబ్యునల్ వాటిని ప్రాధాన్యంతో విచారించాలని ఆదేశించింది. ఈసందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ.. ‘ఏప్రిల్ 13న ఇచ్చిన మా ఆదేశంలో ఎక్కువ అంశాలను ఇప్పటికే పరిశీలించాం. రోజువారీగా సమస్యలు తలెత్తవచ్చని మేం అర్థం చేసుకుంటున్నాం. పిటిషనర్లు, ఇతర సంబంధిత పక్షాలు పరిపాలనా పరంగా కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించవచ్చు. అవసరమైతే న్యాయపరమైన జోక్యం కోసం కూడా హైకోర్టును ఆశ్రయించవచ్చు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పేర్లు తొలగించినబడి, అప్పీల్ చేసుకున్న వారి కేసులను ట్రిబ్యునల్ అత్యవసరంగా విచారించాలని’ పేర్కొంది.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






