త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IIT Bombay | విద్యార్థి ఆత్మ‌హ‌త్య కేసు.. ప్రొఫెస‌ర్‌ను సెల‌వుపై పంపిన ఐఐటీ బాంబే

IIT Bombay | ఐఐటీ బాంబే విద్యార్థి 22 ఏళ్ల సాహిల్ వకోడే ఆత్మ‌హ‌త్య కేసులో (Student Suicide) కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోప‌న‌లు ఎదుర్కొంటున్న ప్రొఫెస‌ర్ సూర్య‌నారాయ‌ణ దూళ్ల‌ను (Professor Suryanarayana Doolla) యాజ‌మాన్యం సెల‌వుపై పంపింది. ఆయ‌న్ని పోలీసులు విచారించ‌నున్నారు.

D

National | Published On Sep 23, 2026, 10.14 am IST

IIT Bombay | విద్యార్థి ఆత్మ‌హ‌త్య కేసు.. ప్రొఫెస‌ర్‌ను సెల‌వుపై పంపిన ఐఐటీ బాంబే
Advertisement

IIT Bombay | త్రినేత్ర న్యూస్ : ఐఐటీ బాంబే (IIT Bombay) విద్యార్థి 22 ఏళ్ల సాహిల్ వకోడే ఆత్మ‌హ‌త్య (Student Suicide) ఘ‌ట‌న‌పై ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో యాజ‌మాన్యం తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. విద్యార్థి ఆత్మ‌హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ప్రొఫెస‌ర్ సూర్య‌నారాయ‌ణ దూళ్ల‌ను (Professor Suryanarayana Doolla) యాజ‌మాన్యం సెల‌వుపై పంపింది. ఇప్ప‌టికే ఆయ‌న‌పై ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించ‌డం, కుల వివ‌క్ష చ‌ట్టాల కింద కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న్ని పోలీసులు విచారించ‌నున్నారు. మ‌రోవైపు విద్యార్థుల నిర‌స‌న కార‌ణంగా ప‌రీక్ష స‌మ‌యంలో ఇన్విజిలేట‌ర్‌గా ఉన్న ప్రొఫెస‌ర్ దూళ్ల‌ను డీన్ ప‌ద‌వి నుంచి ఐఐటీ బాంబే యాజ‌మాన్యం తొల‌గించిన విష‌యం తెలిసిందే.

ప‌వాయిలోని (Powai) ఐఐటీ బాంబే క్యాంప‌స్‌లో ఇంజినీరింగ్ రెండో సంవ‌త్స‌రం చ‌దువుతున్న సాహిల్ శుక్ర‌వారం రాత్రి త‌న హాస్ట‌ల్ గ‌దిలో ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. ప‌రీక్ష‌లో అత‌డు చాట్‌జీపీటీ వాడుతూ దొరికిపోయిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. దీంతో ఆ స‌మ‌యంలో ఇన్విజిలేట‌ర్‌గా ఉన్న దూళ్ల ఈ విష‌యాన్ని అక‌డ‌మిక్ డిసిప్లిన‌రీ క‌మిటీ దృష్టికి తీసుకెళ్లాడు. అయితే, ఇన్‌స్టిట్యూట్ అధికారులు స‌ద‌రు విద్యార్థిపై ఎలాంటి క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లూ తీసుకోలేదు. అయితే, సాహిల్ ప‌రీక్ష‌లో కాపీ కొడుతూ దొరికిపోయిన‌ట్లు యాజ‌మాన్యం చేసిన ప్ర‌క‌ట‌న‌పై తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

మృతుడి కుటుంబ స‌భ్యులు సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న కుమారుడిని కులం పేరుతో వేధించార‌ని, అవ‌మానించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్ల తనను మానసికంగా హింసించినట్లు సాహిల్ తమతో చెప్పాడని మృతుడి త‌ల్లి సోనాలి మీడియాకు తెలిపారు. సాహిల్ పరీక్షలో చాట్‌జీపీటీ ఉపయోగించి కాపీ కొట్టాడంటూ గతంలో సంస్థ చేసిన ప్రకటనపై అతని తల్లి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఐఐటీ బాంబే క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. మ‌రోవైపు ప్రొఫెస‌ర్ దూళ్లకు ఐఐటీ బాంబే ఫ్యాక‌ల్టీ ఫోరం మ‌ద్ద‌తుగా నిలిచింది. ఆయ‌న నిబంధ‌న‌ల ప్రకారమే వ్యవహరించారని స్ప‌ష్టం చేసింది.

Also Read..

ఢిల్లీలో మ‌రో ఘ‌ట‌న‌.. క‌ళాశాల విద్యార్థినిని వెంబ‌డించి వేధించిన ఆక‌తాయిలు

సీఎం గారు ప్రేక్ష‌కుల‌తో క‌లిసి ప్రీమియ‌ర్ షో చూస్తా.. అనుమ‌తివ్వాలంటూ నాని రిక్వెస్ట్‌.. రేవంత్ రెడ్డి ఏమ‌న్నారంటే?

ఈ నెల 25 నుంచి 27 వ‌రకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?

Advertisement
Advertisement