POWERGRID | బీటెక్ అభ్యర్థులకు శుభవార్త.. పవర్‌గ్రిడ్‌లో ఉద్యోగాలు
POWERGRID | ఇంజినీరింగ్ పూర్తి చేశారా? ప్రభుత్వ ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే మీకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (POWERGRID) గుడ్ న్యూస్ చెప్పింది.
POWERGRID | త్రినేత్ర న్యూస్: ఇంజినీరింగ్ పూర్తి చేశారా? ప్రభుత్వ ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే మీకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (POWERGRID) గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 319 ఇంజినీర్ ట్రైనీ (Engineer Trainee) పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 18 వరకు అధికారిక వెబ్‌సైట్ powergrid.in.లో దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో బీటెక్ పూర్తి చేసి, GATE 2026లో అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి ప్రతినెల రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు జీతం వస్తుంది. ఏడాదిపాటు శిక్షణ అందిస్తారు.
మొత్తం పోస్టులు: 319
ఎలక్ట్రికల్- 250, సివిల్- 48, కంప్యూటర్ సైన్స్- 21
అర్హతలు: సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్ లేదా తత్సమాన డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. GATE 2026 పరీక్షలో అర్హత సాధించి ఉండటం తప్పనిసరి. అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 28 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం: GATE 2026 స్కోర్‌కు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. మొత్తం ఎంపిక ప్రక్రియలో GATE స్కోర్‌కు 85 శాతం వెయిటేజ్ కేటాయించారు. గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 18
వెబ్‌సైట్: www.powergrid.in/en/job-opportunities
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

AEES Teaching Recruitment | అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీలో టీచర్ ఉద్యోగాలు.. నవంబర్ 2 నుంచి దరఖాస్తులు
అక్టోబర్ 31, 2026

TGPSC | టీజీపీఎస్సీ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు.. నేటి నుంచి దరఖాస్తులు
అక్టోబర్ 30, 2026

ISRO URSC Recruitment | పదో తరగతి, ఐటీఐ అర్హతతో.. ఇస్రోలో టెక్నీషియన్, డ్రైవర్ పోస్టులు
అక్టోబర్ 29, 2026
తాజావార్తలు
- ●Horoscope | నవంబర్ 4 రాశిఫలాలు.. రహస్య కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది!
- ●Hyderabad Water Crisis | హైదరాబాద్‌లో నీటి కొరత ఎఫెక్ట్: కాలేజీలకు ముందే దీపావళి సెలవులు.. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో భారీ రద్దీ
- ●KTR Speech Khairatabad | తలాపున పారుతుంది గోదారి.. నీ చేను, నీ చెలక ఎడారి
- ●US Midterm Elections 2026 | అమెరికాలో 'మినీ' ఎన్నికల సమరం.. డొనాల్డ్ ట్రంప్‌నకు అసలైన అగ్నిపరీక్ష.. కాంగ్రెస్ పగ్గాలు దక్కేది ఎవరికి?
- ●Gold Price | ధన్‌తేరస్‌కు ముందే బంగారం ధరలకు బ్రేక్.. తులంపై రూ.700 డౌన్.. వెండి రూ.2వేలు..!
- ●Nayanthara | మహాశక్తి రిలీజ్ వేళ నయనతార ప్రత్యేక పూజలు

Horoscope | నవంబర్ 4 రాశిఫలాలు.. రహస్య కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది!

Hyderabad Water Crisis | హైదరాబాద్‌లో నీటి కొరత ఎఫెక్ట్: కాలేజీలకు ముందే దీపావళి సెలవులు.. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో భారీ రద్దీ

KTR Speech Khairatabad | తలాపున పారుతుంది గోదారి.. నీ చేను, నీ చెలక ఎడారి

US Midterm Elections 2026 | అమెరికాలో 'మినీ' ఎన్నికల సమరం.. డొనాల్డ్ ట్రంప్‌నకు అసలైన అగ్నిపరీక్ష.. కాంగ్రెస్ పగ్గాలు దక్కేది ఎవరికి?



