Indian LPG Tanker | 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో.. హర్మూజ్‌ను దాటిన భారత నౌక
Indian LPG Tanker | గ్రీన్ సాన్వి (Green Sanvi) అనే భారతీయ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ట్యాంకర్ (Indian LPG Tanker) హర్మూజ్‌ను సురక్షితంగా దాటి భారత్‌వైపు వస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి వ్యూహాత్మక జలసంధిని విజయవంతంగా దాటిన ఏడో భారతీయ నౌకగా గ్రీన్ సాల్వి నిలిచింది.
Indian LPG Tanker | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా దేశంలో ఇంధన సరఫరాపై తీవ్ర ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనల వేళ భారత్‌కు చెందిన నౌకలు సురక్షితంగా హర్మూజ్ జలసంధిని (Strait Of Hormuz) దాటుతుండటం ఊరట కలిగిస్తోంది. తాజాగా గ్రీన్ సాన్వి (Green Sanvi) అనే భారతీయ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ట్యాంకర్ (Indian LPG Tanker) హర్మూజ్‌ను సురక్షితంగా దాటి భారత్‌వైపు వస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి వ్యూహాత్మక జలసంధిని విజయవంతంగా దాటిన ఏడో భారతీయ నౌకగా గ్రీన్ సాల్వి నిలిచింది.
గ్రీన్ సాల్వి ఏకంగా 46,000 మెట్రిక్ టన్నులకుపైగా ఎల్పీజీని తీసుకొస్తోంది. ఇది మరో రెండు భారత ఎల్పీజీ నౌకలకు నాయకత్వం వహిస్తూ ఒక కాన్వాయ్‌గా వస్తోంది. ఈ నౌకలు ఇరాన్ నియంత్రణలోని ఉత్తర మార్గానికి బదులుగా.. ఒమన్ తీరానికి దగ్గరగా ఉన్న సురక్షితమైన దక్షిణ మార్గంలో ప్రయాణిస్తున్నాయి. అధికారుల సమాచారం ప్రకారం.. రాబోయే రోజుల్లో గ్రీన్ ఆశా (Green Asha), జగ్ విక్రమ్ (Jag Vikram) అనే మరో రెండు భారతీయ ఎల్పీజీ ట్యాంకర్లు కూడా త్వరలో భారత్‌కు చేరుకోనున్నాయి.
కాగా, ఫిబ్రవరి 28న మొదలైన ఈ యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. వెంటనే రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం ఇరాన్ అధికారులతో విస్తృతంగా చర్చలు జరిపింది. భారత్ దౌత్యం ఫలించింది. న్యూఢిల్లీ, టెహ్రాన్ మధ్య జరిగిన చర్చల ఫలితంగా భారత్‌ను 'మిత్ర దేశం'గా పరిగణిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే హర్మూజ్‌లో మన దేశ నౌకలను సురక్షిత ప్రయాణానికి ఐఆర్‌జీసీ అనుమతించి, సురక్షిత మార్గాన్ని కల్పిస్తోంది. ఇప్పటికే పలు నౌకలు భారత పోర్టులకు చేరకోగా.. మరికొన్ని గమ్యస్థానం వైపు దూసుకొస్తున్నాయి.
Also Read..
బీహార్ గ్యాంగ్‌ను తలపిస్తోన్న కాంగ్రెస్ నేతల తీరు : హరీశ్‌రావు
నాకు పార్టీ టికెట్ నిరాకరించలేదు.. నేనే పోటీ చేయడం లేదు : అన్నామలై
సంబంధిత వార్తలు

US Senate | ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్ దూకుడుకు అమెరికా సెనేట్ బ్రేక్
మే 20, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026

PM Modi | ఇది 12 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలన వైఫల్యానికి నిదర్శనం.. ప్రధాని పొదుపు సూచనలపై విపక్షాలు ఫైర్
మే 11, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



