త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | సీఎం గారు ప్రేక్ష‌కుల‌తో క‌లిసి ప్రీమియ‌ర్ షో చూస్తా.. అనుమ‌తివ్వాలంటూ నాని రిక్వెస్ట్‌.. రేవంత్ రెడ్డి ఏమ‌న్నారంటే?

Revanth Reddy | ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల, హీరో నాని కాంబినేష‌న్‌లో వ‌స్తున్న `ది ప్యార‌డైజ్` (The Paradise) సినిమా గురువారం విడుద‌ల కానుంది. బుధ‌వారం (సెప్టెంబ‌ర్ 23న‌) సాయంత్రం ప్రీమియ‌ర్ షో ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.

G

Movies | Published On Sep 23, 2026, 10.02 am IST

Revanth Reddy | సీఎం గారు ప్రేక్ష‌కుల‌తో క‌లిసి ప్రీమియ‌ర్ షో చూస్తా.. అనుమ‌తివ్వాలంటూ నాని రిక్వెస్ట్‌.. రేవంత్ రెడ్డి ఏమ‌న్నారంటే?
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల, హీరో నాని కాంబినేష‌న్‌లో వ‌స్తున్న `ది ప్యార‌డైజ్` (The Paradise) సినిమా గురువారం విడుద‌ల కానుంది. బుధ‌వారం (సెప్టెంబ‌ర్ 23న‌) సాయంత్రం ప్రీమియ‌ర్ షో ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని ఓ థియేటర్‌లో `ప్యార‌డైజ్‌` ప్రీమియర్ షో (Premiere Show) చూసేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తోపాటు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి హీరో నాని (Nani) విజ్ఞప్తి చేశారు. ఎక్స్ వేదిక‌గా నాని చేసిన అభ్య‌ర్ధ‌న‌కు సీఎం రేవంత్ స్పందించారు. ప్రజా భద్రత, రద్దీ నియంత్రణ కోసం స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తును పరిశీలించిన అనంతరం పోలీసులు త‌గిన‌ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

తెలంగాణ‌కు చెందిన ప్ర‌తిభావంతుడైన‌ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ద‌ర్శ‌కత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం కోం మీ అంకిత‌భావానికి, అలాగే భ‌ద్ర‌తా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను గౌర‌వించినందుకు ధ‌న్య‌వాదాలు అంటూ నానిని సీఎం రేవంత్‌ అభినందించారు.

ఆ అనుభూతి ప్ర‌త్యేకం..

ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని థియేటర్లలో సినిమా చూడటం ఎంతో ప్రత్యేకమైన అనుభూతి అని నాని అన్నారు. ‘ప్రేక్షకుల కోసం తీసిన సినిమాను వారితో కలిసి ఆస్వాదించాలనేది నా కోరిక. ప్రేక్షకుల స్పందనను ప్రత్యక్షంగా చూడటం నటుడిగా నాకు తృప్తి నిస్తుంది. ప్రభుత్వం సూచించిన అన్ని నిబంధనలు, భద్రతా చర్యలను పాటిస్తాం. నా అభ్యర్థనను పరిశీలించగలరు’ అని నాని త‌న‌ పోస్ట్‌లో కోరారు.

Advertisement
Advertisement