Uppal police | ఆన్‌లైన్‌లో తాళాలు పగలగొట్టేది నేర్చుకుని.. ఇళ్లలో చోరీలు.. మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు
Uppal police | హైదరాబాద్ (Hyderabad) నగరంలో తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న మహిళను ఉప్పల్ పోలీసులు (Uppal police) అరెస్ట్ చేశారు.
Uppal police | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్ (Hyderabad) నగరంలో తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా (woman targeting locked houses) చేసుకొని చోరీలకు పాల్పడుతున్న మహిళను ఉప్పల్ పోలీసులు (Uppal police) అరెస్ట్ చేశారు. నిందితురాలి నుంచి రూ.లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, వెండి, నగదుతో పాటు చోరీ సొత్తుతో కొనుగోలు చేసిన ఒక ఐఫోన్ 17ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన 25 ఏళ్ల పాగ జయ (Paga Jaya).. ఆర్థిక ఇబ్బందుల వల్ల బీటెక్ మొదటి సంవత్సరంలోనే చదువు ఆపేసింది. 2023లో హైదరాబాద్‌కు వచ్చిన ఆమె ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. విలాసవంతమైన జీవితానికి (Lavish Lifestyle) అలవాటుపడిన జయ.. బర్తకు తెలియకుండా ఆన్‌లైన్ వేదికగా తాళాలు ఎలా పగలగొట్టాలో నేర్చుకుంది. పగటి పూట కాలనీళ్లలో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించేది. అలా రాత్రి పూట ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు బుర్ఖా ధరించి చోరీలకు పాల్పడేది. అంతేకాదు పోలీసులకు ఆధారాలు దొరకుండా ఉండేందుకు చేతులకు గ్లౌజ్‌లు వేసుకునేది.
ఇటీవలే ఉప్పల్ పరిధిలో తాళం వేసిన ఇంటి తాళాలు పగలగొడుతూ సీసీకెమెరాకు చిక్కింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాలు సేకరించి నిందితురాలిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఆమె నుంచి భారీగా బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండి, కొంత నగదు, ఐఫోన్ 17ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వస్తువుల విలువ రూ.70 లక్షలకు పైనే ఉంటుందని పోలీసులు తెలిపారు. ఐదు ఇళ్లలో ఆమె భారీ చోరీకి పాల్పడినట్లు పేర్కొన్నారు.
Also Read..
సైబరాబాద్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్.. 205 మందిపై కేసులు నమోదు
10 నిమిషాల్లో ఇరాన్ అణు స్థావరాలను నాశనం చేస్తాం : ట్రంప్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | నీటి సంరక్షణను బాధ్యతగా స్వీకరించాలి
నవంబర్ 1, 2026

Rohitha Organ Donation Hyderabad | తనువు చాలించినా అమరత్వం: ఆరుగురికి ప్రాణదానం చేసిన 13 ఏళ్ల రోహిత.. సీపీ సజ్జనార్ భావోద్వేగం
అక్టోబర్ 31, 2026

Nashik Trimbakeshwar Simhastha Kumbh Mela 2027 | త్రయంబకేశ్వర్‌లో సింహస్థ కుంభమేళా 2027 ప్రారంభం: పవిత్ర ధర్మధ్వజ ఆవిష్కరణ.. ఆ చిహ్నాల పరమార్థమిదే!
అక్టోబర్ 31, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy Delhi Tour | రావణుడు లాంటి మోదీని గద్దె దించేందుకు ఢిల్లీకి వచ్చిన తెలంగాణ వానర సైన్యం
- ●Kavitha | ఓబీసీ, ఆదివాసీల జనగణనపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి
- ●Ram Charan | చిరంజీవి క్లాప్‌తో రామ్‌చరణ్, సుకుమార్ మూవీ షురూ
- ●Danasari Seethakka | బలమైన గ్రామాలే బలమైన తెలంగాణకు పునాది: మంత్రి సీతక్క
- ●Drunk And Drive | సైబరాబాద్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్.. 205 మందిపై కేసులు నమోదు
- ●CM Revanth Reddy | నీటి సంరక్షణను బాధ్యతగా స్వీకరించాలి

CM Revanth Reddy Delhi Tour | రావణుడు లాంటి మోదీని గద్దె దించేందుకు ఢిల్లీకి వచ్చిన తెలంగాణ వానర సైన్యం

Kavitha | ఓబీసీ, ఆదివాసీల జనగణనపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి

Ram Charan | చిరంజీవి క్లాప్‌తో రామ్‌చరణ్, సుకుమార్ మూవీ షురూ

Danasari Seethakka | బలమైన గ్రామాలే బలమైన తెలంగాణకు పునాది: మంత్రి సీతక్క



