P Chidambaram | డెమోక్రసీ ఇండెక్స్‌లో భారత్ ర్యాంకు పతనం
P Chidambaram | ఎన్నికల ప్రజాస్వామ్య సూచీలో భారత్ 179 దేశాల్లో 106వ స్థానంలో నిలిచిందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పి. చిదంబరం పేర్కొన్నారు. 2025 సంవత్సరానికి వి-డెమ్ రూపొందించిన ఎలక్టోరల్ డెమోక్రసీ ఇండెక్స్‌లో భారత్‌కు 0.38 స్కోరు వచ్చినట్లు తెలిపారు.
- వీ-డెమ్ ఎలక్టోరల్ డెమొక్రసీ ఇండెక్స్
- 179 దేశాల్లో 106వ స్థానానికి భారత్
- 1975 తర్వాత ఇదే అత్యల్పమన్న చిదంబరం
P Chidambaram | ఎన్నికల ప్రజాస్వామ్య సూచీలో భారత్ 179 దేశాల్లో 106వ స్థానంలో నిలిచిందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పి. చిదంబరం పేర్కొన్నారు. 2025 సంవత్సరానికి వి-డెమ్ రూపొందించిన ఎలక్టోరల్ డెమోక్రసీ ఇండెక్స్‌లో భారత్‌కు 0.38 స్కోరు వచ్చినట్లు తెలిపారు. 1975 తర్వాత ఇదే అత్యల్ప స్కోరు అని మంగళవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. కాంగ్రెస్ ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని తరచూ ప్రశ్నిస్తోంది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పలు సందర్భాల్లో ఓటు చోరీ ఆరోపణలు చేశారు.
లిబరల్ ప్రజాస్వామ్యంలో 105వ స్థానం
లిబరల్ డెమోక్రసీ ఇండెక్స్‌లో భారత్ 105వ స్థానంలో నిలిచింది. ఇందులో దేశానికి 0.26 స్కోరు నమోదైంది. ప్రపంచ సగటు పౌరుడు గణాంకపరంగా ఎంతమేర ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నాడన్నది ప్రతిబింబించేలా వీ-డెమ్ జనాభా ఆధారిత కొలమానాలను ఉపయోగిస్తుంది. దేశాల సగటు ప్రాతిపదికన చిన్న దేశాలైన సీషెల్స్, తిమోర్-లెస్టేలో ప్రజాస్వామ్య పురోగతికి, భారత్, అమెరికా వంటి పెద్ద దేశాల్లోని పురోగతికి సమాన ప్రాధాన్యం ఇస్తుంది. భారత్‌ను వీ-డెమ్ ‘ఎలక్టోరల్ డిక్టేటర్‌షిప్’ (ఎన్నికల నియంతృత్వం) వర్గంలో చేర్చింది. దక్షిణ, మధ్య ఆసియాలో నేపాల్, శ్రీలంకల్లో 2 శాతం మంది మాత్రమే ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నారని నివేదిక పేర్కొంది. భూటాన్, మంగోలియా, మాల్దీవుల్లో చాలా స్వల్ప సంఖ్యలో ప్రజలు ‘గ్రే జోన్’ ప్రజాస్వామ్యాల్లో జీవిస్తున్నారని తెలిపింది. భారత్‌తో పాటు కిర్గిజిస్థాన్, పాకిస్థాన్‌లను ఎన్నికల నియంతృత్వాలుగా, అఫ్గానిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్‌లను మూసివేసిన నియంతృత్వాలుగా వర్గీకరించింది.
2009 నుంచి నిరంకుశ ధోరణులు
2009 నుంచి భారత్‌లో నిరంకుశ ధోరణులు క్రమంగా పెరుగుతున్నాయని వీ-డెమ్ పేర్కొంది. ప్రజాస్వామ్య సంస్థలను వ్యవస్థీకృతంగా నిర్వీర్యం చేయడం, భావ ప్రకటనా స్వేచ్ఛ, మీడియా స్వతంత్రతలో క్షీణత, ప్రభుత్వాన్ని విమర్శించే పాత్రికేయులపై వేధింపులు, పౌర సమాజం, ప్రతిపక్షాలపై దాడులు వంటి అంశాలను ప్రజాస్వామ్య క్షీణతకు కారణాలుగా నివేదికలో ప్రస్తావించింది. స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్ విశ్వవిద్యాలయం రాజకీయ శాస్త్ర విభాగంలో వీ-డెమ్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. అసోసియేట్ ప్రొఫెసర్ స్టీవెన్ విల్సన్ దీనికి నేతృత్వం వహిస్తున్నారు.
Without comment:
India ranks 106th among 179 countries on the Electoral Democracy Index
V-Dem's democracy index score for India is at its lowest since 1975
— P. Chidambaram (@PChidambaram_IN) September 1, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్






