త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sobhita Dhulipala | సంక్రాంతి రేసులో అక్కినేని కోడ‌లి త‌మిళ మూవీ – టాలీవుడ్ హీరోల‌తో పోటీ…

వ‌చ్చే సంక్రాంతికి టాలీవుడ్ స్టార్ హీరోల‌తో పోటీ ప‌డ‌బోతుంది అక్కినేని కోడ‌లు శోభిత ధూళిపాళ‌. ఆమె హీరోయిన్‌గా త‌మిళంలో వెట్టువ‌మ్ పేరుతో ఓ పీరియాడిక‌ల్ స్పోర్ట్స్ థ్రిల్ల‌ర్ మూవీ రూపొందుతోంది. పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీని సంక్రాంతికి థియేట‌ర్ల‌లోకి తీసుకురాబోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

N

Entertainment | Published On Nov 1, 2026, 2.03 pm IST

Sobhita Dhulipala | సంక్రాంతి రేసులో అక్కినేని కోడ‌లి త‌మిళ మూవీ – టాలీవుడ్ హీరోల‌తో పోటీ…
Advertisement

Sobhita Dhulipala |  వ‌చ్చే ఏడాది సంక్రాంతి పోరు అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. చిరంజీవి కాకా, వెంక‌టేష్‌, క‌ళ్యాణ్ రామ్ జ‌న‌వ‌రి 12 విడుద‌లతో పాటు సంబ‌రాల ఏటిగ‌ట్టు, మ‌హాకాళి, జార్జ్ క్రిష్ థియేట‌ర్ల‌లోకి రాబోతున్నాయి. తాజాగా సంక్రాంతి రేసులోకి మ‌రో మూవీ వ‌చ్చింది. టాలీవుడ్ హీరోల‌తో అక్కినేని కోడ‌లు పోటీప‌డ‌బోతుంది. అది కూడా త‌మిళ సినిమాతో...

పా రంజిత్ డైరెక్ట‌ర్‌...

శోభిత దూళిపాళ ప్ర‌ధాన పాత్ర‌లో త‌మిళంలో వెట్టువ‌మ్ పేరుతో పీరియాడిక‌ల్ స్పోర్ట్స్ యాక్ష‌న్ మూవీ తెర‌కెక్కుతోంది. పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో ఆర్య‌, దినేష్, క‌లైయ‌రాస‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

డిసెంబ‌ర్ అనుకొని...

వెట్టువ‌మ్ షూటింగ్ పూర్త‌య్యింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. సంక్రాంతికి థియేట‌ర్ల‌లోకి తీసుకురాబోతున్న‌ట్లు వెల్ల‌డించారు. డిసెంబ‌ర్‌లోనే విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు డిలే కావ‌డంతో విడుద‌ల తేదీ సంక్రాంతికి మారిన‌ట్లు స‌మాచారం.

నెగెటివ్ రోల్‌లో...

వెట్టువ‌మ్‌లో యాక్ష‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో శోభిత ధూళిపాళ క‌నిపించ‌బోతుంది. ఈ సినిమా కోసం ప్రాచీణ యుద్ద క‌ళ‌ల్లో ట్రైనింగ్ తీసుకుంది శోభిత ధూళిపాళ‌. ఈ త‌మిళ మూవీలో అక్కినేని కోడ‌లు నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దాదాపు 75 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న వెట్టువ‌మ్ త‌మిళంతో పాటు తెలుగులో రిలీజ్ కాబోతుంది. ఈ పీరియాడిక‌ల్ మూవీకి జీవీ ప్ర‌కాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు.

 

ట్యాగ్స్:

Director Pa RanjithKollywoodSankranthi 2027 MoviesSobhita DhulipalaSobhita Dhulipala Tamil CinemaTamil Movie VettuvamTollywoodVettuvam Release Date
Advertisement
Advertisement