Venezuela | భూకంపంలో భార్యను కోల్పోయిన ఫుట్‌బాలర్.. కూతురి కోసం ప్రాణత్యాగం చేసిన తల్లి..!
Venezuela | వెనెజువెలాలో ఇటీవల సంభవించిన భీకర భూకంపం వేలాది కుటుంబాలను శోకసంద్రంలో ముంచెత్తింది. ఈ విపత్తులో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన ప్రపంచవ్యాప్తంగా అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఫుట్‌బాలర్ హెక్టర్ బెల్లో భార్య ఆండ్రియా భవనం కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయినా.. చివరి శ్వాస వరకు ఏడాది వయసున్న కుమార్తె అలానాను కాపాడేందుకు చేసిన త్యాగం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది.
Venezuela | వెనెజువెలాలో ఇటీవల సంభవించిన భీకర భూకంపం వేలాది కుటుంబాలను శోకసంద్రంలో ముంచెత్తింది. ఈ విపత్తులో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన ప్రపంచవ్యాప్తంగా అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఫుట్‌బాలర్ హెక్టర్ బెల్లో భార్య ఆండ్రియా భవనం కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయినా.. చివరి శ్వాస వరకు ఏడాది వయసున్న కుమార్తె అలానాను కాపాడేందుకు చేసిన త్యాగం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. భూకంపం అనంతరం శిథిలాల తొలగింపు పనులు చేపట్టిన సహాయక బృందాలు రెండు రోజుల పాటు నిరంతరం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో శిథిలాల కింద చిక్కుకున్న చిన్నారి అలానాను సజీవంగా గుర్తించి వెంటనే రాజధాని కారాకస్‌లోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె తల్లి ఆండ్రియా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
భార్య మృతిని జీర్ణించుకోలేకపోతున్న హెక్టర్ బెల్లో తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నాడు. "నువ్వు ఎప్పటికీ మా జీవితాల్లో గొప్ప హీరోవే. మన కూతురు నిన్ను ఎప్పటికీ మరిచిపోకుండా చూస్తాను. ఆమెపై నీకున్న ప్రేమ, ఆమె కోసం నువ్వు చేసిన త్యాగం గురించి జీవితాంతం చెబుతూనే ఉంటాను" అని పేర్కొన్నాడు. మరో పోస్ట్‌లో తన కుమార్తెను ఉద్దేశిస్తూ.. "నిన్ను కాపాడేందుకు నీ అమ్మ తన ప్రాణాలనే అర్పించింది. చివరి శ్వాస వరకు నిన్ను వదల్లేదు. ఆ విషయం నీకు తప్పకుండా చెబుతాను" అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇంకో పోస్టులో "నా చిన్నారి.. నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇంకొంచెం బలంగా నిలబడాలి. నా హృదయం పూర్తిగా విరిగిపోయింది. నన్ను ఓదార్చాల్సింది నువ్వే. ఇకపై మనిద్దరమే. మీ అమ్మ మాత్రం స్వర్గం నుంచి మనిద్దరినీ చూస్తూ ఉంటుంది. ఆమె నాకు ధైర్యం ఇస్తుందని నమ్ముతున్నాను. ఇప్పుడు ఆమె మాట్లాడగలిగితే.. 'నేను మన కూతురిని ఎలా కాపాడానో.. నువ్వు కూడా నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో' అని చెప్పేదేమో" అంటూ రాసుకొచ్చాడు.
హెక్టర్ బెల్లో ప్రస్తుతం మారిటిమో డి లా గ్వైరా క్లబ్ తరఫున ఫుట్‌బాల్ ఆడుతున్నాడు. ఈ నెల 24న భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కూతురితో కలిసి ఇంట్లోనే ఉంటోంది. ప్రకంపనల ధాటికి భవనం నేలట్టమైంది. భనవం శిథిలాల కింద చిక్కుకొని చనిపోయింది. తాను చనిపోతూ ఏడాది వయస్సు కలిగిన తన బిడ్డను కాపాడింది. కూతురిని పొత్తిళ్లలో భద్రంగా దాచుకొని కాపాడింది. సహాయక చర్యల్లో భాగంగా ఆండ్రియా మృతదేహాన్ని శిథిలాల కింద నుంచి తీస్తున్న క్రమంలో పాప ఏడుపు వినిపించింది. దీంతో ఆండ్రియా మృతదేహాన్ని బయటకు తీసి చూడగా ఆమె చేతుల్లో అలానా కనిపించింది. ఈ విషయాన్ని హెక్టర్‌కు తెలియజేయగా.. ఆయన ఘటన స్థలికి చేరుకొని భార్య మృతదేహాన్ని గట్టిగా పట్టుకొని కన్నీరు పెట్టడం అందరినీ కంటతడి పెట్టించింది. ఇటీవల వెనెజువెలాలో సంభవించిన రెండు భారీ భూకంపాల కారణంగా దేశవ్యాప్తంగా తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 1,400 మందికిపైగా మరణించగా, వేలాది మంది ఇంకా గల్లంతయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు నిరంతరం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Green India Challenge | ప్రతి డాట్ బాల్‌కు మొక్కలు .. తెలంగాణ క్రికెట్లో కొత్త అధ్యాయం
- ●Rangareddy | వికలాంగుడే కానీ.. కూరగాయలు విక్రయిస్తూ జీవనోపాధి పొందుతూ..
- ●Sharmiela Mandre | తమిళ నిర్మాతతో సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్ - ఫొటోలు వైరల్
- ●Ramchandar Rao | కాంగ్రెస్.. పీవీని ఎప్పుడూ గౌరవించలే: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
- ●Pooja Hegde | పవన్ కళ్యాణ్ ఓజీ యూనివర్స్‌లో బుట్టబొమ్మ - అప్పుడు ఛాన్స్ మిస్ - ఇప్పుడు జాక్‌పాట్
- ●Rain Alert | తెలంగాణ వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు.. హైదరాబాద్‌లో ఈ రాత్రికి భారీ వర్షం..

Green India Challenge | ప్రతి డాట్ బాల్‌కు మొక్కలు .. తెలంగాణ క్రికెట్లో కొత్త అధ్యాయం

Rangareddy | వికలాంగుడే కానీ.. కూరగాయలు విక్రయిస్తూ జీవనోపాధి పొందుతూ..

Sharmiela Mandre | తమిళ నిర్మాతతో సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్ - ఫొటోలు వైరల్

Ramchandar Rao | కాంగ్రెస్.. పీవీని ఎప్పుడూ గౌరవించలే: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు






