ASUS Zenbook 14 | పవర్‌ఫుల్ డిస్‌ప్లే, ఏఐ ఫీచర్లతో అసుస్ కొత్త ల్యాప్‌టాప్.. 30 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్..
ASUS Zenbook 14 | అసుస్ భారత్‌లో కొత్త జెన్‌బుక్ 14 (యూఎక్స్3480) ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. 3కె రిజల్యూషన్, 120 హెడ్జ్ ఓఎల్ఈడీ టచ్‌స్క్రీన్, సిరాల్యూమినియం బాడీ, శక్తివంతమైన ప్రాసెసర్లతో ఈ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. దీనితోపాటు జెన్‌మౌస్ ఎండీ202 వైర్‌లెస్ మౌస్‌ను కూడా పరిచయం చేసింది.
Technology | Published On Nov 5, 2026, 5.48 pm IST
ASUS Zenbook 14 | అసుస్ భారత్‌లో కొత్త జెన్‌బుక్ 14 (యూఎక్స్3480) ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. 3కె రిజల్యూషన్, 120 హెడ్జ్ ఓఎల్ఈడీ టచ్‌స్క్రీన్, సిరాల్యూమినియం బాడీ, శక్తివంతమైన ప్రాసెసర్లతో ఈ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. దీనితోపాటు జెన్‌మౌస్ ఎండీ202 వైర్‌లెస్ మౌస్‌ను కూడా పరిచయం చేసింది.
దృఢమైన బిల్డ్ క్వాలిటీ..
అసుస్ జెన్‌బుక్ 14 లో సిరాల్యూమినియం అనే ప్రత్యేకమైన సిరామిక్-అల్యూమినియం మెటీరియల్‌ను ఉపయోగించారు. సాధారణ మెటీరియల్స్‌తో పోలిస్తే ఇది 30 శాతం తేలికగా, మూడు రెట్లు ఎక్కువ బలంగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. గీతలు, ప్రమాదవశాత్తూ తగిలే దెబ్బలు, మరకలు, రోజువారీ వినియోగం వల్ల కలిగే అరుగుదలను తట్టుకునేలా దీనిని రూపొందించారు. అమెరికా మిలిటరీ ప్రమాణమైన ఎంఐఎల్-ఎస్‌టీడీ-810హెచ్ ప్రకారం షాక్, వైబ్రేషన్, ఉష్ణోగ్రత, ఎత్తు వంటి పరిస్థితుల్లోనూ పరీక్షించారు. ఈ ల్యాప్‌టాప్ మందం 1.39 సెంటీమీటర్లు కాగా, బరువు కేవలం 1.1 కిలోలు. ఆర్కిటిక్ బ్లూ, కొమోడో కోరల్, జబ్రిస్కీ బీజ్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఇందులో 14 ఇంచుల 3కె లూమినా ఓఎల్ఈడీ టచ్‌స్క్రీన్, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, గరిష్ఠంగా 1,100 నిట్స్ హెచ్‌డీఆర్ బ్రైట్‌నెస్, 100 శాతం డీసీఐ-పీ3 కలర్ కవరేజ్, 16:10 యాస్పెక్ట్ రేషియో, 89 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో ఉన్నాయి. తక్కువ బ్లూ లైట్ టెక్నాలజీకి సంబంధించి టీయూవీ రైన్‌ల్యాండ్, ఎస్‌జీఎస్ సర్టిఫికేషన్లు కూడా పొందింది.
30 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్..
ఇందులో స్నాప్‌డ్రాగన్ ఎక్స్, ఇంటెల్ కోర్ అల్ట్రా 9 సిరీస్ 3, ఏఎండీ రైజెన్ ఏఐ 7 345 ప్రాసెసర్ ఆప్షన్లతో ఈ ల్యాప్‌టాప్‌ను అందిస్తున్నారు. ఆన్-డివైస్ ఏఐ ప్రాసెసింగ్ కోసం గరిష్ఠంగా 50 టాప్స్ ఎన్‌పీయూ సామర్థ్యం ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 33 గంటల బ్యాటరీ లైఫ్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. యూఎస్‌బీ టైప్ సి ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా కేవలం 