Debit Card Insurance | డెబిట్ కార్డుపై రూ.2 లక్షల బీమా.. చాలా మందికి తెలియని విషయం..
Debit Card Insurance | దేశంలోని పలు బ్యాంకులు తమ డెబిట్ కార్డు వినియోగదారులకు ఉచితంగా ప్రమాద బీమా, ప్రమాదవశాత్తూ మరణ బీమా సదుపాయాలను అందిస్తున్నాయి. కార్డు రకాన్ని బట్టి ఈ బీమా రూ.50 వేల నుంచి రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రయోజనాల గురించి చాలామంది వినియోగదారులకు తెలియదు. బీమా క్లెయిమ్ పొందాలంటే కార్డు యాక్టివ్‌గా ఉండడంతోపాటు నిర్దిష్ట గడువులో లావాదేవీ నిర్వహించి ఉండాలి.
Debit Card Insurance | దేశంలోని పలు బ్యాంకులు తమ డెబిట్ కార్డు వినియోగదారులకు ఉచితంగా ప్రమాద బీమా, ప్రమాదవశాత్తూ మరణ బీమా సదుపాయాలను అందిస్తున్నాయి. కార్డు రకాన్ని బట్టి ఈ బీమా రూ.50 వేల నుంచి రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రయోజనాల గురించి చాలామంది వినియోగదారులకు తెలియదు. బీమా క్లెయిమ్ పొందాలంటే కార్డు యాక్టివ్‌గా ఉండడంతోపాటు నిర్దిష్ట గడువులో లావాదేవీ నిర్వహించి ఉండాలి.
కార్డు రకాన్ని బట్టి బీమా..
సాధారణంగా డెబిట్ కార్డు అంటే డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి, ఆన్‌లైన్ చెల్లింపులు చేయడానికి ఉపయోగపడే సాధనంగానే చాలామంది భావిస్తారు. కానీ పలు భారతీయ బ్యాంకులు తమ డెబిట్ కార్డులతోపాటు ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా, ప్రమాదవశాత్తూ మరణ బీమా, శాశ్వత పూర్తి వైకల్య బీమా వంటి ప్రయోజనాలను కూడా అందిస్తున్నాయి. కార్డు రకాన్ని బట్టి ఈ బీమా మొత్తం రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుంది. అయితే బీమా ప్రయోజనాలు పొందాలంటే ప్రమాదం జరగడానికి ముందు సాధారణంగా 30 నుంచి 90 రోజుల వ్యవధిలో కనీసం ఒక లావాదేవీ నిర్వహించి కార్డును యాక్టివ్‌గా ఉంచి ఉండాలి. క్లెయిమ్ చేసేందుకు బ్యాంకును బట్టి ప్రత్యేక గడువులు కూడా ఉంటాయి. అందువల్ల వినియోగదారులు తమ కార్డుకు వర్తించే నిబంధనలను ముందుగానే తెలుసుకోవాలి.
ఎస్‌బీఐలో రూ.50 లక్షల వరకు..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పలు డెబిట్ కార్డు వేరియంట్లపై రూ.2 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు బీమా సదుపాయాలను అందిస్తోంది. ఇందులో వ్యక్తిగత ప్రమాద బీమా, విమాన ప్రయాణ ప్రమాద బీమా ఉన్నాయి. అయితే వీసా, మాస్టర్‌కార్డ్ గ్లోబల్, క్లాసిక్, వర్చువల్ కార్డు వేరియంట్లకు ఈ బీమా వర్తించదని ఎస్‌బీఐ తన వెబ్‌సైట్ లో పేర్కొంది. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా ఎంపిక చేసిన డెబిట్ కార్డులపై వ్యక్తిగత ప్రమాద మరణ బీమాను అందిస్తోంది. ముఖ్యంగా అర్హత కలిగిన ప్లాటినం డెబిట్ కార్డులతో కొనుగోలు చేసిన అంతర్జాతీయ విమాన టికెట్లపై రూ.3 కోట్ల వరకు విమాన ప్రమాద బీమా ప్రయోజనం కల్పిస్తోంది. క్లాసిక్, ప్రిఫర్డ్, ఇంపీరియా, ప్లాటినం, విశేష్, మనీబ్యాక్ కార్డుల వినియోగదారులకు నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.
ఎలా క్లెయిమ్ చేయాలి..
బీమా క్లెయిమ్ చేసుకునే విధానం, అవసరమైన పత్రాలు బ్యాంకును బట్టి మారుతాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నిబంధనల ప్రకారం.. కార్డుదారుడు మరణించిన నెల రోజుల్లోపు నామినీ లేదా చట్టబద్ధ వారసులు సమీప బ్యాంకు శాఖలో క్లెయిమ్ సమర్పించాలి. ఇందుకోసం క్లెయిమ్ ఫామ్ లేదా అభ్యర్థన లేఖ, ఆసుపత్రిలో చికిత్స పొందినట్లయితే డెత్ సమ్మరీ, పోస్టుమార్టం నివేదిక, మున్సిపల్ అధికారులు జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రం, తుది పోలీసు విచారణ నివేదిక సమర్పించాలి. అలాగే ప్రమాదానికి ముందు ఏడాది కాలానికి సంబంధించిన బ్యాంక్ స్టేట్‌మెంట్, ప్లాటినం కార్డులకు ఏడాది, గోల్డ్ కార్డులకు ఆరు నెలల లావాదేవీల వివరాలు, నామినీ వివరాలు, కేవైసీ పత్రాలు, నెఫ్ట్ వివరాలు కూడా అవసరమవుతాయి. కాబట్టి డెబిట్ కార్డుపై ఎలాంటి బీమా ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోవడంతోపాటు, ఆ వివరాలను కుటుంబ సభ్యులకు, నామినీకి తెలియజేయడం మంచిది.
సంబంధిత వార్తలు

