త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jajula Srinivas Goud | 50 శాతం రిజ‌ర్వేష‌న్ల ప‌రిమితి ఎత్తేయ‌కుంటే అగ్గి రాజేస్తం

Jajula Srinivas Goud | బీసీల‌కు 50 శాతం రిజ‌ర్వేష‌న్ల ప‌రిమితి ఎత్తేయ‌కుంటే దేశంలో అగ్గి రాజేస్తామ‌ని.. రాజ్యాంగాన్ని స‌వ‌రించైనా బీసీ రిజ‌ర్వేష‌న్లు పెంచాల‌ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

S

National | Published On Oct 9, 2026, 4.59 pm IST

Jajula Srinivas Goud | 50 శాతం రిజ‌ర్వేష‌న్ల ప‌రిమితి ఎత్తేయ‌కుంటే అగ్గి రాజేస్తం
Advertisement
  • రాజ్యాంగాన్ని స‌వ‌రించైనా బీసీ రిజ‌ర్వేష‌న్లు పెంచాలే
  • డిసెంబర్ 14, 15న చేప‌ట్టే ధ‌ర్నాల‌కు సంపూర్ణ‌ మ‌ద్ద‌తిస్తం
  • బీసీ వ్య‌తిరేక వైఖ‌రి మార‌కుంటే బీజేపీకిదే చివ‌రి పాల‌నైత‌ది
  • ఢిల్లీ ధ‌ర్నాలో జాజుల, వీహెచ్, మల్లు రవిల ఘాటు హెచ్చరిక

Jajula Srinivas Goud | త్రినేత్ర న్యూస్‌: బీసీల‌కు 50 శాతం రిజ‌ర్వేష‌న్ల ప‌రిమితి ఎత్తేయ‌కుంటే దేశంలో అగ్గి రాజేస్తామ‌ని.. రాజ్యాంగాన్ని స‌వ‌రించైనా బీసీ రిజ‌ర్వేష‌న్లు పెంచాల‌ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ వ్య‌తిరేక వైఖ‌రి మార‌కుంటే బీజేపీకి ఇదే చివ‌రి పాల‌న అవుతుంద‌ని హెచ్చ‌రించారు. ఢిల్లీలో ఏపీ/ తెలంగాణ భవన్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక రిజర్వేషన్లపై విధించిన పరిమితిని ఎత్తేయాల‌ని డిమాండ్ చేస్తూ శుక్ర‌వారం నిరసన ధర్నా చేపట్టారు. ఈ సంద‌ర్భంగా వీ హనుమంతరావు, ఎంపీల ఫోరం అధ్యక్షులు మల్లు రవి, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కేసన శంకర్ రావుతో క‌లిసి ఆయ‌న మాట్లాడారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 12 సంవత్సరాల పాలనలో బీసీలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. బీసీ కులగణన చేపట్టకుండా, బీసీ రిజర్వేషన్లు పెంచకుండా బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని ధ్వ‌జ‌మెత్తారు. ఇదే వైఖరి మున్ముందు అవలంబిస్తే దేశంలో ప్రస్తుత బీజేపీ పాలన చివరి పాలనగా మిగిలిపోతుందనిహెచ్చరించారు. సామాజిక రిజర్వేషన్ల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు అన్న చందంగా ఉందన్నారు. తెలంగాణ, బీహార్ రాష్ట్రాలలో జనాభా లెక్కలు ఉన్న బీసీ రిజర్వేషన్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను బీసీ రిజర్వేషన్లు పెంచుకోకుండా అడ్డుకుంటుందని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇదే సమస్య ఉత్తన్నమైన దేశంలోని ఇంకా అనేక రాష్ట్రాలు రిజర్వేషన్ల సమస్య అగ్గి రాజుకుంటున్న కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తన్నట్టుగా వ్యవ‌హరిస్తుందని మండిపడ్డారు.

రాష్ట్రాల‌కే అధికారమివ్వాలి..

సుప్రీంకోర్టు తీర్పులను అధిగమించాలంటే పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్రాలకే కట్ట బే ట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఒకటి దేశవ్యాప్తంగా అగ్గి రాజేస్తామని జాజుల కేంద్రాన్ని తీవ్రంగా హెచ్చరించారు.

పేరుకే బీసీ ప్ర‌ధాని..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మాజీ ఎంపీ వి హనుమంతరావు, ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి మాట్లాడుతూ.. బీజేపీ నేతలకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో చేసిన చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. పేరుకే బీసీ ప్రధాని కానీ బీసీలకు నరేంద్ర మోదీ ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. బీసీ రిజర్వేషన్ పెంచుతూ బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెడితే ఇండియా కూటమి తరఫున బేష‌రతుగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. బీసీ కులగణన సాధన కోసం బీసీ సంఘాలు డిసెంబర్ 14, 15 తేదీల్లో ఢిల్లీలో చేపట్టనున్న ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు వారు ప్రకటించారు.

ఏపీలో 34 శాతం రిజర్వేష‌న్లు అమ‌లు చేయాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్ రావు మాట్లాడుతూ 50 శాతం రిజర్వేషన్లు పెంచొద్ద‌ని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింద‌ని.. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ రాష్ట్ర శాఖలు తక్షణమే అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లాల‌న్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీతో ఒప్పించాల‌ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కేంద్రంలో, రాష్ట్రంలోనూ బీసీల నిరసనను ఎదుర్కోవాలని ఎన్డీఏ కూటమిని ఆయన హెచ్చరించారు.

ఈ ఆందోళనలో రాష్ట్రీయ ఓబీసీ మహాసంగ్ మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి సచిన్ రాజోలుకర్, బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాం కురుమ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, జాతీయ ప్రధాన కార్యదర్శి కుమ్మరి క్రాంతి కుమార్, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బీ మని మంజరి సాగర, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్, ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, బీసీ ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి సారయ్య గౌడ్,ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరసింహ నాయక్ మహిళా నేతలు సంధ్యారాణి, దేవిక రాజేశ్వరి, గూడూరు భాస్కర్, గోదా వరుణ్ కుమార్ గౌడ్, బ్రహ్మచారి, బండి గారి రాజు, నరసింహ చారి, మణికంఠ, జస్వంత్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement