Uttam Kumar Reddy | పార్టీలో దీర్ఘకాలం కష్టపడ్డ నాయకులకు న్యాయం జరగాలి
Uttam Kumar Reddy | పార్టీలో దీర్ఘకాలంగా కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందని.. వారి త్యాగాల వల్లే అధికారంలోకి వచ్చామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు.
- కార్యకర్తల కష్టం, త్యాగాల వల్లే అధికారంలోకి వచ్చాం
- రెండోసారి అధికారంలోకి రావడానికి సందీప్‌కుమార్‌తో చర్చిస్తున్నాం
- 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండాలన్న లక్ష్యంతో పని చేస్తాం
Uttam Kumar Reddy | త్రినేత్ర న్యూస్: పార్టీలో దీర్ఘకాలంగా కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందని.. వారి త్యాగాల వల్లే అధికారంలోకి వచ్చామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. రెండోసారి అధికారంలోకి రావడానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ సందీప్ కుమార్ తో చర్చిస్తున్నామని చెప్పారు. 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగేలా పని చేస్తామని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లోపు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని వివరించారు.
ఏడుసార్లు గెలిచిన అనుభవముంది
కాంగ్రెస్ కార్యకర్తల కష్టం, త్యాగాల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పదేళ్ల టీడీపీ, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ కోసం కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలి. మూడేళ్ల కాంగ్రెస్ పాలన విజయవంతంగా కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఒకే నియోజకవర్గం నుంచి ఒకే పార్టీ తరఫున వరుసగా ఏడుసార్లు గెలిచిన అనుభవం నాకు ఉంది.
తెలంగాణ ప్రజలు, రైతాంగానికి మేలు జరిగేలా నిరంతరం పనిచేస్తున్నాం. సాగునీటి రంగం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా, గోదావరి జలాల వినియోగం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అత్యధిక వ్యవసాయ విస్తీర్ణం నమోదైంది. అత్యధిక వరి ఉత్పత్తి, ధాన్యం సేకరణ కూడా మా ప్రభుత్వంలోనే జరిగింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సాగునీటి ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టింది. పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎస్ఎల్‌బీసీ, డిండి తదితర ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. ఎన్నికల్లోపు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేలా కార్యాచరణ పెట్టుకున్నాం. పేదలకు నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అందించాం. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నాం. గాంధీభవన్‌తో నాకు భావోద్వేగ అనుబంధం ఉంది అని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Vishnu Manchu | బర్త్‌డే సర్ప్రైజ్ - కొత్త సినిమాను అనౌన్స్‌చేసిన మంచు విష్ణు - డైరెక్టర్‌గా పాపులర్ కొరియోగ్రాఫర్
- ●Asia Power Index | ఆసియాలో మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్.. 2026 ఆసియా పవర్ ఇండెక్స్‌లో 40.5 పాయింట్లతో సత్తా
- ●Godavari Pushkaralu Logo Design and Tagline | గోదావరి పుష్కరాల లోగో డిజైన్, ట్యాగ్ లైన్ పంపండి.. నగదు బహుమతులు గెలుచుకోండి
- ●Bullion Market | ఐదురోజుల నష్టాలకు బ్రేక్.. మళ్లీ పుంజుకున్న పసిడి, వెండి..!
- ●Komatireddy Venkat Reddy | నా ప్లాన్ ప్రకారం పోతే 100 సీట్లకు పైగా గెలుస్తం
- ●CM Yogi Adityanath | సన్యాసిగా తల్లివద్ద భిక్షాటన.. భావోద్వేగానికి గురైన సీఎం యోగి

Vishnu Manchu | బర్త్‌డే సర్ప్రైజ్ - కొత్త సినిమాను అనౌన్స్‌చేసిన మంచు విష్ణు - డైరెక్టర్‌గా పాపులర్ కొరియోగ్రాఫర్

Asia Power Index | ఆసియాలో మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్.. 2026 ఆసియా పవర్ ఇండెక్స్‌లో 40.5 పాయింట్లతో సత్తా

Godavari Pushkaralu Logo Design and Tagline | గోదావరి పుష్కరాల లోగో డిజైన్, ట్యాగ్ లైన్ పంపండి.. నగదు బహుమతులు గెలుచుకోండి

Bullion Market | ఐదురోజుల నష్టాలకు బ్రేక్.. మళ్లీ పుంజుకున్న పసిడి, వెండి..!