HDFC Bank | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో రహస్య సమాచారం లీక్..? ఇద్దరు సీనియర్ అధికారులపై విచారణ..
అక్టోబర్ 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ..
అక్టోబర్ 19, 2026

HDFC Bank | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గుడ్ న్యూస్.. ఉద్యోగులకు 18.97 లక్షల షేర్లు..
సెప్టెంబర్ 25, 2026
తాజావార్తలు
- ●Indian Bank | ఇండియన్ బ్యాంక్‌లో 1500 అప్రెంటిస్‌లు.. తెలంగాణలో ఎన్ని ఖాళీలు అంటే?
- ●Yash | ఇన్‌స్టాగ్రామ్‌లో యశ్‌కు కోటిన్నర ఫాలోవర్స్ - అతడు ఫాలో అయ్యిది మాత్రం ఒక్కరినే - ఆ హీరోయిన్ ఎవరంటే?
- ●Stone Pelting Attack | కాంగ్రెస్ నేతల బస్సుపై రాళ్ల దాడి.. ఎక్కడ జరిగిందంటే!
- ●ASUS Zenbook 14 | పవర్ఫుల్ డిస్ప్లే, ఏఐ ఫీచర్లతో అసుస్ కొత్త ల్యాప్‌టాప్.. 30 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్..
- ●Vemula Veeresham | ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు తప్పిన ప్రమాదం..
- ●Salman Khan | సల్మాన్ ఖాన్ మాతృభూమికి సెన్సార్ క్లియరెన్స్ - లాంగెస్ట్ రన్టైమ్తో ట్రైలర్

Indian Bank | ఇండియన్ బ్యాంక్‌లో 1500 అప్రెంటిస్‌లు.. తెలంగాణలో ఎన్ని ఖాళీలు అంటే?

Yash | ఇన్‌స్టాగ్రామ్‌లో యశ్‌కు కోటిన్నర ఫాలోవర్స్ - అతడు ఫాలో అయ్యిది మాత్రం ఒక్కరినే - ఆ హీరోయిన్ ఎవరంటే?

Stone Pelting Attack | కాంగ్రెస్ నేతల బస్సుపై రాళ్ల దాడి.. ఎక్కడ జరిగిందంటే!

ASUS Zenbook 14 | పవర్ఫుల్ డిస్ప్లే, ఏఐ ఫీచర్లతో అసుస్ కొత్త ల్యాప్‌టాప్.. 30 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్..



