త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Student Dies | రంగారెడ్డిలో దారుణం..! సెలవు ఇవ్వలేదని విద్యార్థి ఆత్మహత్య..

Student Dies | చదువుల ఒత్తిడి.. ఇంటికి వెళ్లాలన్న ఆరాటం.. సెలవు కోసం చేసిన విజ్ఞప్తిని నిరాక‌రించ‌డంతో చివరకు ఓ విద్యార్థి ప్రాణం తీసుకున్నాడు. ఆదిభట్ల పరిధిలోని శ్రీచైతన్య కాలేజీలో కార్తీక్‌ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది.

P

Hyderabad | Published On Nov 20, 2026, 8.59 pm IST

Student Dies | రంగారెడ్డిలో దారుణం..! సెలవు ఇవ్వలేదని విద్యార్థి ఆత్మహత్య..
Advertisement

Student Dies | చదువుల ఒత్తిడి.. ఇంటికి వెళ్లాలన్న ఆరాటం.. సెలవు కోసం చేసిన విజ్ఞప్తిని నిరాక‌రించ‌డంతో చివరకు ఓ విద్యార్థి ప్రాణం తీసుకున్నాడు. ఆదిభట్ల పరిధిలోని శ్రీచైతన్య కాలేజీలో కార్తీక్‌ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. సెలవు అడిగినా కాలేజీ యాజమాన్యం ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. విద్యార్థి మృతదేహాన్ని కాలేజీ యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా తరలించినట్లు ఆరోపణలు రావడం వివాదానికి దారితీసింది. తమ బిడ్డ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చిన ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కార్తీక్‌ మృతికి కాలేజీ యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగాయి. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. విద్యార్థులపై చదువుల ఒత్తిడి, వారి మానసిక పరిస్థితి, కళాశాలల్లో సెలవులు, ఇతర సమస్యలపై మరోసారి చర్చ మొదలైంది.

Advertisement
Advertisement