Vemula Veeresham | ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు తప్పిన ప్రమాదం..
Vemula Veeresham | తెలంగాణ ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham)కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు బలంగా ఢీకొట్టింది.
Vemula Veeresham | త్రినేత్ర న్యూస్: తెలంగాణ ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham)కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు బలంగా ఢీకొట్టింది. అయితే ఎయిర్ బెలూన్లు తెరచుకోవడంతో ఆయన క్షేమంగా బయటపడ్డారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం అన్నారం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్ నుంచి చిట్యాల (Chityal) మండలం చినకాపర్తికి తన వాహనంలో వెళ్తున్నారు. ఈ క్రమంలో అన్నారం స్టేజీ సమీపంలో జాతీయ రహదారిపై ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. దీంతో ఆయన కారు ధ్వంసమైంది. అయితే వేముల వీరేశం క్షేమంగా బయటపడటంతో అనుచరులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆయనను మరో కారులో తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- ●ASUS Zenbook 14 | పవర్ఫుల్ డిస్ప్లే, ఏఐ ఫీచర్లతో అసుస్ కొత్త ల్యాప్టాప్.. 30 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్..
- ●Salman Khan | సల్మాన్ ఖాన్ మాతృభూమికి సెన్సార్ క్లియరెన్స్ - లాంగెస్ట్ రన్టైమ్తో ట్రైలర్
- ●Ponnam Prabhakar | ప్రభుత్వం రూ.88.50 కోట్ల నిధులిచ్చింది.. కార్తీక మాసంలోనే ఆత్మగౌరవ భవనాల పనులు ప్రారంభించండి
- ●Supreme Court | విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్.. నెలాఖరులోపు నివేదిక ఇవ్వండి
- ●Silver Price | వెండి ధర రూ.2 లక్షలకు చేరనుందా..? 2 రోజుల్లోనే రూ.11వేలు జంప్..
- ●CP Sumathi | అండాల సేకరణ వ్యవహారంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలు: సీపీ సుమతి

ASUS Zenbook 14 | పవర్ఫుల్ డిస్ప్లే, ఏఐ ఫీచర్లతో అసుస్ కొత్త ల్యాప్టాప్.. 30 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్..

Salman Khan | సల్మాన్ ఖాన్ మాతృభూమికి సెన్సార్ క్లియరెన్స్ - లాంగెస్ట్ రన్టైమ్తో ట్రైలర్

Ponnam Prabhakar | ప్రభుత్వం రూ.88.50 కోట్ల నిధులిచ్చింది.. కార్తీక మాసంలోనే ఆత్మగౌరవ భవనాల పనులు ప్రారంభించండి

Supreme Court | విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్.. నెలాఖరులోపు నివేదిక ఇవ్వండి






