త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IIT Bombay | ఐఐటీ బాంబే హాస్ట‌ల్ గ‌దుల్లో సీలింగ్ ఫ్యాన్లు తొల‌గింపు.. విద్యార్థుల వ‌రుస ఆత్మ‌హ‌త్య‌ల‌తో యాజ‌మాన్యం కీల‌క నిర్ణ‌యం

IIT Bombay | విద్యార్థుల వ‌రుస ఆత్మ‌హ‌త్య‌ల‌తో (Student Suicide) ఐఐటీ బాంబే (IIT Bombay) తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. హాస్ట‌ల్‌లోని అన్ని గ‌దుల్లో సీలింగ్ ఫ్యాన్ల (Ceiling Fans)ను తొల‌గించాల‌ని నిర్ణ‌యించింది. వాటి ప్లేస్‌లో వాల్ మౌంటెడ్ ఫ్యాన్ల‌ను (Wall Mounted Fans) ఏర్పాటు చేయాల‌ని ఆదేశించింది.

D

National | Published On Sep 22, 2026, 3.01 pm IST

IIT Bombay | ఐఐటీ బాంబే హాస్ట‌ల్ గ‌దుల్లో సీలింగ్ ఫ్యాన్లు తొల‌గింపు.. విద్యార్థుల వ‌రుస ఆత్మ‌హ‌త్య‌ల‌తో యాజ‌మాన్యం కీల‌క నిర్ణ‌యం
Advertisement

IIT Bombay | త్రినేత్ర‌.న్యూస్ : విద్యార్థుల వ‌రుస ఆత్మ‌హ‌త్య‌ల‌తో ముంబైలోని ప్ర‌తిష్ఠాత్మ‌క ఐఐటీ బాంబే (IIT Bombay) వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారింది. వ‌రుస ఆత్మ‌హ‌త్య‌ల‌పై విద్యార్థులు ఆందోళ‌న‌కు దిగారు. ఈ నేప‌థ్యంలో ఐఐటీ యాజ‌మాన్యం తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. హాస్ట‌ల్‌లోని అన్ని గ‌దుల్లో సీలింగ్ ఫ్యాన్ల (Ceiling Fans)ను తొల‌గించాల‌ని నిర్ణ‌యించింది. వాటి ప్లేస్‌లో వాల్ మౌంటెడ్ ఫ్యాన్ల‌ను ఏర్పాటు చేయాల‌ని ఆదేశించింది. దీంతో ఇప్ప‌టికే వాల్ మౌంటెడ్ ఫ్యాన్లను అమ‌ర్చే ప్ర‌క్రియ‌ను యాజ‌మాన్యం చేప‌ట్టింది. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేస్తున్న‌ట్లు ఐఐటీ బాంబే యంత్రాంగం తెలిపింది.

ఐఐటీ బాంబేలో ఇంజినీరింగ్ విద్యార్థి సాహిల్ ఆత్మ‌హ‌త్య తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. ప‌వాయిలోని ఐఐటీ బాంబే క్యాంప‌స్‌లో ఇంజినీరింగ్ రెండో సంవ‌త్స‌రం చ‌దువుతున్న సాహిల్.. ఇటీవ‌లే జ‌రిగిన ప‌రీక్ష‌లో ప్ర‌శ్నాప‌త్రాన్ని చాట్‌జీపీటీలో (ChatGPT) అప్‌లోడ్ చేసి స‌మాధానాలు వెతుకుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఆ స‌మ‌యంలో ఇన్విజిలేట‌ర్‌గా ఉన్న ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్ల ఈ విష‌యాన్ని అక‌డ‌మిక్ డిసిప్లిన‌రీ క‌మిటీ దృష్టికి తీసుకెళ్లాడు. అయితే, ఇన్‌స్టిట్యూట్ అధికారులు స‌ద‌రు విద్యార్థిపై ఎలాంటి క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లూ తీసుకోలేదు. డిపార్ట్‌మెంట్ హెడ్ సాహిల్‌ను పిలిపించి కేవ‌లం కౌన్సెలింగ్ ఇచ్చి వ‌దిలేశారు. అయితే, ఈ ఘ‌ట‌న అనంత‌రం సాహిల్ త‌న హాస్ట‌ల్ గ‌దిలో ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. విద్యార్థి మృతిపై త‌ల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌డుతున్నారు.

మ‌రోవైపు విద్యార్థుల ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో ప్రొఫెస‌ర్ సూర్యనారాయణను డీన్ విధుల నుంచి యాజ‌మాన్యం తొల‌గించిన విష‌యం తెలిసిందే. దీనిపై విద్యార్థి సంఘాలు స్పందించాయి. ప్రొఫెసర్ త‌ప్పుచేసిన‌ట్లు తాము భావించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశాయి. విచార‌ణ నిష్ప‌క్ష‌పాతంగా జ‌ర‌గాల‌నే ఉద్దేశంతో ఆయ‌న్ని విధుల నుంచి ప‌క్క‌న‌పెట్టాల‌ని మాత్ర‌మే కోరిన‌ట్లు తెలిపాయి. అదేవిధంగా తమ నిరసన ఉద్దేశం అకడమిక్ మోసాన్ని సమర్థించడం కాదని స్పష్టం చేశాయి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా సంస్థలో మార్పులు రావాలని కోరుతూ నిరసన చేపట్టినట్లు చెప్పారు. సాహిల్ మృతి అత్యంత దురదృష్టకరమని విద్యార్థి ప్ర‌తినిధులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Also Read..

రాముడి పేరును బద్నాం చేయకండి.. విరాళాల చోరీపై కాంగ్రెస్‌

దేశంలో ఎల్పీజీ కొర‌త లేదు.. వదంతులు న‌మ్మొద్దు : కేంద్రం

'ఇది కొత్త ఐఫోనా?' అని అడిగి.. ఆటోలో వెళ్తున్న యువతి చేతిలో నుంచి ఐఫోన్ 18 ప్రో లాక్కెళ్లిన దొంగలు

Advertisement
Advertisement