త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Bank | ఇండియ‌న్ బ్యాంక్‌లో 1500 అప్రెంటిస్‌లు.. తెలంగాణ‌లో ఎన్ని ఖాళీలు అంటే?

Indian Bank | దేశవ్యాప్తంగా ఉన్న తమ శాఖలలో అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి ఇండియన్ బ్యాంక్ (Indian Bank) ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ది. మొత్తం 1500 ఖాళీల‌తో నోటిఫికేష‌న్ (Apprentice Recruitment) విడుదల చేసింది.

G

National | Published On Nov 5, 2026, 6.16 pm IST

Indian Bank | ఇండియ‌న్ బ్యాంక్‌లో 1500 అప్రెంటిస్‌లు.. తెలంగాణ‌లో ఎన్ని ఖాళీలు అంటే?
Advertisement

Indian Bank | త్రినేత్ర న్యూస్‌: దేశవ్యాప్తంగా ఉన్న తమ శాఖలలో అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి ఇండియన్ బ్యాంక్ (Indian Bank) ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ది. మొత్తం 1500 ఖాళీల‌తో నోటిఫికేష‌న్ (Apprentice Recruitment) విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ indianbank.bank.inలో దరఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ నవంబర్ 5 (గురువారం) నుంచి ప్రారంభమైంది. ఆన్‌లైన్ దరఖాస్తులు నవంబర్ 25 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయి. రాత‌ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఏడాదిపాటు శిక్ష‌ణ ఉంటుంది. శిక్ష‌ణ స‌మ‌యంలో ప్ర‌తి నెల రూ.12,300 నుంచి రూ.15000 స్టెయిపెండ్ చెల్లిస్తారు. తెలంగాణ‌లో 46, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 85 ఖాళీలు ఉన్నాయి.

మొత్తం ఖాళీలు: 1500 (జ‌న‌ర‌ల్ 676, ఓబీసీ 348, ఎస్సీ 252, ఈడ‌బ్ల్యూఎస్ 142, ఎస్టీ 82)
ఇందులో తెలంగాణ‌లో 46, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 85, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 285, త‌మిళ‌నాడులో 270, ప‌శ్చిమ బెంగాల్‌లో 145, బీహార్‌లో 80 ఉన్నాయి.

అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు తమ గ్రాడ్యుయేషన్‌ను 2022 ఏప్రిల్ 1 నుంచి 2026 న‌వంబ‌ర్ 1 మధ్య కాలంలో పూర్తి చేసి ఉండాలి. 2026 న‌వంబ‌ర్ 1 నాటికి అభ్యర్థులు 20 నుంచి 28 ఏండ్ల‌ మధ్య ఉండాలి. లేదా 1998 న‌వంబ‌ర్ 2 కంటే ముందు, 2006 న‌వంబ‌ర్ 1 తర్వాత జన్మించి ఉండకూడదు. స్థానిక భాష త‌ప్ప‌నిస‌రిగా తెలిసి ఉండాలి.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ద్వారా.
కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం ఐదు విభాగాలు ఉంటాయి. రీజనింగ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన జనరల్ అవేర్‌నెస్ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. పరీక్ష రాయడానికి 60 నిమిషాల వ్యవధి ఇస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు ఫీజు: రూ. 800 + జీఎస్‌టీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175 + జీఎస్‌టీ
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: నవంబర్ 25
వెబ్‌సైట్‌: indianbank.bank.in

Advertisement
Advertisement