త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Konda Surekha | సీఎం రేవంత్ అపాయింట్‌మెంట్ కోరిన మంత్రి కొండా సురేఖ‌

G

Telangana | Published On Aug 28, 2026, 10.51 am IST

Konda Surekha | సీఎం రేవంత్ అపాయింట్‌మెంట్ కోరిన మంత్రి కొండా సురేఖ‌
Advertisement

Konda Surekha | త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌తి సంవ‌త్స‌రం సీఎం రేవంత్‌కు (Revanth Reddy) మంత్రులు కొండా సురేఖ‌ (Konda Surekha), సీత‌క్క రాఖీ క‌డుతున్నారు. అయితే ఇటీవ‌ల మంత్రి కొండా సురేఖ‌ కుమార్తె కొండా సుస్మిత ముఖ్య‌మంత్రిపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో.. ఆమె సీఎం రేవంత్‌కు రాఖీ (Rakhi Pournami) క‌డ‌తారా? అనే అంశం ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ క్ర‌మంలో ఆమె సీఎం రేవంత్ అపాయింట్‌మెంట్ కోరిన‌ట్లు తెలుస్తున్న‌ది. కానీ ఇంకా సీఎం అపాయింట్‌మెంట్ దొరకలేదని తెలుస్తోంది. కాగా, కొన్ని రోజులుగా మంత్రి కొండా సురేఖ పేరు చెబితేనే కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహంతో ఊగిపోతున్న విషయం తెలిసిందే. పరకాల టికెట్ విషయంలో సుస్మిత ఎపిసోడ్ తరువాత ఇప్పటివరకు సీఎంను సురేఖ కలవలేదు. ఒకవేళ సురేఖకు సీఎం అపాయింట్‌మెంట్ లభిస్తే.. వివాదం తరువాత ఆమె రేవంత్‌ను కలవడం ఇదే మొదటిసారి అవుతుంది.

మ‌రోవైపు మంత్రి సీతక్క (Seethakka) అధికార నివాసం ప్రజా భవన్‌‌లో రాఖీ వేడుకలు (Raksha Bandhan) ఘ‌నంగా నిర్వ‌హించారు. తన వ్యక్తిగత, భద్రత సిబ్బందికి రాఖీలు కట్టిన మంత్రి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రముఖులకు రాఖీ కట్టారు. తనకు రాఖీ కట్టిన మహిళా సిబ్బందికి నూతన వస్త్రాలు బహుకరించారు.

Advertisement
Advertisement