త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sai Pallavi | సాయిప‌ల్ల‌వి కార‌ణంగా ప్ర‌భాస్‌ క‌ల్కి 2 షూటింగ్ క్యాన్సిల్ – అస‌లేమైందంటే?

ప్ర‌భాస్ క‌ల్కి 2 నుంచి దీపికా ప‌డుకోన్ త‌ప్పుకోవ‌డంతో ఆమె స్థానంలో సాయిప‌ల్ల‌విని హీరోయిన్‌గా మేక‌ర్స్ ఫైన‌ల్ చేశారు. ఈ సీక్వెల్ మూవీ షూటింగ్‌లో సోమ‌వారం నుంచి సాయిప‌ల్ల‌వి జాయిన్ కావాల్సింది. కానీ చివ‌రి నిమిషంలో షూటింగ్ వాయిదాప‌డింద‌ట‌.

N

Entertainment | Published On May 5, 2026, 3.14 pm IST

Sai Pallavi | సాయిప‌ల్ల‌వి కార‌ణంగా ప్ర‌భాస్‌ క‌ల్కి 2 షూటింగ్ క్యాన్సిల్ – అస‌లేమైందంటే?
Advertisement

Sai Pallavi |  తెలుగులో ఇప్ప‌టివ‌ర‌కు స్టార్ హీరోల‌తో సినిమాలు చేయ‌లేదు సాయిప‌ల్ల‌వి. నాని, వ‌రుణ్‌తేజ్ వంటి మిడ్ రేంజ్ క‌థానాయ‌కుల‌తోనే జోడి క‌ట్టింది. క‌ల్కి 2 మూవీతో ఫ‌స్ట్ టైమ్ స్టార్ లీగ్‌లోకి సాయిప‌ల్ల‌వి అడుగుపెట్ట‌బోతుంది. ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో మైథ‌లాజిక‌ల్ సైన్స్ ఫిక్ష‌న్ డ్రామాగా ఈ సీక్వెల్‌ తెర‌కెక్కుతోంది. క‌ల్కి పార్ట్ వ‌న్‌లో దీపికా ప‌డుకోన్ పోషించిన పాత్ర‌ను సీక్వెల్‌లో సాయిప‌ల్ల‌వి చేయ‌బోతుంది. ఎనిమిది గంట‌ల ప‌ని రూల్‌తో పాటు రెమ్యూన‌రేష‌న్ పెంచాలంటూ దీపికా ప‌డుకోన్ కండీష‌న్లు పెట్ట‌డంతో ఆమెను సినిమాను త‌ప్పించారు మేక‌ర్స్‌. దీపికా ప్లేస్‌లో ప‌లువురు టాప్ నాయిక‌ల పేర్ల‌ను ప‌రిశీలించిన ద‌ర్శ‌క‌నిర్మాత‌లు చివ‌ర‌కు సాయిప‌ల్ల‌విని ఫైన‌ల్ చేశారు.

షూటింగ్ క్యాన్సిల్‌...

గ్లామ‌ర్‌కు దూరంగా ప‌ర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్ర కావ‌డంతో సాయిప‌ల్ల‌వి కూడా ఈ సీక్వెల్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. ఇన్నాళ్లు బాలీవుడ్ సినిమాలు ఎక్‌దిన్‌, రామాయ‌ణ షూటింగ్‌ల‌తో బిజీగా ఉన్న సాయిప‌ల్ల‌వి ఇటీవ‌లే క‌ల్కి 2 కోసం డేట్స్ కేటాయించింద‌ట‌. సోమ‌వారం నుంచి ఈ సీక్వెల్ షూటింగ్‌లో అడుగుపెట్టాల‌ని అనుకుంద‌ట‌. ప్ర‌భాస్ , సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్‌లో కొన్ని కీల‌కమైన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించాల‌ని డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ప్లాన్ చేశారు. ఈ లేటెస్ట్ షెడ్యూల్ కోసం హైద‌రాబాద్‌లో భారీ సెట్ కూడా వేశార‌ట‌. కానీ చివ‌రి నిమిషంలో క‌ల్కి 2 షూటింగ్‌కు బ్రేక్ ప‌డిన‌ట్లు స‌మాచారం. అందుకు సాయిప‌ల్ల‌వి కార‌ణ‌మ‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

హెల్త్ కండీష‌న్‌...

స‌డెన్‌గా సాయిప‌ల్ల‌వి అనారోగ్యానికి గురైంద‌ట‌. ఆమె హెల్త్ కండీష‌న్‌ను దృష్టిలో మేక‌ర్స్ షూటింగ్‌ను క్యాన్సిల్ చేసిన‌ట్లు చెబుతోన్నారు. సాయిప‌ల్ల‌వి సెట్స్‌లో అడుగుపెట్ట‌క‌ముందే షూటింగ్‌కు ఆటంకాలు ఎదుర‌వ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

1100 కోట్లు...

క‌ల్కి 2లో క‌మ‌ల్‌హాస‌న్‌, అమితాబ్‌బ‌చ్చ‌న్‌, దిశా ప‌టానీ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. క‌ల్కి పార్ట్ వ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద 1100 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ స‌క్సెస్‌తో సీక్వెల్‌పై భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ప్ర‌స్తుతం క‌ల్కి 2తో పాటు ఫౌజీ, స్పిరిట్ సినిమాల‌తో ప్ర‌భాస్ బిజీగా ఉన్నారు. కాగా సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించిన బాలీవుడ్ డెబ్యూ మూవీ ఎక్ దిన్ ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ సినిమా డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

Advertisement
Advertisement