Revanth Reddy | నల్గొండలో మహత్తర ఘట్టం.. హ్యామ్ రోడ్ల పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం
Revanth Reddy | నల్గొండ జిల్లా కనగల్ ఏఎంసీ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో మహత్తర ఘట్టం ఆవిష్కృతమైంది. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (HAM) రోడ్స్ పైలాన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. మొదటి దశలో రూ.13,006 కోట్లతో 6,092 కిలోమీటర్ల మేర 441 రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: నల్గొండ జిల్లా కనగల్ ఏఎంసీ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో మహత్తర ఘట్టం ఆవిష్కృతమైంది. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (HAM) రోడ్స్ పైలాన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. మొదటి దశలో రూ.13,006 కోట్లతో 6,092 కిలోమీటర్ల మేర 441 రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా నల్గొండ వైద్య కళాశాల నుంచి మేళ్లదుప్పలపల్లి వరకు, చిట్యాల నుంచి భువనగిరి వరకు, దర్వేశిపురం నుంచి డిండి వరకు హ్యామ్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.

అనంతరం సీఎం కనగల్ నుంచి నల్గొండకు చేరుకున్నారు. నల్గొండ ఎన్ జీ కాలేజ్ గ్రౌండ్ లో టీయూఎఫ్‌ఐడీసీ (TUFIDC) ఆధ్వర్యంలో రూ.83 కోట్లతో చేపట్టనున్న మొదటి దశ తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి నల్గొండ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు చేరుకున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు.
ఈ కార్యక్రమాల్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్.ఎంపీ రఘువీర్ రెడ్డి,ఎంఎల్ ఏ లు జైవీర్ రెడ్డి,బత్తుల లక్ష్మారెడ్డి,బాలు నాయక్,ఎంఎల్సీ నెల్లికంటి సత్యం పాల్గొన్నారు.

తాజావార్తలు
- ●Saudi Aramco Helicopter Crash | సౌదీలో ఘోర ప్రమాదం: 'అరామ్కో' హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం
- ●CM Revanth Reddy | బీఆర్ఎస్ను మళ్లీ మొలవనియ్యం.. ఆ జానెడోడిని కూడా : సీఎం రేవంత్ రెడ్డి
- ●World Rowing Cup | చరిత్ర సృష్టించిన భారత్.. వరల్డ్ రోయింగ్ కప్‌లో తొలిసారి గోల్డ్ మెడల్..!
- ●Nitin Nabin | బెంగాల్ స్ఫూర్తితో తెలంగాణలో ముందుకు సాగాలి
- ●Prabhas | ప్రభాస్ ఫౌజీ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే? - రిలీజ్ డేట్‌పై కొత్త రూమర్?
- ●PM Modi Seychelles Visit | సీషెల్స్ అత్యున్నత పురస్కారం అందుకున్న మోదీ: పర్యావరణ యోధులకు అవార్డు అంకితం

Saudi Aramco Helicopter Crash | సౌదీలో ఘోర ప్రమాదం: 'అరామ్కో' హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం

CM Revanth Reddy | బీఆర్ఎస్ను మళ్లీ మొలవనియ్యం.. ఆ జానెడోడిని కూడా : సీఎం రేవంత్ రెడ్డి

World Rowing Cup | చరిత్ర సృష్టించిన భారత్.. వరల్డ్ రోయింగ్ కప్‌లో తొలిసారి గోల్డ్ మెడల్..!

Nitin Nabin | బెంగాల్ స్ఫూర్తితో తెలంగాణలో ముందుకు సాగాలి



