త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CPI Narayana | పీవీ, మన్మోహన్‌ కృష్ణార్జునుల వలె పాలించారు 

CPI Narayana | భార‌త‌ర‌త్న పీవీ నరసింహారావు భారత ప్రధానిగా, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా కృష్ణార్జునలవలె పాలన సాగించారని సీపీఐ జాతీయ నాయ‌కులు కె.నారాయ‌ణ కొనియాడారు. పీవీతో రాజ‌కీయ విభేదాలుండేవ‌ని, ఆయ‌న తెచ్చిన ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌ను కమ్యూనిస్టులుగా తీవ్రంగా వ్యతిరేకించామ‌న్నారు.

S

Telangana | Published On Jun 28, 2026, 4.39 pm IST

CPI Narayana | పీవీ, మన్మోహన్‌ కృష్ణార్జునుల వలె పాలించారు 
Advertisement
  • వారు తెచ్చిన సంస్క‌ర‌ణ‌లను మేం వ్య‌తిరేకించాం
  • కానీ అవి ఏమేర‌కు ప్ర‌యోజ‌న‌మో ప‌రిశీలించి ఉంటే బాగుండే
  • సీపీఐ నారాయ‌ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

CPI Narayana | త్రినేత్ర‌.న్యూస్‌: భార‌త‌ర‌త్న పీవీ నరసింహారావు భారత ప్రధానిగా, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా కృష్ణార్జునలవలె పాలన సాగించారని సీపీఐ జాతీయ నాయ‌కులు కె.నారాయ‌ణ కొనియాడారు. పీవీతో రాజ‌కీయ విభేదాలుండేవ‌ని, ఆయ‌న తెచ్చిన ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌ను కమ్యూనిస్టులుగా తీవ్రంగా వ్యతిరేకించామ‌న్నారు. అలాకాకుండా అవి ఎంత‌వ‌ర‌కు ప్ర‌యోజ‌న‌మో ప‌రిశీలించి ఉంటే బాగుండేద‌ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆనాటి నిర్ణ‌యాల‌ను స‌మీక్షించుకొని, ఈనాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించుకోవాల‌న్నారు. పీవీ జయంతి సంద‌ర్భంగా ఆదివారం ఆయ‌న శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. కేంద్రంలోని దుర్యోధ‌న‌, దుశ్యాస‌న పాల‌న‌పై పోరాటం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని గుర్తు చేశారు.

నేను జై ఆంధ్రా ఉద్య‌మంలో పాల్గొన్నా..

పీవీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన భూ సంస్కరణలు అమలు చేయడంతో భూస్వాములు అంతా కలిసి జై ఆంధ్రా ఉద్యమం తీసుకొచ్చారు. ఆనాడు గుంటూరులో విద్యార్థిగా ఉన్న నేను సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నాను. పీవీ నరసింహారావు హయాంలో రాజకీయంగా మాకు విభేదాలు ఉండి ఉండవచ్చు. నాడు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచీకరణ సరళీకరణ ఆర్థిక విధానాలు, సంస్కరణలో అమలు చేయటాన్ని మేం కమ్యూనిస్టులుగా తీవ్రంగా వ్యతిరేకించాం. కానీ రాను రాను అదే ఇంప్లిమెంట్ అయిపోయింది.

దుశ్యాస‌న పాల‌న‌పై పోరాటం చేద్దాం..

సంస్కరణల్లో ఏది ప్రయోజనకరంగా ఉందో, ఏది లేదో మేం సూక్ష్మంగా పరిశీలించి ఉంటే బాగుండేది. నాడు పీవీ నరసింహారావు ఉన్నత వ్యక్తిత్వానికి, దేశ ఆర్థిక భద్రతకు, నిబద్ధతకు ప్రతీకగా నిలిచారు. ప్రస్తుతం దేశంలో దుర్యోధన, దుశ్యాసన పరిపాలన సాగుతోంది. ఈ పాలనపై పోరాటం సాగించాల్సిన అవసరం మనందరిపైన ఉందనేది గురైరగాలి అని నారాయ‌ణ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement
Advertisement