త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Green Hydrogen Train | భార‌తీయ రైల్వేలో స‌రికొత్త అధ్యాయం..! త్వ‌ర‌లో ప‌ట్టాలెక్క‌నున్న హైడ్రోజ‌న్ రైలు

Green Hydrogen Train | భారత రైల్వే స‌రికొత్త మైలురాయిని చేర‌బోతున్న‌ది. దేశంలోనే తొలిసారిగా అభివృద్ధి చేసిన గ్రీన్ హైడ్రోజ‌న్ రైలు చివ‌రి ద‌శ ప‌రీక్ష‌ల‌ను పూర్తి చేసుకుంటున్న‌ది. పర్యావరణ హిత రవాణా వ్యవస్థ దిశగా భారత రైల్వే వేస్తున్న ఈ ముంద‌డుగు వేస్తున్న‌ది.

P

National | Published On Jun 28, 2026, 5.41 pm IST

Green Hydrogen Train | భార‌తీయ రైల్వేలో స‌రికొత్త అధ్యాయం..! త్వ‌ర‌లో ప‌ట్టాలెక్క‌నున్న హైడ్రోజ‌న్ రైలు
Advertisement

Green Hydrogen Train | భారత రైల్వే స‌రికొత్త మైలురాయిని చేర‌బోతున్న‌ది. దేశంలోనే తొలిసారిగా అభివృద్ధి చేసిన గ్రీన్ హైడ్రోజ‌న్ రైలు చివ‌రి ద‌శ ప‌రీక్ష‌ల‌ను పూర్తి చేసుకుంటున్న‌ది. పర్యావరణ హిత రవాణా వ్యవస్థ దిశగా భారత రైల్వే వేస్తున్న ఈ ముంద‌డుగు వేస్తున్న‌ది. త్వరలోనే రైలు సేవ‌లు ప్ర‌యాణికుల‌కు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ది. ఢిల్లీ–జింద్ మార్గంలోని జింద్–సోనిపట్ సెక్షన్‌లో ఈ రైలు కీల‌క ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించారు. టెస్ట్ స‌మ‌యంలో రైలు గంటకు గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం గమనార్హం. అయితే, సాధారణ ప్రయాణికుల సేవల్లో దీని వేగాన్ని గంటకు 75 కిలోమీటర్లకు పరిమితం చేయ‌నున్నారు. ట్రయల్స్ సమయంలో ఇంజినీరింగ్ బృందం ఎమ‌ర్జెన్సీ బ్రేకింగ్ సిస్ట‌మ్‌, ట్రాక్‌పై స్థిరత్వం, మొత్తం పనితీరును ప‌రిశీలించారు.

ఈ హైడ్రోజన్ రైలును పూర్తిగా కొత్తగా తయారు చేయకుండానే, పాత డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (DEMU) రైలును ఆధునిక హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలుగా మార్చారు. హైదరాబాద్‌కు చెందిన మెఢా సర్వో డ్రైవ్స్ సంస్థ, కెనడాకు చెందిన బ్యాలార్డ్ పవర్ సిస్టమ్స్ సహకారంతో ఈ మార్పులు చేశారు. మొత్తం 10 కోచ్‌లతో రూపొందిన ఈ రైలులో రెండు పవర్ కార్లు ఉండగా.. ఒక్కోటి 1200 కిలోవాట్ల సామర్థ్యంతో పనిచేస్తుంది. మొత్తం 2400 కిలోవాట్ల శక్తిని ఉత్పత్తి చేసే ఈ రైలు, బ్రాడ్ గేజ్‌పై నడిచే ప్రపంచంలోనే అత్యంత పొడవైన, శక్తివంతమైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా నిపుణులు పేర్కొంటున్నారు. రెండు చివర్లలో హైడ్రోజన్ నిల్వ వ్యవస్థలు, అదనపు శక్తి కోసం బ్యాటరీలు, అలాగే రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిస్తున్నాయి.

ఈ రైలు ప్రత్యేకత అది పనిచేసే విధానంలోనే ఉంది. ఫ్యూయల్ సెల్ సాంకేతికత ద్వారా హైడ్రోజన్‌ను గాలిలోని ఆక్సిజన్‌తో కలిపి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియలో వెలువడేది కేవలం నీటి ఆవిరి మాత్రమే కావడంతో ఇది పూర్తిగా జీరో కర్బన ఉద్గారాల రవాణా వ్యవస్థగా నిలుస్తోంది. ఉత్పత్తి అయిన విద్యుత్‌తో ట్రాక్షన్ మోటార్లు పనిచేసి రైలు ముందుకు కదులుతుంది. ఒకసారి హైడ్రోజన్ నింపితే సుమారు 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల సామర్థ్యం ఈ రైలుకు ఉంది. ఇందుకోసం జింద్‌లో ప్రత్యేకంగా హైడ్రోజన్ రీఫ్యూయిలింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఇది రోజుకు సుమారు 430 కిలోల హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయగలదు.

భారత రైల్వే చేపట్టిన ‘హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్’ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. విద్యుదీకరణ సాధ్యం కాని మార్గాలు, పర్వత ప్రాంతాలు, డార్జిలింగ్, నీలగిరి వంటి హెరిటేజ్ రూట్లలో ఈ తరహా రైళ్లను ప్రవేశపెట్టాలన్నది రైల్వే లక్ష్యం. ఒక్కో రైలుకు సుమారు రూ.80 కోట్లు, మౌలిక వసతులకు మరో రూ.70 కోట్ల వరకు వ్యయం అవుతున్నట్లు సమాచారం. జర్మనీ, జపాన్, చైనా వంటి దేశాలు ఇప్పటికే హైడ్రోజన్ రైళ్లను వినియోగంలోకి తెచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు ఆ జాబితాలో భారత్ కూడా చేరింది. మే 2026లో రైల్వే బోర్డు ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టు.. త్వరలోనే భార‌తీయ రవాణాలో కొత్త అధ్యాయానికి శ్రీ‌కారం చుట్ట‌నుంది.

Advertisement
Advertisement