Praggnanandhaa | గ్రాండ్ చెస్ టూర్‌లో చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా ఘనత
Praggnanandhaa | భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద (Praggnanandhaa) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రతిష్ఠాత్మక గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్ టైటిల్‌ను సొంతం చేసుకొని ఆ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయుడిగా రికార్డుకెక్కాడు.
Praggnanandhaa | త్రినేత్ర.న్యూస్ : చెస్ ప్రపంచంలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రతిష్ఠాత్మక గ్రాండ్ చెస్ టూర్ (Grand Chess Tour) ఫైనల్స్ టైటిల్‌ను సొంతం చేసుకొని ఆ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయుడిగా రికార్డుకెక్కాడు.
అమెరికాలోని సెయింట్ లూయిస్ (Saint Louis)లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వరల్డ్ నంబర్ 2 ఫ్యాబియానో కరువానా (Fabiano Caruana)పై ఈ చెన్నై గ్రాండ్‌మాస్టర్ అద్భుతమైన విజయం సాధించాడు. అంతకు ముందు జరిగిన తొలి క్లాసిక్ గేమ్‌లో ప్రజ్ఞా కరువానాపై ఓటమి చవిచూశాడు. 6-0 తేడాతో ఓడిపోయాడు. ఆ తర్వాత రెండో క్లాసిక్ గేమ్‌ను 3-3 పాయింట్లతో డ్రా చేసుకున్నాడు. వరుసగా రెండు ర్యాపిడ్ గేమ్‌లలో అద్భుతంగా రాణించి ఆధిక్యంలోకి వచ్చాడు. ఫైనల్స్‌లో అద్భుతమైన కమ్‌బ్యాక్‌తో కరువానాపై 15-13 తేడాతో విజయం సాధించాడు.
ఈ విజయంతో గ్రాండ్ చెస్ టూర్ టైటిల్‌ను సాధించిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద తన పేరును చరిత్రలో లిఖించుకున్నాడు. ఛాంపియన్‌గా నిలిచిన అతడికి దాదాపు రూ.2 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. అంతేకాకుండా ఈ విజయంతో వచ్చే ఏడాది జరగనున్న గ్రాండ్ చెస్ టూర్‌లో నేరుగా పాల్గొనే అర్హతను కూడా ప్రజ్ఞానంద సొంతం చేసుకున్నాడు. ఇక ఈ విజయం తర్వాత చెన్నై గ్రాండ్ మాస్టర్ మాట్లాడుతూ.. ఆరు పాయింట్లు వెనుకబడి ఉండటంతో ఫైనల్ మ్యాచ్‌లో గెలుస్తానన్న ఆశ తనకు లేదని చెప్పారు. ఫాబీపై ఒక్క మ్యాచ్ గెలవడమే కష్టమని చెప్పారు. అలాంటిది ర్యాపిడ్‌లో రెండు గేమ్స్‌లో విజయం సాధించినట్లు తెలిపారు.
Also Read..
నేపాల్ విషాదం వేళ అమానవీయ ఘటన.. మహిళ మృతదేహం నుంచి చెవి పోగులు దోచుకున్న నీచులు
నేపాల్ జలప్రళయంలో 469 మంది మృతి.. 1,498 మంది ఆచూకీ గల్లంతు
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Tirupati Rao | రెండున్నరేండ్లు గడిచినా.. ఒక్క హామీ నెరవేర్చని కాంగ్రెస్ సర్కార్: తిరుపతి రావు
- ●Earrings Stolen | నేపాల్ విషాదం వేళ అమానవీయ ఘటన.. మహిళ మృతదేహం నుంచి చెవి పోగులు దోచుకున్న నీచులు
- ●Nepal Flash Floods | నేపాల్ జలప్రళయంలో 469 మంది మృతి.. 1,498 మంది ఆచూకీ గల్లంతు
- ●KTR | న్యాయాన్ని అపహాస్యం చేసేలా ఎన్సీఎల్టీ తీరు..: కేటీఆర్
- ●Government Teachers | ఆర్ఎస్ఎస్ మార్చ్‌లో పాల్గొన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు.. సస్పెండ్ చేసిన సర్కార్
- ●Traffic Restrictions | హైదరాబాద్ మారథాన్.. ఆగస్టు 30న నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

Tirupati Rao | రెండున్నరేండ్లు గడిచినా.. ఒక్క హామీ నెరవేర్చని కాంగ్రెస్ సర్కార్: తిరుపతి రావు

Earrings Stolen | నేపాల్ విషాదం వేళ అమానవీయ ఘటన.. మహిళ మృతదేహం నుంచి చెవి పోగులు దోచుకున్న నీచులు

Nepal Flash Floods | నేపాల్ జలప్రళయంలో 469 మంది మృతి.. 1,498 మంది ఆచూకీ గల్లంతు

KTR | న్యాయాన్ని అపహాస్యం చేసేలా ఎన్సీఎల్టీ తీరు..: కేటీఆర్




