Nepal Flash Floods | నేపాల్ జలప్రళయంలో 469 మంది మృతి.. 1,498 మంది ఆచూకీ గల్లంతు
Nepal Flash Floods | నేపాల్ జలప్రళయంలో (Nepal Flash Floods)మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య 469కి చేరింది. 1,498 మంది ఆచూకీ గల్లంతైంది. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోసారి వరద ముప్పు పొంచి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రజలు ఎటునుంచి మృత్యువు వెంటాడుతుందో అన్న భయంతో బిక్కుబిక్కు మంటూ కాలం వెల్లదీస్తున్నారు.
International | Published On Aug 28, 2026, 9.39 am IST
Nepal Flash Floods | త్రినేత్ర.న్యూస్ : హిమాలయ దేశం నేపాల్‌లో బుధవారం సంభవించిన జలప్రళయం (Nepal Flash Floods) పెను విషాదాన్ని మిగిల్చింది. ప్రకృతి చేసిన విలయతాండవానికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య 469కి చేరింది. 1,498 మంది ఆచూకీ గల్లంతైంది. గల్లంతైన వారిలో 290 మంది భారతీయులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఇక ఈ వరదలకు ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. దుకాణాలు, రోడ్లు, వంతెనలు వంటి మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. జలవిద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా నువాకోట్, రసువా జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రభావిత ప్రాంతాల్లో ఎటు చూసినా బురద, వరద, భవన శిథిలాలే దర్శనమిస్తున్నాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
అనేక గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దీంతో మారుమూల ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజల వద్దకు సహాయ బృందాలు చేరుకోవడం కష్టంగా మారింది. ప్రభావిత ప్రాంతాల నుంచి హెలికాప్టర్ల ద్వారా 796 మందిని రక్షించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. వీరిలో 50 మంది విదేశీయులు కూడా ఉన్నట్లు చెప్పారు. ఈ వరదల్లో 910 మంది గల్లంతైనట్లు నేపాల్ అధికారులు చెబుతుండగా.. మరో 558 మంది ఆచూకీ తెలియడం లేదని టిబెట్ అధికారులు తెలిపారు. దీంతో సరిహద్దు ఇరువైపులా గల్లంతైన వారి మొత్తం సంఖ్య 1,468కి చేరింది.
ప్రభావిత జిల్లాల నుంచి సుమారు 800 మందికిపైగా స్థానికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీమ్ హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో నివాస ప్రాంతాలు, నదీ తీరాలు, దిగువ ప్రాంతాల్లో గాలింపు కొనసాగిస్తున్నాయి. ప్రభావిత జిల్లాల్లో అత్యధికంగా చిత్వాన్ జిల్లా నుంచి 137 మృతదేహాలను వెలికితీసినట్లు నేపాల్ పోలీసులు తెలిపారు. రసువా, నువాకోట్, ధాడింగ్, గోర్ఖా, తనాహున్, నవల్పరాసి ప్రాంతాల నుంచి కూడా మృతదేహాలను వెలికితీసినట్లు చెప్పారు.
మరోవైపు ఆచూకీ తెలియని వారిలో కనీసం 44 మంది నేపాల్ సైనికులు, 28 మంది నేపాల్ పోలీసు సిబ్బంది, 13 మంది సాయుధ పోలీసు దళ సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. జలవిద్యుత్ ప్రాజెక్టులు, కస్టమ్స్ కార్యాలయాల్లో పనిచేస్తున్న సుమారు 160 మంది కూడా గల్లంతైనట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఆ ప్రాంతంలో మరోసారి వరద ముప్పు పొంచి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రజలు ఎటునుంచి మృత్యువు వెంటాడుతుందో అన్న భయంతో బిక్కుబిక్కు మంటూ కాలం వెల్లదీస్తున్నారు.
Also Read..
న్యాయాన్ని అపహాస్యం చేసేలా ఎన్‌సీఎల్టీ తీరు..: కేటీఆర్
ఆర్ఎస్ఎస్ మార్చ్‌లో పాల్గొన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు.. సస్పెండ్ చేసిన సర్కార్
ఢిల్లీ పెద్దలే బాస్‌లు: కాంగ్రెస్‌లో మంత్రులపై చర్యలు ఎలా ఉంటాయో తెలుసా?
సంబంధిత వార్తలు

Nepal Flash Floods | నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతు : విదేశాంగ శాఖ
ఆగస్టు 27, 2026

Hyderabad girl goes missing in Nepal floods | నేపాల్ వరదల్లో హైదరాబాద్ యువతి గల్లంతు.. ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల ఎదురుచూపులు
ఆగస్టు 27, 2026

Nepal Floods | ఒక్క మంచు ఫలకం సృష్టించిన విధ్వంసం
ఆగస్టు 27, 2026
తాజావార్తలు
- ●Government Teachers | ఆర్ఎస్ఎస్ మార్చ్‌లో పాల్గొన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు.. సస్పెండ్ చేసిన సర్కార్
- ●Traffic Restrictions | హైదరాబాద్ మారథాన్.. ఆగస్టు 30న నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
- ●SIR | ఇంటి పేరుతో ఎన్యుమరేషన్ ఫారం.. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్‌కి SIR నోటీసులు
- ●Raksha Bandhan | అనుబంధాల పండుగ.. రక్షాబంధన్..! రాఖీ వెనుక.. ఎన్నో కథలు..!
- ●కాంగ్రెస్ డిసిప్లిన్ చక్రం: మంత్రులపై చర్యలు ఎలా తీసుకుంటారు? కొండా సురేఖ ఎపిసోడ్‌తో పూర్తి వివరాలు
- ●Horoscope | ఆగస్టు 28 రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఖర్చులు అధికం!

Government Teachers | ఆర్ఎస్ఎస్ మార్చ్‌లో పాల్గొన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు.. సస్పెండ్ చేసిన సర్కార్

Traffic Restrictions | హైదరాబాద్ మారథాన్.. ఆగస్టు 30న నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

SIR | ఇంటి పేరుతో ఎన్యుమరేషన్ ఫారం.. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్‌కి SIR నోటీసులు

Raksha Bandhan | అనుబంధాల పండుగ.. రక్షాబంధన్..! రాఖీ వెనుక.. ఎన్నో కథలు..!



