INDIA bloc march | ఇండీ కూటమి మెగా మార్చ్.. ఓపెన్ టాప్ వాహనంలో ప్రయాణించిన నేతలు
INDIA bloc march | ఢిల్లీలో ప్రతిపక్ష ఇండీ కూటమి తలపెట్టిన మెగా ర్యాలీ (INDIA bloc march) ప్రారంభమైంది. కాంగ్రెస్ అగ్రేనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, టీఎంసీ అధినేత్ర మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సహా పలువురు కూటమి పార్టీల నేతలంతా కలిసి ఓపెన్ టాప్ వాహనంలో ఖర్గే నివాసం నుంచి మింటో రోడ్డుకు వెళ్లారు.
INDIA bloc march | త్రినేత్ర న్యూస్ : ఢిల్లీలో ప్రతిపక్ష ఇండీ కూటమి తలపెట్టిన మెగా ర్యాలీ (INDIA bloc march) ప్రారంభమైంది. ఢిల్లీలోని మింటో రోడ్-కన్నాట్ ప్లేస్ జంక్షన్ (Connaught Place junction) నుంచి ప్రతిపక్షాలు ఓట్ బచావో.. దేశ్ బచావో మెగా ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలు తమ ఐక్యతను చాటుకున్నారు. కాంగ్రెస్ అగ్రేనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, టీఎంసీ అధినేత్ర మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సహా పలువురు కూటమి పార్టీల నేతలంతా కలిసి ఓపెన్ టాప్ వాహనంలో ఖర్గే నివాసం నుంచి మింటో రోడ్డుకు వెళ్లారు. అక్కడి నుంచి ప్రధాన నిరసన స్థలి రామ్‌లీలా మైదాన్ (Ramlila Maidan)కు ర్యాలీగా బయల్దేరారు. మరికాసేపట్లో అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ఇప్పటికే దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది మద్దతుదారులు రామ్‌లీలా మైదాన్‌కు చేరుకున్నారు. ఈ నిరసన కోసం వివిధ రాష్ట్రాల నుంచి ప్రతిపక్ష పార్టీల శ్రేణులు శనివారమే రాజధానికి చేరుకున్నారు. కొందరు మద్దతుదారులు ఆదివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇండీ కూటమి మద్దతుదారులు, కార్యకర్తలు, యువజన, విద్యార్థి సంఘాల సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
VIDEO | Visuals from Ramlila Maidan where the supporters have gathered in large numbers for INDIA bloc's 'Vote Bachao, Desh Bachao' rally.
#ChaloDilli #VoteBachaoDeshBachao https://t.co/4OTOqz0nYF
— Press Trust of India (@PTI_News) November 1, 2026
నిరసనలతోపాటూ స్థానికంగా షాపింగ్ చేయండి
ఇదిలా ఉండగా.. ఈ నిరసనలకు భారీ స్థాయిలో హాజరుకావాలని రాహుల్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వ్యాపారులకు అండగా నిలవాలని సూచించారు. నిరసనలు, ప్రదర్శనలు, ర్యాలీలో పాల్గొనడంతోపాటూ దీపావళి, ఛత్‌పూజ, దంతేరాస్ పండుగలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీకి వస్తున్న నిరసనకారులు స్థానిక వ్యాపారుల వద్ద షాపింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాల మెగా నిరసనలు వ్యాపారాలకు ఎలాంటి భంగం కలిగించదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీజేపీపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నట్ ప్లేస్ ప్రాంతంలో షాపులను బీజేపీనే బలవంతంగా మూయించిందని ఆరోపించారు. వ్యాపారాలకు ఎవరు నష్టం కలిగిస్తున్నారో తెలుసుకోవాలని వ్యాపారులకు సూచించారు.
Leader of Opposition in Lok Sabha and Congress leader Rahul Gandhi (@RahulGandhi) posts on X, "हमने सब लोगों से कहा कि जब आप मार्च और महारैली के लिए यहां आएंगे, चीजें खरीदें, खरीदारी करें। मगर, यहां Connaught Place में आते हुए हमें पता लगा कि BJP ने सारी की सारी दुकानें जबरदस्ती बंद करवा दी। तो traders का नुकसान कौन कर रहा है, कैसे हो रहा है, यह आप जान लीजिए!"
(Source: Rahul Gandhi's X handle)
— Press Trust of India (@PTI_News) November 1, 2026
Also Read..
ఆన్‌లైన్‌లో తాళాలు పగలగొట్టేది నేర్చుకుని.. ఇళ్లలో చోరీలు.. మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు
సైబరాబాద్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్.. 205 మందిపై కేసులు నమోదు
10 నిమిషాల్లో ఇరాన్ అణు స్థావరాలను నాశనం చేస్తాం : ట్రంప్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CM Revanth Reddy Delhi Tour | రావణుడు లాంటి మోదీని గద్దె దించేందుకు ఢిల్లీకి వచ్చిన తెలంగాణ వానర సైన్యం
నవంబర్ 1, 2026

INDIA Bloc Vs BJP | ఢిల్లీలో రాజకీయ వేడి.. బీజేపీ, ఇండీ కూటమి పోటాపోటీ ర్యాలీలు.. రాజధానిలో 10 వేల మంది పోలీసులు మోహరింపు
నవంబర్ 1, 2026

INDIA bloc vs BJP Rohtak March | ఢిల్లీలో స్ట్రీట్ ఫైట్.. ఒకే రోజు ఇండియా కూటమి, బీజేపీ మెగా మార్చ్‌లు
అక్టోబర్ 31, 2026
తాజావార్తలు
- ●Sobhita Dhulipala | సంక్రాంతి రేసులో అక్కినేని కోడలి తమిళ మూవీ - టాలీవుడ్ హీరోలతో పోటీ...
- ●Uppal police | ఆన్‌లైన్‌లో తాళాలు పగలగొట్టేది నేర్చుకుని.. ఇళ్లలో చోరీలు.. మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు
- ●CM Revanth Reddy Delhi Tour | రావణుడు లాంటి మోదీని గద్దె దించేందుకు ఢిల్లీకి వచ్చిన తెలంగాణ వానర సైన్యం
- ●Kavitha | ఓబీసీ, ఆదివాసీల జనగణనపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి
- ●Ram Charan | చిరంజీవి క్లాప్‌తో రామ్‌చరణ్, సుకుమార్ మూవీ షురూ
- ●Danasari Seethakka | బలమైన గ్రామాలే బలమైన తెలంగాణకు పునాది: మంత్రి సీతక్క

Sobhita Dhulipala | సంక్రాంతి రేసులో అక్కినేని కోడలి తమిళ మూవీ - టాలీవుడ్ హీరోలతో పోటీ...

Uppal police | ఆన్‌లైన్‌లో తాళాలు పగలగొట్టేది నేర్చుకుని.. ఇళ్లలో చోరీలు.. మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు

CM Revanth Reddy Delhi Tour | రావణుడు లాంటి మోదీని గద్దె దించేందుకు ఢిల్లీకి వచ్చిన తెలంగాణ వానర సైన్యం

Kavitha | ఓబీసీ, ఆదివాసీల జనగణనపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి



