CM Vijay | తమిళనాడు చరిత్రలోనే తొలిసారి.. అసెంబ్లీలో సీఎం సీటును వదిలి మంత్రులతో కూర్చున్న విజయ్
CM Vijay | ఎంతో కాలంగా వస్తున్న సంప్రదాయానికి ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (CM Vijay) ముగింపు పలికారు. అసెంబ్లీలో సంప్రదాయ ముఖ్యమంత్రి సీటును వదిలి విజయ్ తన కేబినెట్ మంత్రులతో కలిసి కూర్చున్నారు.
CM Vijay | త్రినేత్ర.న్యూస్ : తమిళనాడు అసెంబ్లీలో (Tamil Nadu Assembly) అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఎంతో కాలంగా వస్తున్న సంప్రదాయానికి ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (CM Vijay) ముగింపు పలికారు. అసెంబ్లీలో సంప్రదాయ ముఖ్యమంత్రి సీటును వదిలి విజయ్ తన కేబినెట్ మంత్రులతో కలిసి కూర్చున్నారు.
సాధారణంగా ముఖ్యమంత్రి కోసం అసెంబ్లీలో ఓ ప్రత్యేకమైన సీటును కేటాయిస్తారు. ఆ సీటు స్పీకర్ కుర్చీకి చాలా దగ్గరగా ఉంటుంది. సీఎం సీటు పక్కన.. ముందు వరుసలో ఉన్న సీట్లలో సీనియారిటీని బట్టి మంత్రులు కూర్చుంటారు. ఏళ్లుగా ఇదే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అయితే, విజయ్ అనూహ్యంగా సీఎం కుర్చీని వదిలి మంత్రుల మధ్యలో కూర్చోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సాధారణంగా మంత్రులు లేదా ఎమ్మెల్యేలు తోటి సభ్యులతో మాట్లాడటానికి కాసేపు తమ స్థానాలు మారుతుంటారు. అయితే, ఒక సీఎం అసెంబ్లీలో తన సీటును కాదని మంత్రులకు కేటాయించిన సీట్లలోకి వెళ్లి కూర్చోవడం తమిళనాడు అసెంబ్లీ చరిత్రలోనే ఇదే తొలిసారి. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా మంత్రులకు కేటాయించిన సీట్లో కూర్చోలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. విజయ్ తీరు తమిళ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read..
గ్రాండ్ చెస్ టూర్‌లో చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా ఘనత
నేపాల్ విషాదం వేళ అమానవీయ ఘటన.. మహిళ మృతదేహం నుంచి చెవి పోగులు దోచుకున్న నీచులు
నేపాల్ జలప్రళయంలో 469 మంది మృతి.. 1,498 మంది ఆచూకీ గల్లంతు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CM Vijay | ఏడాదికి 3 సిలిండర్లు.. ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం వరాల జల్లు
ఆగస్టు 24, 2026

TFCC | తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజుకున్న వివాదం.. సెప్టెంబర్ నుంచి సినిమాల రిలీజ్ బంద్..!
ఆగస్టు 22, 2026

CM Vijay | విద్యార్థి నిరసనలపై విజయ్ సర్కార్ యూటర్న్.. వివాదాస్పద ఆదేశాలు రద్దు
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Praggnanandhaa | గ్రాండ్ చెస్ టూర్‌లో చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా ఘనత
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. ఐటీ షేర్ల ర్యాలీ..
- ●Konda Surekha | సీఎం రేవంత్ అపాయింట్మెంట్ కోరిన మంత్రి కొండా సురేఖ
- ●Tirupati Rao | రెండున్నరేండ్లు గడిచినా.. ఒక్క హామీ నెరవేర్చని కాంగ్రెస్ సర్కార్: తిరుపతి రావు
- ●Earrings Stolen | నేపాల్ విషాదం వేళ అమానవీయ ఘటన.. మహిళ మృతదేహం నుంచి చెవి పోగులు దోచుకున్న నీచులు
- ●Nepal Flash Floods | నేపాల్ జలప్రళయంలో 469 మంది మృతి.. 1,498 మంది ఆచూకీ గల్లంతు

Praggnanandhaa | గ్రాండ్ చెస్ టూర్‌లో చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా ఘనత

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. ఐటీ షేర్ల ర్యాలీ..

Konda Surekha | సీఎం రేవంత్ అపాయింట్మెంట్ కోరిన మంత్రి కొండా సురేఖ

Tirupati Rao | రెండున్నరేండ్లు గడిచినా.. ఒక్క హామీ నెరవేర్చని కాంగ్రెస్ సర్కార్: తిరుపతి రావు



