త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MEA Statemen | పాక్ ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన భార‌త్‌.. ఆ వ్యాఖ్యాలు నిరాధార‌మ‌న్న ర‌ణ‌ధీర్ జైస్వాల్‌..

MEA statemen | పాకిస్తాన్ చేసిన ఆరోప‌ణ‌ల‌ను భార‌త్ ఖండించింది. కరాచీ బాంబు పేలుళ్లకు భారత్‌కు సంబంధం ఉందన్న పాక్ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తీవ్రంగా స్పందిస్తూ దాయాది దేశం ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.

P

National | Published On Jun 28, 2026, 5.18 pm IST

MEA Statemen | పాక్ ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన భార‌త్‌.. ఆ వ్యాఖ్యాలు నిరాధార‌మ‌న్న ర‌ణ‌ధీర్ జైస్వాల్‌..
Advertisement

MEA statemen | పాకిస్తాన్ చేసిన ఆరోప‌ణ‌ల‌ను భార‌త్ ఖండించింది. కరాచీ బాంబు పేలుళ్లకు భారత్‌కు సంబంధం ఉందన్న పాక్ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తీవ్రంగా స్పందిస్తూ దాయాది దేశం ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. కరాచీ ఘటనపై భారత్‌పై పాక్ చేసిన ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఇతరులపై వేలు చూపించడానికి బదులు, ఆ దేశం త‌న అంత‌ర్గ‌త ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వ్యాఖ్యానించారు. ఆ దేశంలో ఉన్న ఉగ్రవాద మౌలిక వసతులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

కరాచీలోని సింధ్ రేంజర్స్ శిబిరంపై జరిగిన ఉగ్రదాడి త‌ర్వాత పాక్ సైన్యానికి చెందిన మీడియా విభాగం ఐఎస్‌పీఆర్ ఈ దాడికి భారత్ కారణమని ఆరోపించింది. నిషేధిత జమాత్-ఉల్-అహ్రార్ సంస్థను భారత్‌ మద్దతుతో నడిచే సంస్థగా ఆరోపణలు చేసింది. ఇదే సమయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా భారత్ ప్రాంతీయంగా ఉగ్ర కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి కరాచీలోని గులిస్తాన్-ఎ-జోహర్ ప్రాంతంలో ఉన్న పాకిస్థాన్ రేంజర్స్ (సింధ్) శిబిరంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు దాడి చేసిన ఉగ్రవాదులు హతమయ్యారు. మరో గాయపడిన దాడిదారుడిని భద్రతా దళాలు అరెస్టు చేశాయి. పాక్ సైన్యానికి చెందిన ఐఎస్‌పీఆర్ తెలిపిన వివరాల ప్రకారం.. జమాత్-ఉల్-అహ్రార్‌కు చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ సంస్థ నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) నుంచి విడిపోయింది.

Advertisement
Advertisement