త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MMTS Trains | ఈ నెల 25 నుంచి 27 వ‌రకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?

MMTS Trains | వినాయ‌క‌ భ‌క్తుల‌కు ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే (SCR) శుభ‌వార్త చెప్పింది. హైద‌రాబాద్‌లో గ‌ణేశ్ నిమ‌జ్జ‌నానికి వ‌చ్చే భ‌క్తుల‌కు కోసం ఎంఎంటీఎస్ స‌ర్వీసుల‌ను (MMTS Trains) రాత్రి స‌మ‌యంలో కూడా న‌డుప‌నుంది.

G

Hyderabad | Published On Sep 23, 2026, 8.05 am IST

MMTS Trains | ఈ నెల 25 నుంచి 27 వ‌రకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?
Advertisement

MMTS Trains | త్రినేత్ర‌.న్యూస్‌: వినాయ‌క‌ భ‌క్తుల‌కు ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే (SCR) శుభ‌వార్త చెప్పింది. హైద‌రాబాద్‌లో గ‌ణేశ్ నిమ‌జ్జ‌నానికి వ‌చ్చే భ‌క్తుల‌కు కోసం ఎంఎంటీఎస్ స‌ర్వీసుల‌ను (MMTS Trains) రాత్రి స‌మ‌యంలో కూడా న‌డుప‌నుంది. నిమజ్జనం (Ganesh Immersion) జరిగే రోజుల్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాత్రంతా 8 ప్రత్యేక ఎంఎంటీఎస్‌ రైళ్లను న‌డుప‌నున్న‌ట్లు తెలిపింది. ఈనెల 25 నుంచి 27 వరకు రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నడుస్తాయని వెల్ల‌డించింది.

ఏయే రూట్ల‌లో అంటే..

జీఎస్‌హెచ్‌-1: సికింద్రాబాద్ నుంచి రాత్రి 23.50 గంట‌ల‌కు బ‌య‌లుదేరి నాంప‌ల్లికి 00.20 గంట‌ల‌కు చేరుకుంటుంది.
జీహెచ్ఎల్‌-2: నాంప‌ల్లి నుంచి రాత్రి 00.30 గంట‌ల‌కు బ‌య‌ల్దేరి లింగంప‌ల్లికి 1.20 గంట‌ల‌కు చేరుతుంది.
జీఎల్‌హెచ్‌-3: లింగంప‌ల్లి నుంచి రాత్రి 01.50 గంట‌ల‌కు బ‌య‌ల్దేరి నాంప‌ల్లికి 2.40 గంట‌ల‌కు చేరుతుంది.
జీహెచ్ఎస్‌-4: నాంప‌ల్లి నుంచి తెల్ల‌వారుజామున 03.30 గంట‌ల‌కు బ‌య‌ల్దేరి సికింద్రాబాద్‌కు 4.40 గంట‌ల‌కు వ‌స్తుంది.
జీహెచ్ఎల్‌-5: నాంప‌ల్లి నుంచి రాత్రి 23.10 గంట‌ల‌కు బ‌య‌ల్దేరి లింగంప‌ల్లికి 23.55 గంట‌ల‌కు చేరుతుంది.
జీఎల్ఎఫ్‌-6: లింగంప‌ల్లి నుంచి రాత్రి 00.10 గంట‌ల‌కు బ‌య‌ల్దేరి ఫ‌ల‌క్‌నుమాకు 1.50 గంట‌ల‌కు చేరుతుంది.
జీఎఫ్ఎస్‌-7: ఫ‌ల‌క్‌నుమా నుంచి తెల్ల‌వారుజామున 2.20 గంట‌ల‌కు బ‌య‌ల్దేరి సికింద్రాబాద్‌కి 3.00 గంట‌ల‌కు చేరుతుంది.
జీఎస్‌హెచ్-8: సికింద్రాబాద్‌ నుంచి తెల్ల‌వారుజామున 4.00 గంట‌ల‌కు బ‌య‌ల్దేరి లింగంప‌ల్లికి 4.40 గంట‌ల‌కు చేరుతుంది.

Advertisement
Advertisement