INDIA Bloc Vs BJP | ఢిల్లీలో రాజకీయ వేడి.. బీజేపీ, ఇండీ కూటమి పోటాపోటీ ర్యాలీలు.. రాజధానిలో 10 వేల మంది పోలీసులు మోహరింపు
INDIA Bloc Vs BJP | ఓవైపు ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండీ కూటమి ఇవాళ రామ్‌లీలా మైదాన్ ( Ramlila Maidan)లో భారీ నిరసనకు పిలుపునివ్వగా.. మరోవైపు పశ్చిమ ఢిల్లీలో బీజేపీ 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లపై (1984 anti-Sikh riots) నిరసనకు సిద్ధమవుతోంది. దీంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సుమారు 10,000 మంది పోలీసు సిబ్బందిని సెంట్రల్, న్యూఢిల్లీ ప్రాంతాల్లో మోహరించారు.
INDIA Bloc Vs BJP | త్రినేత్ర న్యూస్ : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా రాజకీయాలు వేడెక్కాయి (INDIA Bloc Vs BJP). ఓవైపు ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండీ కూటమి ఇవాళ రామ్‌లీలా మైదాన్ ( Ramlila Maidan)లో భారీ నిరసనకు పిలుపునివ్వగా.. మరోవైపు పశ్చిమ ఢిల్లీలో బీజేపీ 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లపై (1984 anti-Sikh riots) నిరసనకు సిద్ధమవుతోంది. దీంతో ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఈ రెండు మార్చ్‌లను దృష్టిలో పెట్టుకుని పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ పోలీసులతో పాటు కేంద్ర సాయుధ బలగాలు (CAPF), CRPF, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సహా సుమారు 10,000 మంది పోలీసు సిబ్బందిని సెంట్రల్, న్యూఢిల్లీ ప్రాంతాల్లో మోహరించారు. రామ్‌లీలా మైదాన్, మింటో బ్రిడ్జ్ నుంచి ర్యాలీ మార్గం, చుట్టుపక్కల ప్రాంతాల్లో 4,000 మందికి పైగా సిబ్బందిని బందోబస్తు కోసం నియమించారు.
అదేవిధంగా కన్నాట్ ప్లేస్, జంతర్ మంతర్, భగవాన్ దాస్ రోడ్డు, సుప్రీంకోర్టు, భారత ఎన్నికల సంఘం కార్యాలయం సమీపంలోని ప్రాంతాల్లోనూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల్లో బహుళ అంచెల బారికేడింగ్‌లను కూడా ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ట్రాఫిక్‌పై పలు ఆంక్షలు విధించారు. ఈ ప్రాంతంలో మొత్తం 200 నుంచి 250 వరకూ సీసీకెమెరాలను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
12 గంటలకు ఇండీ కూటమి మార్చ్
ఉదయం 11 గంటలకు కాన్‌స్టిట్యూషన్ క్లబ్ వద్ద సమావేశం కానున్న ఇండీ కూటమి ఎంపీలు మధ్యాహ్నం 12 గంటలకు సెంట్రల్ ఢిల్లీలోని మింటో రోడ్-కన్నాట్ ప్లేస్ జంక్షన్ నుంచి మార్చ్‌ను ప్రారంభించనున్నారు. ఈ మెగా ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా కూటమి మిత్ర పక్షాల పార్టీ నేతలు మమతా బెనర్జీ, హేమంత్ సోరెన్, రేవంత్ రెడ్డి, తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్ తదితర అగ్రనేతలు పాల్గొనే అవకాశం ఉంది. అయితే, రామ్‌లీలా మైదాన్‌లో నిరసనలకు అనుమతించిన ఢిల్లీ పోలీసులు.. మింటో రోడ్-కన్నాట్ ప్లేస్ జంక్షన్ నుంచి మార్చ్‌కు మాత్రం అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. దీంతో ఈ మెగా ర్యాలీపై ఉత్కంఠ నెలకొంది.
ఇండీ కూటమి ర్యాలీకి సీజేపీ దూరం
ఇక ప్రతిపక్షాల ఆందోళనలకు కాక్రోచ్ జనతా పార్టీ దూరంగా ఉంది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే నిన్న ఢిల్లీలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని కలిశారు. యువత చేపట్టిన నిరసనలకు మద్దతు తెలిపినందుకు దీదీకి కృతజ్ఞతలు తెలిపారు. తాము తమ స్వతంత్ర గుర్తింపును కొనసాగిస్తామని.. అందుకే ఆదివారం విపక్షాలు నిర్వహించే నిరసనల్లో పాల్గొనబోమని స్పష్టం చేశారు.
1984 అల్లర్ల బాధితులకు నివాళిగా బీజేపీ మార్చ్
మరోవైపు 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులకు సంఘీభావంగా, హింసాకాండలో మరణించిన వారికి నివాళిగా భారతీయ జనతా పార్టీ నేడు మార్చ్ నిర్వహించనుంది. ఉదయం 11:30 గంటలకు హరినగర్ బస్ డిపో నుంచి ప్రారంభమయ్యే బీజేపీ మార్చ్ తిలక్ నగర్ మెట్రో స్టేషన్ వరకూ సాగనుంది. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, పలువురు ఢిల్లీ మంత్రులు, బీజేపీ నేతలు పాల్గొనే అవకాశం ఉంది. 1984 అల్లర్లలో మరణించిన వారి కుటుంబ సభ్యులు కూడా ఈ నిరసనలో పాల్గొననున్నారు.
Also Read..
నేపాల్‌లో భారీ హిమపాతం.. ఆరుగురు భారతీయ పర్యాటకులు గల్లంతు
దీపావళి పండుగ వేళ షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
నవంబర్‌లో సూర్యుడి సంచారం.. 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుందంటే!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

INDIA bloc vs BJP Rohtak March | ఢిల్లీలో స్ట్రీట్ ఫైట్.. ఒకే రోజు ఇండియా కూటమి, బీజేపీ మెగా మార్చ్‌లు
అక్టోబర్ 31, 2026

Gold Rate | బంగారం కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్.. ఒకే రోజు రూ.3200 డౌన్.. అదే బాటలో వెండి
అక్టోబర్ 31, 2026

INDIA Bloc Public Impeachment | సీఈసీపై ఇండియా కూటమి ‘ప్రజా అభిశంసన’: 13.2 కోట్ల ఓట్ల తొలగింపు సహా 6 తీవ్ర ఆరోపణలు చేసిన ఖర్గే!
అక్టోబర్ 31, 2026
తాజావార్తలు
- ●Nepal | నేపాల్‌లో భారీ హిమపాతం.. ఆరుగురు భారతీయ పర్యాటకులు గల్లంతు
- ●Gas Cylinder Price | దీపావళి పండుగ వేళ షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- ●Vikarabad | ఇద్దరు పిల్లలకు ఉరివేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి..
- ●November Horoscope 2026 | నవంబర్‌లో సూర్యుడి సంచారం.. 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుందంటే!
- ●Municipal Elections | ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్
- ●Warren Buffett | 48 ఏండ్లుగా ఒక్క గ్లాస్ మంచి నీళ్లు ముట్టని వారెన్ బఫెట్

Nepal | నేపాల్‌లో భారీ హిమపాతం.. ఆరుగురు భారతీయ పర్యాటకులు గల్లంతు

Gas Cylinder Price | దీపావళి పండుగ వేళ షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

Vikarabad | ఇద్దరు పిల్లలకు ఉరివేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి..

November Horoscope 2026 | నవంబర్‌లో సూర్యుడి సంచారం.. 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుందంటే!



