Ponnam Prabhakar | రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు మంచిది కాదు: చంద్రబాబుకు పొన్నం లేఖ
Ponnam Prabhakar | తెలంగాణ విభజనపై ఎవరైనా సరే అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీ(BJP), టీడీపీ(TDP) నేతలు, జనసేన(Janasena) అధినేత వ్యాఖ్యలు సముచితంగా లేవని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు ఆయన మూడు పేజీల బహిరంగ లేఖ (letter రాశారు.
- మీ భాగస్వామ్య నాయకులకు చెప్పండి
- తేజస్వీ సూర్య వ్యాఖ్యలు లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌కు లేఖ రాయండి
- ఏపీ సీఎం చంద్రబాబుకు పొన్నం బహిరంగ లేఖ
Ponnam Prabhakar: త్రినేత్ర.న్యూస్: తెలంగాణ విభజనపై ఎవరైనా సరే అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీ(BJP), టీడీపీ(TDP) నేతలు, జనసేన(Janasena) అధినేత వ్యాఖ్యలు సముచితంగా లేవని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు ఆయన మూడు పేజీల బహిరంగ లేఖ (letter రాశారు.
రాష్ట్ర విభజన అనుచితంగా జరిగినట్లు చేసే వ్యాఖ్యలు, అసందర్భ వ్యాఖ్యలు తెలుగువారి మధ్య వైషమ్యాలు రగిలించేలా ఉన్నాయన్నారు. మీరు చొరవ తీసుకుని బీజేపీ, జనసేన నేతలకు సర్దిచెప్పండి. ఇంకెవరైనా సరే రాష్ట్ర విభజనపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడకుండా కట్టడి చేయాలి. రాష్ట్ర విభజనపై ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యల విషయంలో స్పీకర్‌కు లేఖ రాయాలి. వాటిని లోక్ సభ రికార్డుల నుంచి తొలగించేలా చూడండి. రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో అభివృద్ధి పథంలో కొనసాగం తక్షణ అవసరంగా భావిస్తున్నాం అంటూ లేఖలో పొన్నం పేర్కొన్నారు.
2000 తొలి దశకమంతా జరిగిన పోరాటాలకు ఉద్యమాలకు మీరు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. తామంతా గాంధేయ మార్గంలో పోరాటాలు చేశాం. 2009 తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో నేను కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్‌గా ఉన్నప్పుడు తెలంగాణ అంశాన్ని ఎన్నో వేదికలపై లేవనెత్తిన విషయం మీకు తెలుసు. 2014లో రాజ్యాంగ బద్ధంగా తెలంగాణ విడిపోయింది. ఎవరి రాష్ట్రం వాళ్లకి, ఎవరి దారి వారిది అయి పుష్కర కాలం దాటింది. మనమంతా అన్నదమ్ముల వలె కలిసి ఉంటున్నాం. రెండు రాష్ట్రాలు పోటీ పడి అభివృద్ధి చెందుతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. అనుచిత వ్యాఖ్యలు చేయడం, అనవసరంగా ద్వేషాలు రగిల్చడం ఎవరికీ మంచిది కాదు అని లేఖలో పొన్నం వివరించారు.
బీజేపీ, జనసేన నాయకుల వ్యాఖ్యల వల్ల మనసు కలత చెందుతోంది. ఇతరులకు లేని అపోహలు కలిగిస్తున్నారు. ఆంధ్రా ప్రగతికి తెలంగాణ దిష్టి తగిలిందంటూ ఇటీవల పవన్ కల్యాణ్ మాట్లాడిన తీరు బాగాలేదు. ఇలాంటి వ్యాఖ్యలు వైషమ్యాలు సృష్టిస్తాయి. ఇవన్నింటికి మూలం దేశ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలే అనుకుంటాను. ఏపీలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న మీరు చొరవ తీసుకొని మీ భాగస్వామ్య పక్షాలు బీజేపీ, జనసేన నాయకులకు చెప్పండి.
రాష్ట్ర విభజనను భారత్-పాకిస్థాన్‌తో పోల్చారు. భారత్ ఎవరు? పాకిస్థాన్ ఎవరు? రెండు రాష్ట్రాల మధ్య ఏమైనా సరిహద్దు సమస్యలు ఉన్నాయా? చెప్పాలి అని ఆ లేఖలో పొన్నం ప్రశ్నించారు. చంద్రబాబు తగిన విధంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..
- ●CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్
- ●HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం
- ●Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ
- ●Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
- ●Harish Rao | జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సచివాలయం ముట్టడి

Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..

CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్

HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం

Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ




