Danasari Seethakka | బలమైన గ్రామాలే బలమైన తెలంగాణకు పునాది: మంత్రి సీతక్క
Danasari Seethakka | బలమైన గ్రామాలే బలమైన తెలంగాణకు పునాది అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోందని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ప్రతి గ్రామ పంచాయతీకి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (GPSAP–2026) తీసుకొస్తున్నట్లు తన ట్వీట్‌లో వెల్లడించారు.
Danasari Seethakka | బలమైన గ్రామాలే బలమైన తెలంగాణకు పునాది అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోందని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ప్రతి గ్రామ పంచాయతీకి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (GPSAP–2026) తీసుకొస్తున్నట్లు ట్వీట్‌లో వెల్లడించారు. ఈ ప్రణాళిక కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాదని, గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి సంబంధించిన జనాభా, జీవనోపాధి, గృహ వసతి, పశుసంపద, ప్రభుత్వ పథకాల వివరాలతో సమగ్ర సమాచారాన్ని సేకరించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు.
ప్రతి గ్రామానికి మూడేళ్ల నుంచి ఐదేళ్ల దీర్ఘకాలిక ప్రణాళికతో పాటు వార్షిక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయంతో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు ప్రతి గ్రామానికి ప్రత్యేక వెబ్‌సైట్, డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేయనున్నారు. గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రతి నెలా అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించనున్నారు. 2047 నాటికి తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలన్న 'తెలంగాణ రైజింగ్–2047' లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సీతక్క పేర్కొన్నారు. అభివృద్ధి ఫలాలు మారుమూల గ్రామాల్లోని చివరి వ్యక్తికి సైతం చేరేలా పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రణాళికను అమలు చేయనున్నట్లు తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Drunk And Drive | సైబరాబాద్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్.. 205 మందిపై కేసులు నమోదు
- ●CM Revanth Reddy | నీటి సంరక్షణను బాధ్యతగా స్వీకరించాలి
- ●Donald Trump | 10 నిమిషాల్లో ఇరాన్ అణు స్థావరాలను నాశనం చేస్తాం : ట్రంప్
- ●INDIA Bloc Vs BJP | ఢిల్లీలో రాజకీయ వేడి.. బీజేపీ, ఇండీ కూటమి పోటాపోటీ ర్యాలీలు.. రాజధానిలో 10 వేల మంది పోలీసులు మోహరింపు
- ●Nepal | నేపాల్‌లో భారీ హిమపాతం.. ఆరుగురు భారతీయ పర్యాటకులు గల్లంతు
- ●Gas Cylinder Price | దీపావళి పండుగ వేళ షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

Drunk And Drive | సైబరాబాద్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్.. 205 మందిపై కేసులు నమోదు

CM Revanth Reddy | నీటి సంరక్షణను బాధ్యతగా స్వీకరించాలి

Donald Trump | 10 నిమిషాల్లో ఇరాన్ అణు స్థావరాలను నాశనం చేస్తాం : ట్రంప్

INDIA Bloc Vs BJP | ఢిల్లీలో రాజకీయ వేడి.. బీజేపీ, ఇండీ కూటమి పోటాపోటీ ర్యాలీలు.. రాజధానిలో 10 వేల మంది పోలీసులు మోహరింపు





