Ashika Ranganath | తిరువీర్‌తో కన్నడ బ్యూటీ రొమాన్స్ – నటుడిగా ఎంట్రీ ఇస్తోన్న నిర్మాత ఎస్‌కేఎన్
మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరలో హీరోయిన్‌గా నటిస్తోంది కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్. ఈ సినిమా రిలీజ్ కాకముందే తెలుగులో మరో క్రేజీ ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. యంగ్ హీరో తిరువీర్‌తో ఓ రొమాంటిక్ కామెడీ మూవీ చేయబోతుందట ఈ సాండల్‌వుడ్ బ్యూటీ.
Entertainment | Published On Jun 28, 2026, 5.30 pm IST
Ashika Ranganath | టాలీవుడ్‌లో కన్నడ బ్యూటీల డామినేషన్ మామూలుగా లేదు. ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతోన్న పలు పాన్ ఇండియన్ సినిమాల్లో కన్నడ ముద్దుగుమ్మలే హీరోయిన్లుగా నటిస్తోన్నారు. రష్మిక మందన్న, రుక్మిణి వసంత్, పూజా హెగ్డేతో పాటు పలువురు కన్నడ బ్యూటీలు టాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆషికా కూడా వీరి బాటలోనే అడుగులు వేస్తోంది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి విశ్వంభరలో ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే టాలీవుడ్‌లో మరో క్రేజీ మూవీకి ఓకే చెప్పింది ఈ సాండల్‌వుడ్ సుందరి.
రూరల్ లవ్‌స్టోరీ...
తిరువీర్ హీరోగా తెలుగులో ఓ రొమాంటిక్ కామెడీ మూవీ రాబోతుంది. ఈ సినిమా ద్వారా రైటర్ కృష్ణ చేపూరి మెగాపోన్ పట్టబోతున్నారు. ఇందులో తిరువీర్ సరసన ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించబోతున్నదట. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూరల్ బ్యాక్‌డ్రాప్ లవ్‌స్టోరీగా తిరువీర్, ఆషికా రంగనాథ్ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం.
నటుడిగా...నిర్మాత...
తిరువీర్ మూవీలో టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతోనే ఫస్ట్ టైమ్ అతడు కెమెరా ముందుకు రాబోతున్నట్లు సమాచారం. అతడి క్యారెక్టర్ సినిమాకు హైలైట్‌గా ఉంటుందని టాక్. నిర్మాతగా బేబీ, టాక్సీవాలా వంటి సినిమాలతో పాటు త్రీ రోజెస్, హెడ్స్ అండ్ టేల్స్ వంటి సిరీస్‌లను నిర్మించారు ఎస్‌కేఎన్. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం చెన్నై లవ్‌స్టోరీ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
కార్తీ తమిళ మూవీలో...
ప్రస్తుతం చిరంజీవి విశ్వంభరతో పాటు తమిళంలో కార్తీ సర్ధార్ 2లో ఆషికా హీరోయిన్‌గా కనిపించబోతున్నది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే థియేటర్లలోకి రానున్నాయి. కన్నడ సినిమాలతో హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టింది ఆషికా రంగనాథ్. సాండల్‌వుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది. నందమూరి కళ్యాణ్ రామ్ అమిగోస్‌తో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది. నాగార్జున నా సామిరంగతో హీరోయిన్‌గా ఫస్ట్ హిట్‌ను అందుకుంది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తిలో మెయిన్ హీరోయిన్‌గా నటించింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Prabhas | ప్రభాస్ ఫౌజీ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే? – రిలీజ్ డేట్‌పై కొత్త రూమర్?
జూన్ 28, 2026

Telugu OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ – రెమ్యూనరేషన్ లేకుండా సినిమా చేసిన హీరో
జూన్ 28, 2026

Pooja Hegde | పవన్ కళ్యాణ్ ఓజీ యూనివర్స్‌లో బుట్టబొమ్మ – అప్పుడు ఛాన్స్ మిస్ – ఇప్పుడు జాక్‌పాట్
జూన్ 28, 2026
తాజావార్తలు
- ●Kavya Maran - Anirudh | అనిరుధ్ కంటే కావ్య మారన్ చాలా రిచ్ - ఆమె ఆస్తి ఎన్ని వందల కోట్లు అంటే?
- ●Novak Djokovic | విరాట్‌తో అనుబంధంపై జకోవిచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
- ●Komati Reddy Venkat Reddy | బీఆరెసోళ్లు.. పచ్చకామెర్లు వచ్చినోళ్ల లెక్కనే ఉన్నరు
- ●Saudi Aramco Helicopter Crash | సౌదీలో ఘోర ప్రమాదం: 'అరామ్కో' హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం
- ●CM Revanth Reddy | బీఆర్ఎస్ను మళ్లీ మొలవనియ్యం.. ఆ జానెడోడిని కూడా : సీఎం రేవంత్ రెడ్డి
- ●World Rowing Cup | చరిత్ర సృష్టించిన భారత్.. వరల్డ్ రోయింగ్ కప్‌లో తొలిసారి గోల్డ్ మెడల్..!

Kavya Maran - Anirudh | అనిరుధ్ కంటే కావ్య మారన్ చాలా రిచ్ - ఆమె ఆస్తి ఎన్ని వందల కోట్లు అంటే?

Novak Djokovic | విరాట్‌తో అనుబంధంపై జకోవిచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Komati Reddy Venkat Reddy | బీఆరెసోళ్లు.. పచ్చకామెర్లు వచ్చినోళ్ల లెక్కనే ఉన్నరు

Saudi Aramco Helicopter Crash | సౌదీలో ఘోర ప్రమాదం: 'అరామ్కో' హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం



