త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | చిర్ర గోనె ఆడిన హ‌రీశ్‌రావు.. ఫొటోలు వైర‌ల్

Harish Rao | నిత్యం ప్ర‌జల్లో ఉంటూ.. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై పోరాడే బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు కాసేపు చిన్న‌ప్ప‌టి జ్ఞాప‌కాల్లోకి వెళ్లిపోయారు. ఒక‌ప్పుడు తెలంగాణ‌లోని ప్ర‌తి ప‌ల్లెలో ఆడిన చిర్ర గోనె ఆట‌ను హ‌రీశ్‌రావు ఆడారు.

S

Telangana | Published On Jun 28, 2026, 5.36 pm IST

Harish Rao | చిర్ర గోనె ఆడిన హ‌రీశ్‌రావు.. ఫొటోలు వైర‌ల్
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : నిత్యం ప్ర‌జల్లో ఉంటూ.. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై పోరాడే బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు కాసేపు చిన్న‌ప్ప‌టి జ్ఞాప‌కాల్లోకి వెళ్లిపోయారు. ఒక‌ప్పుడు తెలంగాణ‌లోని ప్ర‌తి ప‌ల్లెలో ఆడిన చిర్ర గోనె ఆట‌ను హ‌రీశ్‌రావు ఆడారు. ప‌ల్లెల్లో అంత‌రించిపోయిన చిర్ర గోనె ఆట‌ను హ‌రీశ్‌రావు ఆడి అంద‌రికీ చిన్న‌ప్ప‌టి స్మృతుల‌ను గుర్తు చేశారు.

అంతరించిన పోయిన చిర్ర గోనె ఆటను నేటి తరానికి గుర్తు చేస్తూ సిద్దిపేట‌లో నిర్వ‌హించిన టోర్న‌మెంట్‌ను మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో అంతరించిపోయిన ఆటలను నేటి తరానికి అందించాలి. ప‌ల్లెల్లో నాడు వాలీబాల్, చిర్ర గోనె, ఖోఖో లాంటి ఆటలు ఎన్నో ఆడేవాళ్లం. అదే విధంగా సూర్యరష్మిలో ఆట‌లాడ‌డంతో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లిగేవి. కానీ నేటి తరం అన్ని ఆటలు ఫోన్‌లో ఆన్‌లైన్‌లోనే ఆడుతున్నారు. దాని వలన చిన్నప్పటి నుండే వ్యాధులకు గురవుతున్నారు. అలాంటి అంతరించిపోయిన చిర్ర గోనె ఆటను మళ్ళీ గుర్తు చేయడం నేటి తరానికి ప‌రిచ‌యం చేయ‌డం సంతోషంగా ఉంది. ఈ టోర్నమెంట్‌ను నిర్వహించిన నిర్వహకులకు హ‌రీశ్‌రావు అభినందనలు తెలిపారు.

Advertisement
Advertisement