A. R. Rahman | వామ్మో అన్ని కోట్లా.?…చిరంజీవి సినిమా కోసం ఏఆర్ రెహమాన్ షాకింగ్ రెమ్యూనరేషన్
వాల్తేర్ వీరయ్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో మరో మూవీ రాబోతుంది. మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేశారట. కానీ చిరంజీవి సినిమా కోసం రెహమాన్ భారీగా రెమ్యూనరేషన్‌ను డిమాండ్ చేసినట్లు సమాచారం....
Entertainment | Published On Apr 21, 2026, 12.53 pm IST
A. R. Rahman | మన శంకర వరప్రసాద్ గారుతో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నారు మెగా స్టార్ చిరంజీవి. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా 350 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి నటన, కామెడీ టైమింగ్, స్వాగ్ అభిమానులను ఆకట్టుకున్నాయి.
కేవీఎన్ ప్రొడక్షన్స్...
ఈ బ్లాక్‌బస్టర్ తర్వాత డైరెక్టర్ బాబీతో చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను సాండల్‌వుడ్ అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. చిరంజీవి హీరోగా నటిస్తోన్న ఈ 158వ మూవీ ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లోనే అఫీషియల్‌గా లాంఛ్ కావాల్సింది. కానీ జననాయగన్ లీక్ కారణంగా ఓపెనింగ్ ఈవెంట్‌ను మేకర్స్ వాయిదావేశారు. ఈ నెలాఖరున గ్రాండ్‌గా లాంఛింగ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నట్లు సమాచారం.
ఏఆర్ రెహమాన్...
కాగా ఈ భారీ బడ్జెట్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్‌ను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేశారట. రామ్‌చరణ్ పెద్ది మూవీకి రెహమాన్ అందించిన మ్యూజిక్‌కు చిరంజీవి ఇంప్రెస్ అయ్యారట. రెహమాన్‌నే మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకోవాలని మెగాస్టార్ పట్టుపట్టారట. కానీ మెగా 158 సినిమా కోసం రెహమాన్ ఏకంగా 12 కోట్లు రెమ్యూనరేషన్‌ను డిమాండ్ చేశారట.
ఆస్కార్ విన్నర్ రెమ్యూనరేషన్ విని షాకైన మేకర్స్ రెహమాన్‌ను పక్కనపెట్టి అతడి స్థానంలో తమన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫిక్స్ చేసినట్లు వార్తలొస్తున్నాయి.
సెకండ్ మూవీ....
మెగా 158 మూవీలో ప్రియమణి , అనస్వర రాజన్ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. వాల్తేర్ వీరయ్య తర్వాత చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వస్తోన్న సెకండ్ మూవీ ఇది.
చిరంజీవి హీరోగా నటించిన మరో మూవీ విశ్వంభర రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. సోషియా ఫాంటసీ కథతో తెరకెక్కిన ఈ సినిమాకు వశిష్ట మల్లిడి దర్శకత్వం వహించాడు. త్రిష హీరోయిన్‌గా నటించింది. గత ఏడాది రిలీజ్ కావాల్సిన ఈ సినిమా గ్రాఫిక్స్ పనుల వల్ల వాయిదాపడింది.
తాజావార్తలు
- ●Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..
- ●CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్
- ●HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం
- ●Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ
- ●Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
- ●Harish Rao | జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సచివాలయం ముట్టడి

Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..

CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్

HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం

Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ






