Kondagattu | కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కట్టలు
Kondagattu | కొండగట్టు (Kondagattu) అంజన్న ఆలయ హుండీల్లో డమ్మీ నోట్లు (Dummy Currency Notes) లభించాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.2.50 లక్షల విలువైన నోట్లను అధికారులు గుర్తించారు. శ్రీ ఆంజనేయస్వామి (Kondagattu Anjanna Temple) ఆలయంలోని హుండీలను లెక్కించారు.
Kondagattu | త్రినేత్ర.న్యూస్: కొండగట్టు (Kondagattu) అంజన్న ఆలయ హుండీల్లో డమ్మీ నోట్లు (Dummy Currency Notes) లభించాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.2.50 లక్షల విలువైన నోట్లను అధికారులు గుర్తించారు. శ్రీ ఆంజనేయస్వామి (Kondagattu Anjanna Temple) ఆలయంలోని హుండీలను లెక్కించారు. ఈ సందర్భంగా బొమ్మ రెన్సీ (Toy Money) లభించడంతో సిబ్బంది ఆశ్చర్యపోయారు. మొత్తం 5 బండిళ్లలో డమ్మీ నోట్ల కట్టలు లభించాయి. రూ.500 నోట్లను పోలిన ఐదు కట్టలతో పాటు ఒక రూ.200 నకిలీ నోటును గుర్తించారు. వాటిని అసలు కరెన్సీ వేరుచేసిన సిబ్బంది.. అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వాటిని పరిశీలించిన బ్యాంకు అధికారులు నకిలీగా నిర్ధారించడంతో ఆలయ సిబ్బంది చించివేశారు.
తల్లిదండ్రులతో కలిసి ఆలయానికి వచ్చిన పిల్లలు టాయ్ మనీ నోట్ల కట్టలను హుండీలో వేసి ఉంటారని ఆలయ అధికారులు భావిస్తున్నారు. వాటిని మళ్లీ హుండీలోనే వేసి భద్రపరిచినట్లు ఆలయ సూపరింటెండెంట్ సునీల్ తెలిపారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పంచనామా చేయించిన తర్వాత ఏం చేయాలన్న విషయమై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే చిరిగిన నోట్లను కూడా భద్రపరుస్తామని చెప్పారు. కాగా, భక్తుల విశ్వాసానికి ప్రతీకగా భావించే హుండీలో ఇలాంటి డమ్మీ నోట్ల కట్టలు వెలుగుచూడటంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది.
గతంలో కొండగట్టు హుండీల్లో లేఖలు వేయడం బయటపడిన విషయం తెలిసిందే. అంజన్న ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లు సరిగ్గా లేవని.. అన్ని రకాల వసతులు కల్పించే వరకు హుండీలో డబ్బులు వేయమంటూ భక్తులు రాసిన లేఖలు పదుల సంఖ్యలో వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో ఈ వ్యవహారం చర్చకు దారితీసిన విషయం తెలిసిందే.
సంబంధిత వార్తలు

BUS and Lorry Accident | కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు.. ఐదుగురి పరిస్థితి విషమం
ఆగస్టు 17, 2026

Giri Pradakshina | కొండగట్టు అంజన్న ఆలయంలో గిరి ప్రదక్షిణ.. పాల్గొన్న మంత్రులు.. ఫొటోలు
జులై 29, 2026

Kondagattu | ఘనంగా హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు.. కాషాయమయమైన కొండగట్టు..!
మే 12, 2026
తాజావార్తలు
- ●Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
- ●KCR Fake Tweet Controversy | రేవంత్ రెడ్డే సంధ్యారావు.. సంధ్యారావే రేవంత్ రెడ్డి
- ●Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి - మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ
- ●Corpus | రూ.1 కోటి సంపాదించాలా.. అయితే ముందు రూ.10 లక్షలు దాటండి.. ఎందుకంటే..?
- ●Komatireddy Rajagopal Reddy | ఖర్చెక్కువవుతుంది.. ఇందిరమ్మ ఇళ్లకిచ్చే నిధులు పెంచాలి
- ●P Chidambaram | బ్రిక్స్‌తో భారత్‌కు ఒరిగిందేంటి..? : చిదంబరం

Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

KCR Fake Tweet Controversy | రేవంత్ రెడ్డే సంధ్యారావు.. సంధ్యారావే రేవంత్ రెడ్డి

Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి - మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ

Corpus | రూ.1 కోటి సంపాదించాలా.. అయితే ముందు రూ.10 లక్షలు దాటండి.. ఎందుకంటే..?



