Earrings Stolen | నేపాల్ విషాదం వేళ అమానవీయ ఘటన.. మహిళ మృతదేహం నుంచి చెవి పోగులు దోచుకున్న నీచులు
Earrings Stolen | ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్‌లో అమానవీయ ఘటన వెలుగులులోకి వచ్చింది. వరదల్లో కొట్టుకుపోతున్న ఓ మహిళ మృతదేహం చెవికి ఉన్న బంగారు కమ్మల కోసం ఇద్దరు వ్యక్తులు చేసిన పని సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది.
International | Published On Aug 28, 2026, 10.08 am IST
Earrings Stolen | త్రినేత్ర.న్యూస్ : నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన వినాశకరమైన ఆకస్మిక వరదలు (Nepal Flood) పెను విషాదాన్ని మిగిల్చాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ఆచూకీ తెలియడం లేదు. ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఆ దేశం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇంతటి విషాద సమయంలో అక్కడ చోటుచేసుకున్న అమానవీయ ఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది.
నారాయణి నదిలో (Narayani River) కొట్టుకుపోతున్న ఓ మహిళ మృతదేహాన్ని ఇద్దరు వ్యక్తులు గమనించారు. వెంటనే చెక్కల సాయంతో బాధితురాలి జుట్టు పట్టుకుని మృతదేహాన్ని ఒడ్డుకు లాగారు. అక్కడ ఆమె చెవులకు ఉన్న బంగారు పోగులను దొంగిలించారు (Earrings Stolen). ఆ తర్వాత మృతదేహాన్ని వదిలేశారు. అక్కడే ఉన్న కొందరు స్థానికులు ఈ తతంగాన్నంతా తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విపత్తుల సమయంలో తోటివారికి సాయం చేయాల్సింది పోయి.. శవాలపై ఉన్న నగలను దోచుకోవడం సిగ్గు చేటు అంటూ విమర్శలు గుప్పించారు.
వైరల్ వీడియో ఆధారంగా చిత్వాన్ జిల్లా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భరత్పూర్ ప్రాంతంలో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితులు 25 ఏళ్ల మదన్ గురుంగ్, 38 ఏళ్ల ఉమేశ్ చౌదరిలుగా గుర్తించారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని దోచుకోవటం లేదా ఇతర అమానవీయ ఘటనలకు పాల్పడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
मृतकको कानको मुन्द्रा चोरी गर्ने व्यक्तिहरु नियन्त्रणमा लिएको सम्बन्धमा । pic.twitter.com/pnPlnQPn9j
— Nepal Police (@NepalPoliceHQ) August 27, 2026
469కి చేరిన మృతుల సంఖ్య
హిమాలయ దేశం నేపాల్‌లో బుధవారం సంభవించిన జలప్రళయం (Nepal Flash Floods) పెను విషాదాన్ని మిగిల్చింది. ప్రకృతి చేసిన విలయతాండవానికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య 469కి చేరింది. 1,498 మంది ఆచూకీ గల్లంతైంది. గల్లంతైన వారిలో 290 మంది భారతీయులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
Also Read..
నేపాల్ జలప్రళయంలో 469 మంది మృతి.. 1,498 మంది ఆచూకీ గల్లంతు
న్యాయాన్ని అపహాస్యం చేసేలా ఎన్సీఎల్టీ తీరు..: కేటీఆర్
హైదరాబాద్ మారథాన్.. ఆగస్టు 30న నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
తాజావార్తలు
- ●Nepal Flash Floods | నేపాల్ జలప్రళయంలో 469 మంది మృతి.. 1,498 మంది ఆచూకీ గల్లంతు
- ●KTR | న్యాయాన్ని అపహాస్యం చేసేలా ఎన్సీఎల్టీ తీరు..: కేటీఆర్
- ●Government Teachers | ఆర్ఎస్ఎస్ మార్చ్‌లో పాల్గొన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు.. సస్పెండ్ చేసిన సర్కార్
- ●Traffic Restrictions | హైదరాబాద్ మారథాన్.. ఆగస్టు 30న నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
- ●SIR | ఇంటి పేరుతో ఎన్యుమరేషన్ ఫారం.. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్‌కి SIR నోటీసులు
- ●Raksha Bandhan | అనుబంధాల పండుగ.. రక్షాబంధన్..! రాఖీ వెనుక.. ఎన్నో కథలు..!

Nepal Flash Floods | నేపాల్ జలప్రళయంలో 469 మంది మృతి.. 1,498 మంది ఆచూకీ గల్లంతు

KTR | న్యాయాన్ని అపహాస్యం చేసేలా ఎన్సీఎల్టీ తీరు..: కేటీఆర్

Government Teachers | ఆర్ఎస్ఎస్ మార్చ్‌లో పాల్గొన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు.. సస్పెండ్ చేసిన సర్కార్

Traffic Restrictions | హైదరాబాద్ మారథాన్.. ఆగస్టు 30న నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు





