త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | ఓబీసీ, ఆదివాసీల జనగణనపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వ‌హించాలి

Kavitha | జనగణనలో ఓబీసీల కులాల నమోదుకు ప్రత్యేక కాలమ్‌తో పాటు ఆదివాసీల మతాన్ని ప్రత్యేకంగా నమోదు చేసే అవకాశం కల్పించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి తీర్మానాలు పంపేందుకు రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆదివారం సీఎంకు ఆమె లేఖ రాశారు.

P

Telangana | Published On Nov 1, 2026, 1.30 pm IST

Kavitha | ఓబీసీ, ఆదివాసీల జనగణనపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వ‌హించాలి
Advertisement
  • తెలంగాణ ర‌క్ష‌ణ సేన అధ్య‌క్షురాలు క‌విత‌
  • ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ‌

Kavitha | జనగణనలో ఓబీసీల కులాల నమోదుకు ప్రత్యేక కాలమ్‌తో పాటు ఆదివాసీల మతాన్ని ప్రత్యేకంగా నమోదు చేసే అవకాశం కల్పించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి తీర్మానాలు పంపేందుకు రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆదివారం సీఎంకు ఆమె లేఖ రాశారు. దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఓబీసీలకు జనాభా దామాషా ప్రకారం రావాల్సిన ఫలాలు అందడం లేదని కవిత పేర్కొన్నారు. ఓబీసీల జనాభాపై చట్టబద్ధమైన లెక్కలు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణమన్నారు.

ఓబీసీ జ‌నాభాను ప్ర‌త్యేకంగా న‌మోదు చేయాలి..

జనగణనలో కులాల నమోదుకు అవకాశం ఉన్నప్పటికీ.. ఓబీసీలను ప్రత్యేకంగా గుర్తించే కాలమ్ లేకపోవడంతో ఇతర కులాల జాబితాలో చేర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల తరహాలోనే ఓబీసీల జనాభాను కూడా ప్రత్యేకంగా నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై దేశవ్యాప్తంగా ఓబీసీ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయని, వారి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఆదివాసీల జీవన విధానం, ఆచారాలు, సంప్రదాయాలు ప్రత్యేకమైనవని కవిత లేఖలో పేర్కొన్నారు. ప్రకృతిని, అడవిని ఆరాధించడం వారి జీవన విధానంలో భాగమని తెలిపారు. ఒక్కో ఆదివాసీ తెగకు ప్రత్యేక దేవతలు, పశువులు, పక్షులు, చెట్లను పూజించే సంప్రదాయాలు ఉన్నాయని వివరించారు.

ఆదివాసీల మ‌తాన్ని న‌మోదు చేయాలి..

గతంలో జనగణనలో ఆదివాసీల మతాన్ని ప్రత్యేకంగా నమోదు చేసినప్పటికీ.. ప్రస్తుత జనగణనలో ఆ అవకాశం లేకపోవడంపై వారిలో ఆందోళన నెలకొందన్నారు. వారి మతపరమైన గుర్తింపును కాపాడేలా ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని కోరారు. డిసెంబర్‌ నుంచి ఇంటింటి జనగణన ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలస్యం చేయకుండా అసెంబ్లీ, కౌన్సిల్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కవిత విజ్ఞప్తి చేశారు. ఓబీసీల జనాభా లెక్కలు, ఆదివాసీల మత గుర్తింపునకు సంబంధించిన అంశాలపై తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. జనాభా లెక్కలు కచ్చితంగా ఉంటేనే ఆయా వర్గాలకు తగిన ప్రాతినిధ్యం, హక్కులు దక్కుతాయని ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్:

Adivasi ReligionCensus 2026CM Revanth ReddyKavithaOBC Caste EnumerationOBC CensusSpecial Assembly SessionTelangana AssemblyTelangana Rakshana SenaTelugu NewsTribal Identity
Advertisement
Advertisement