Alcohol Prices | యుద్ధం ఎఫెక్ట్.. రాష్ట్రంలో పెరుగనున్న మద్యం, బీర్ల ధరలు!
Alcohol Prices | ఎక్కడో పశ్చిమాసియాలో (Iran America War) యుద్ధం జరిగితే.. రాష్ట్రంలో మద్యం ధరలు (Alcohol Prices) ఎందుకు పెరుగుతాయని అనుకుంటున్నారా?.. దీనికి ఒక ప్రధాన కారణం ఉంది.
Alcohol Prices | త్రినేత్ర.న్యూస్: ఎక్కడో పశ్చిమాసియాలో (Iran America War) యుద్ధం జరిగితే.. రాష్ట్రంలో మద్యం ధరలు (Alcohol Prices) ఎందుకు పెరుగుతాయని అనుకుంటున్నారా?.. దీనికి ఒక ప్రధాన కారణం ఉంది. అదే గ్యాస్. న్యాచురల్ గ్యాస్ (Natural Gas) సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో మద్యం సీసాల ఉత్పత్తిపై ప్రభావం పడింది. దీంతో ఒక్కసారిగా ఖర్చులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో గాజు సీసా తయారీ యూనిట్లు ఉత్పత్తిని తగ్గించుకున్నాయి. పలు యూనిట్లు పూర్తిగా మూతపడ్డాయి. ఇది మద్యం సరఫరాలో అంతరాయం సృష్టిస్తున్నది. అసలే ఎండాకాలం, బీర్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. కానీ సరఫరా మాత్రం తగ్గిపోయింది. దీనికి తోడు మద్యం ధరల పెంపు గడువు ఇప్పటికే ముగిసిపోయింది. సాధారణంగా రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకొకసారి మద్యం ధరలను సమీక్షిస్తారు. చివరిగా 2023 మే నెలలో ధరలను పెంచగా.. నిబంధనల ప్రకారం 2025 మే నెలలో మళ్లీ ధరలను సమీక్షించాల్సి ఉంది. దీంతో మద్యం కంపెనీలు ధరలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
సహజవాయువు కొరతతో దేశంలోని ప్రధాన గాజు తయారీ కేంద్రాల్లో ఉత్పత్తి 40 శాతం మేర పడిపోయింది. ఫలితంగా ఖాళీ సీసాల ధరలు 20 శాతం వరకు పెరిగాయి. ఈ అదనపు భారాన్ని తాము భరించలేకపోతున్నామని, మద్యం ధరలు పెంచాలని డిస్టిలరీ యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. మద్యం ధరలను 12-15శాతం వరకు పెంచాలని మద్యం తయారీదారులు అధికారులకు వినతి పత్రం అందించారు. దీనిని పరిశీలించిన ప్రభుత్వం ధరల పెంపునకు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఈ అంశంపై ఓ రిటైర్డ్ జడ్జితో జ్యుడీషియల్ కమిటీని కూడా నియమించింది. కమిటీ ఇచ్చే నివేదికను బట్టి ధరల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కాగా, బీర్ల ధరలను గత ఫిబ్రవరిలోనే ప్రభుత్వం 15 శాతం పెంచిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పెంచితే బీర్ల ప్రియుల జేబులకు చిల్లుపడ్డట్టే..!
తాజావార్తలు
- ●Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..
- ●CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్
- ●HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం
- ●Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ
- ●Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
- ●Harish Rao | జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సచివాలయం ముట్టడి

Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..

CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్

HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం

Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ




