త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

College Student | ఢిల్లీలో మ‌రో ఘ‌ట‌న‌.. క‌ళాశాల విద్యార్థినిని వెంబ‌డించి వేధించిన ఆక‌తాయిలు

College Student | ఢిల్లీ (Delhi)లో మ‌రో షాకింగ్ ఘ‌ట‌న వెలుగు చూసింది. క‌ళాశాల విద్యార్థినిని (College Student) కొంద‌రు ఆక‌తాయిలు వేధింపుల‌కు గురి చేశారు.

D

National | Published On Sep 23, 2026, 9.52 am IST

College Student | ఢిల్లీలో మ‌రో ఘ‌ట‌న‌.. క‌ళాశాల విద్యార్థినిని వెంబ‌డించి వేధించిన ఆక‌తాయిలు
Advertisement

College Student | త్రినేత్ర న్యూస్ : దేశ రాజ‌ధాని ఢిల్లీ (Delhi)లో కొంద‌రు ఆక‌తాయిలు రెచ్చిపోయారు. ఓ క‌ళాశాల విద్యార్థినిని (College Student) ఏడిపించారు. నడిరోడ్డుపై ఆమెను వెంబ‌డించి వేధింపుల‌కు గురిచేశారు (Harassed By 2 Men). సెప్టెంబ‌ర్ 11 అర్ధ‌రాత్రి స‌మ‌యంలో పంచశీల పార్క్ మెట్రో స్టేషన్ (Panchsheel Park metro station) సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. 21 ఏళ్ల కాలేజీ విద్యార్థిని సాకేత్‌లోని ఓ ఆఫీస్‌లో ఇంట‌ర్న్‌షిప్ ముగించుకొని అర్ధ‌రాత్రి స‌మ‌యంలో ఇంటికి బ‌య‌ల్దేరింది. హౌజ్ ఖాస్ (Hauz Khas) మీదుగా ఆమె స్కూటీలో వెళ్తుండ‌గా బైక్‌పై వ‌చ్చిన‌ ఇద్ద‌రు ఆక‌తాయిలు యువ‌తిని వెంబ‌డించారు. యువ‌తి ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తిస్తూ వేధింపుల‌కు గురి చేశారు. అంత‌టితో ఆగ‌ని ఆక‌తాయిలు త‌మ బైక్‌తో యువ‌తి స్కూటీని ఢీ కొట్టారు. దీంతో ఆమె రోడ్డుపై ప‌డిపోయింది. అనంత‌రం 100 మీట‌ర్ల మేర స్కూటీతో స‌హా ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో బాధితురాలికి తీవ్ర గాయాల‌య్యాయి.

స్పందించిన స్థానికులు యువ‌తిని వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ఈ మేర‌కు ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాధితురాలు ప్ర‌స్తుతం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌లో చికిత్స పొందుతున్న‌ట్లు వెల్ల‌డించారు. నిందితుల‌ను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ల‌ను ప‌రిశీలించిన‌ట్లు చెప్పారు.

Also Read..

సీఆర్‌పీఎఫ్‌లో 521 హెడ్‌కానిస్టేబుల్‌, కానిస్టేబుల్ పోస్టులు..

ఈ నెల 25 నుంచి 27 వ‌రకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?

అనాథ‌లు, వృద్ధుల‌కు అండ‌గా స‌ప‌ర్య‌.. బృహత్తర కార్యక్రమానికి న‌టుడు కాదాంబ‌రి కిర‌ణ్‌ శ్రీకారం

Advertisement
Advertisement