CEC Gyanesh Kumar | సీఈసీపై సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి: ‘రాజీనామా చేసి అప్రూవర్‌గా మారు’.. జ్ఞానేష్ కుమార్‌కు రాహుల్ గాంధీ అల్టిమేటం
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాల్సిందేనని రాహుల్ డిమాండ్. కేంద్ర ప్రభుత్వంలోని 200 మంది అధికారులు తమతో టచ్‌లో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు.
- చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై, 'ఓట్ల చోరీ' ఆరోపణలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న ఇండియా కూటమి
- కన్నాట్ ప్లేస్ బారాఖంబా రోడ్డు నుంచి సుప్రీంకోర్టు వరకు 'మార్చ్ ఫర్ డెమోక్రసీ' పేరిట భారీ పాదయాత్ర
- "తప్పు నీది కాదు.. వెనుక ఉన్న శక్తులది, వెంటనే రాజీనామా చేసి అప్రూవర్‌గా మారు" అంటూ CECకి రాహుల్ గాంధీ వార్నింగ్
- మోదీ ప్రభుత్వానికి చెందిన 200 మంది ఉన్నతాధికారులు తమకు అంతర్గత సమాచారం ఇస్తున్నారంటూ రాహుల్ సంచలన ఆరోపణ
CEC Gyanesh Kumar | త్రినేత్ర న్యూస్ : దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రక్రియలో జరిగిన అక్రమాలు, ‘ఓట్ల చోరీ’పై ఇండియా కూటమి నేతలంతా కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు రాహుల్ ప్రకటించారు.
సోమవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన రాహుల్.. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై నిప్పులు చెరిగారు. "మీరు తప్పు చేశారు.. కానీ ఆ తప్పు వెనుక ఉన్న అసలు మైండ్ మీది కాదని తెలుసు. రాత్రిళ్లు మీరు నిద్రపోలేకపోతున్నారని మాకు సమాచారం ఉంది. వెంటనే పదవికి రాజీనామా చేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్రూవర్‌గా మారండి" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బారాఖంబా నుంచి సుప్రీంకోర్టు వరకు ‘మార్చ్ ఫర్ డెమోక్రసీ’
ఈ వివాదంపై ఇండియా కూటమి నేతలు ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ - బారాఖంబా జంక్షన్ వద్ద సమావేశమై, అక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం సీఈసీపై దేశ సర్వోన్నత న్యాయస్థానంలో అధికారికంగా పిటిషన్ దాఖలు చేయనున్నట్లు రాహుల్ వెల్లడించారు. ఇది ఏ ఒక్కరి వ్యక్తిగత పోరాటమో కాదని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు చేస్తున్న ఉద్యమమని స్పష్టం చేశారు. బీజేపీలో ఉన్నవారైనా రాజ్యాంగ పరిరక్షణ కోసం తమతో కలిసి నడవవచ్చని ఆహ్వానించారు.
'మాతో 200 మంది కేంద్ర అధికారులు టచ్‌లో ఉన్నారు'
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ మరో బాంబు పేల్చారు. కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న దాదాపు 200 మంది కీలక అధికారులు ప్రస్తుతం ప్రతిపక్షాలతో టచ్‌లో ఉన్నారని, ప్రభుత్వ అంతర్గత సమాచారాన్ని నిరంతరం అందిస్తున్నారని పేర్కొన్నారు.
పోలీస్, ITBP, CRPF బలగాల్లోని 50 శాతం సిబ్బంది తాము చేస్తున్న పోరాటం సరైనదేనని అంతర్గతంగా మద్దతు తెలుపుతున్నారని ఆయన అన్నారు. ప్రజలంతా ఒకవైపు ఉంటే.. రాజ్యాంగ వ్యవస్థలను హైజాక్ చేస్తున్న మోదీ, అమిత్ షా, అజిత్ దోవల్, జ్ఞానేష్ కుమార్ వంటి కొద్దిమంది మరోవైపు ఉన్నారని దుయ్యబట్టారు.
ఓటర్ల జాబితా సవరణపై ముదిరిన వివాదం
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితా రూపకల్పనలో సీఈసీ తీసుకున్న నిర్ణయాలపై తోటి ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి దాదాపు 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు మీడియాలో వచ్చిన కథనాలు పెను దుమారం రేపాయి. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళన జరిగే వరకు, యువత ఈ పోరాటాన్ని ఆపబోదని రాహుల్ స్పష్టం చేశారు.
మరోవైపు ఈ నిరసనల నేపథ్యంలో ఢిల్లీని పోలీసులు భారీ బారికేడ్లతో దిగ్బంధించారు. ఢిల్లీని జైలులా మార్చి తమ గొంతు నొక్కలేరని, ప్రభుత్వం ఎంత కఠిన ఆంక్షలు విధిస్తే సీఈసీని కాపాడుతోందన్న నిజం ప్రజలకు అంత స్పష్టంగా తెలుస్తుందని రాహుల్ పేర్కొన్నారు.
#WATCH | Delhi | Lok Sabha LoP Rahul Gandhi says, "I want to tell Narendra Modi that 200 officials of your government are in touch with us and informing us, including those in the ED, CBI, Foreign Ministry..." https://t.co/sneicBxHPN
— ANI (@ANI) October 12, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Hyderabad | ఆ సెక్యూరిటీ గార్డును ఉరి తీయండి..!
- ●PM-DDKY | ధన్ ధాన్య కృషి యోజనలో తెలంగాణ జిల్లాలకు జాతీయ గుర్తింపు
- ●Rajagopal Reddy | రేవంత్ వేల కోట్ల దోపిడీ చేస్తుండు.. రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తా
- ●Loan Repayment | వాహన లోన్‌ను ముందే చెల్లిస్తే లాభం ఉంటుందా.. పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది..?
- ●Allu Arjun | ఫొటోతో రూమర్లకు చెక్ - బన్నీ, లోకేష్ కనగరాజ్ మూవీ నుంచి బ్లాస్టింగ్ అప్డేట్
- ●Gaddam Prasad | తెలంగాణ–హిరోషిమా మధ్య సహకారం పెరగాలి

Hyderabad | ఆ సెక్యూరిటీ గార్డును ఉరి తీయండి..!

PM-DDKY | ధన్ ధాన్య కృషి యోజనలో తెలంగాణ జిల్లాలకు జాతీయ గుర్తింపు

Rajagopal Reddy | రేవంత్ వేల కోట్ల దోపిడీ చేస్తుండు.. రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తా

Loan Repayment | వాహన లోన్‌ను ముందే చెల్లిస్తే లాభం ఉంటుందా.. పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది..?