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ చేసుకోవచ్చు. మరోవైపు అసుస్ జెన్‌మౌస్ ఎండీ202ను కూడా విడుదల చేసింది. ఇందులో సిరాల్యూమినియం టాప్ కవర్, బ్లూటూత్, 2.4 గిగాహెడ్జ్ వైర్‌లెస్ కనెక్టివిటీ ఉన్నాయి. ఒకేసారి నాలుగు పరికరాలకు కనెక్ట్ చేసుకోవచ్చు. గాజు ఉపరితలాలపైనా పనిచేసే ట్రాక్-ఆన్-గ్లాస్ సెన్సార్, 50 మిలియన్ క్లిక్స్ వరకు పనిచేసే మైక్రో స్విచ్, 800 నుంచి 4,200 డీపీఐ వరకు కస్టమైజ్ చేసుకునే సదుపాయం ఉన్నాయి. మై అసుస్ సాఫ్ట్‌వేర్ ద్వారా డీపీఐ సెట్టింగ్స్, స్క్రోల్ క్లిక్ షార్ట్‌కట్స్, బ్యాటరీ స్థాయిని నియంత్రించవచ్చు. యూఎస్‌బీ టైప్ సి ఫాస్ట్ ఛార్జింగ్‌తో కేవలం ఒక్క నిమిషం ఛార్జింగ్ ద్వారా 16 గంటల వినియోగం పొందవచ్చు. బ్యాటరీ సామర్థ్యం 370 ఎంఏహెచ్ కాగా, గరిష్ఠంగా ఏడు నెలల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. దీని బరువు 85 గ్రాములు.
ధర ఎంతంటే..
అసుస్ జెన్‌బుక్ 14 (యూఎక్స్3480ఏఏ) ధర రూ.1,67,990గా ఉంది. యూఎక్స్3480కేఏ ధర రూ.1,56,990గా, యూఎక్స్3480క్యూఏ ధర రూ.1,36,990గా ఉన్నాయి. జెన్‌మౌస్ ఎండీ202 ధర రూ.6,999గా ఉంది. ఈ ఉత్పత్తులు అసుస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, కంపెనీ ఈ-షాప్, అమెజాన్ ఇండియా, క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్‌తోపాటు అధీకృత రిటైల్ స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ల్యాప్‌టాప్ కొనుగోలుపై 18 నెలల వరకు నెలకు రూ.7,611 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కల్పిస్తున్నారు. అలాగే 24 నెలల వరకు నెలకు రూ.6,471 నుంచి తక్కువ వడ్డీ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
తాజావార్తలు
- ●Vemula Veeresham | ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు తప్పిన ప్రమాదం..
- ●Salman Khan | సల్మాన్ ఖాన్ మాతృభూమికి సెన్సార్ క్లియరెన్స్ - లాంగెస్ట్ రన్టైమ్తో ట్రైలర్
- ●Ponnam Prabhakar | ప్రభుత్వం రూ.88.50 కోట్ల నిధులిచ్చింది.. కార్తీక మాసంలోనే ఆత్మగౌరవ భవనాల పనులు ప్రారంభించండి
- ●Supreme Court | విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్.. నెలాఖరులోపు నివేదిక ఇవ్వండి
- ●Silver Price | వెండి ధర రూ.2 లక్షలకు చేరనుందా..? 2 రోజుల్లోనే రూ.11వేలు జంప్..
- ●CP Sumathi | అండాల సేకరణ వ్యవహారంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలు: సీపీ సుమతి

Vemula Veeresham | ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు తప్పిన ప్రమాదం..

Salman Khan | సల్మాన్ ఖాన్ మాతృభూమికి సెన్సార్ క్లియరెన్స్ - లాంగెస్ట్ రన్టైమ్తో ట్రైలర్

Ponnam Prabhakar | ప్రభుత్వం రూ.88.50 కోట్ల నిధులిచ్చింది.. కార్తీక మాసంలోనే ఆత్మగౌరవ భవనాల పనులు ప్రారంభించండి

Supreme Court | విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్.. నెలాఖరులోపు నివేదిక ఇవ్వండి





