Ram Charan | చిరంజీవి క్లాప్‌తో రామ్‌చరణ్, సుకుమార్ మూవీ షురూ
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న కొత్త మూవీ ఆదివారం హైదరాబాద్‌లో లాంఛ్ అయ్యింది. ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామ్‌చరణ్‌ఫై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు.
Entertainment | Published On Nov 1, 2026, 1.24 pm IST
Ram Charan | రంగస్థలం సినిమాతో రామ్‌చరణ్‌కు (Ram Charan) పెద్ద హిట్టిచ్చారు దర్శకుడు సుకుమార్. ఈ బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ కొత్త మూవీ ఆదివారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. రామ్‌చరణ్‌పై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి ఆయన క్లాప్ కొట్టారు.
స్పెషల్ అట్రాక్షన్...
రామ్‌చరణ్, సుకుమార్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ మూవీ ఓపెనింగ్ ఈవెంట్‌కు రామ్‌చరణ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. స్టైలిష్ లుక్‌లో అటెండ్ అయ్యారు. ఈ వేడుకలో పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుసానా, టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌తో పాటు పలువురు టాలీవుడ్ సెలిబ్రిటీలు పాల్గొన్నారు. రంగస్థలం సినిమాకు భిన్నంగా మోడ్రన్ కథతో స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నట్లు సమాచారం. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతున్నట్లు తెలిసింది.
డోరతీ ఫేమ్...
రామ్‌చరణ్ హీరోగా నటిస్తోన్న 17వ సినిమా ఇది. ఇందులో డోరతీ ఫేమ్ రిషికాంత్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఓపెనింగ్ అవెంట్‌కు అతడు అటెండ్ అయ్యాడు. ఆర్‌సీ 17లో సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటిస్తోన్నట్లు వార్తలొస్తున్నాయి. పుష్ప, పుష్ప 2 తర్వాత సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ పాన్ ఇండియన్ లెవెల్‌లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది.
The journey of #RC17 begins with the MEGA CLAP ❤️
Megastar @KChiruTweets garu sounded the clapboard and blessed the entire team of #RC17 ✨
#YouCanImagine #RC2Sukku
#SRCMega Power Star @AlwaysRamCharan Master Storyteller @aryasukku @MythriOfficial @SukumarWritings #TSeriesFilms @RC17Offl
— Mythri Movie Makers (@MythriOfficial) November 1, 2026

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Regina Cassandra | రెజీనా అనూహ్య నిర్ణయం.. ఎన్జీవోకు గుడ్‌బై..!
అక్టోబర్ 31, 2026

Jailer 2 Collections | 800 కోట్లకు చేరువలో జైలర్ 2 – తెలుగులో రజనీకాంత్ సినిమాకు భారీ లాభాలు
అక్టోబర్ 31, 2026

Bigg Boss Thrigun | రా అండ్ రస్టిక్ లుక్‌లో బిగ్‌బాస్ కంటెస్టెంట్ – “జంగా” ఫస్ట్‌లుక్ రిలీజ్
అక్టోబర్ 31, 2026
తాజావార్తలు
- ●Danasari Seethakka | బలమైన గ్రామాలే బలమైన తెలంగాణకు పునాది: మంత్రి సీతక్క
- ●Drunk And Drive | సైబరాబాద్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్.. 205 మందిపై కేసులు నమోదు
- ●CM Revanth Reddy | నీటి సంరక్షణను బాధ్యతగా స్వీకరించాలి
- ●Donald Trump | 10 నిమిషాల్లో ఇరాన్ అణు స్థావరాలను నాశనం చేస్తాం : ట్రంప్
- ●INDIA Bloc Vs BJP | ఢిల్లీలో రాజకీయ వేడి.. బీజేపీ, ఇండీ కూటమి పోటాపోటీ ర్యాలీలు.. రాజధానిలో 10 వేల మంది పోలీసులు మోహరింపు
- ●Nepal | నేపాల్‌లో భారీ హిమపాతం.. ఆరుగురు భారతీయ పర్యాటకులు గల్లంతు

Danasari Seethakka | బలమైన గ్రామాలే బలమైన తెలంగాణకు పునాది: మంత్రి సీతక్క

Drunk And Drive | సైబరాబాద్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్.. 205 మందిపై కేసులు నమోదు

CM Revanth Reddy | నీటి సంరక్షణను బాధ్యతగా స్వీకరించాలి

Donald Trump | 10 నిమిషాల్లో ఇరాన్ అణు స్థావరాలను నాశనం చేస్తాం : ట్రంప్



